Telangana ACB
-
ఫార్ములా కారు రేసు కేసులో ఏసీబీ దూకుడు.. నోటీసులు జారీ
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈ-కారు రేసు కేసు దర్యాప్తులో ఏసీబీ దూకుడు పెంచింది. తాజాగా ఎఫ్ఈవో కంపెనీకి ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. కారులో రేసులో భాగంగా రూ.55కోట్లను ఎఫ్ఈవోకు బదిలీ చేసిన హెచ్ఎండీఏ. ఈ క్రమంలో ఎఫ్ఈవో సంస్థ సీఈవో స్టేట్మెంట్ను ఏసీబీ రికార్డ్ చేయనుంది. ఈ నేపథ్యంలో విచారణ కోసం ఏసీబీని నాలుగు వారాల సమయం కోరారు ఎఫ్ఈవో సంస్థ సీఈవో. దీంతో, ఏసీబీ ఎలాంటి నిర్ణయం చెబుతుందో తెలియాల్సి ఉంది.ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేసు రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో నిందితులను మరోమారు విచారణకు పిలవాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఏ–1గా ఉన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో పాటు ఏ–2.. ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్, ఏ–3.. హెచ్ఎండీఏ మాజీ సీఈ బీఎల్ఎన్ రెడ్డిలకు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో కేటీఆర్‌కు మరోసారి నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇక, ఇప్పటికే ఈనెల 9న కేటీఆర్‌ను ఏడు గంటలపాటు విచారించిన విషయం తెలిసిందే. తాజాగా శనివారం.. కార్ రేసు నిర్వహణలో స్పాన్సర్‌గా వ్యవహరించిన ఏస్ నెక్ట్స్‌జెన్, దాని అనుబంధ సంస్థ గ్రీన్కో ఎండీ చలమలశెట్టి అనిల్‌కుమార్‌ను విచారించిన అధికారులు కీలక వివరాలు రాబట్టినట్టు తెలిసింది. రేస్ నిర్వహణ, అందుకు సంబంధించి జరిగిన ఆర్థిక లావాదేవీలు, రేస్ నుంచి సంస్థ తప్పుకోవడం.. అందుకు దారి తీసిన పరిస్థితులు ఇలా పలు కోణాల్లో ఆయన్ను అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈసారి మరింత లోతుగా..చలమలశెట్టి ఇచ్చిన కీలక సమాచారం, గతంలో సేకరించిన పత్రాల ఆధారంగా మరోమారు కేటీఆర్‌ను లోతుగా ప్రశ్నించాలని ఏసీబీ భావిస్తున్నట్టు సమాచారం. అప్పటి మంత్రి ఆదేశాల మేరకు తాము కేవలం విధులు నిర్వర్తించామని అర్వింద్‌కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలు తమ స్టేట్మెంట్లలో పేర్కొన్నారు. ఇక కేటీఆర్.. మంత్రిగా తానే ఆదేశాలు జారీ చేశానని, రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యానే తాను ఆదేశించానని, నిధుల చెల్లింపులలో నిబంధనలు పాటించడం అన్నది అధికారులకు సంబంధించిన అంశమని పలుమార్లు స్పష్టం చేశారు. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని, మరోమారు కేటీఆర్, అర్వింద్‌కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలను విచారించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే ఈసారి కేటీఆర్ విచారణ సందర్భంగా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. -
కేటీఆర్‌దే బాధ్యత.. ఎఫ్ఐఆర్ క్వాష్ అరుదైన నిర్ణయం: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి కేటీఆర్ (KTR) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ కొట్టేసిన నేపథ్యంలో ఆర్డర్ కాపీలో కీలక విషయాలను వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులకు మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి బాధ్యుడిగా ఉండాలి. హెచ్ఎండీఏ నిధులు సంబంధిత మంత్రి పర్యవేక్షణలోనే ఉంటాయని ప్రాధమికంగా తేలింది. అవి దుర్వినియోగం అయ్యాయా? లేదా? అనేది దర్యాప్తులో తేలాల్సి ఉందని వ్యాఖ్యలు చేసింది.కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేత అనంతరం హైకోర్టు ఆర్డర్ కాపీ విడుదల చేసింది. 45అంశాలతో 35పేజీల ఆర్డర్ కాపీని విడుదల చేసింది. ఈ సందర్బంగా.. ఉన్నత న్యాయస్థానం (Telangana High Court) పలు కీలక వ్యాఖ్యలు చేసింది. దర్యాప్తు సంస్థల అధికారాలను కోర్టులు అడ్డుకోలేవు. ఎఫ్ఐఆర్ క్వాష్ చేయడానికి కొన్ని పరిమితులు ఉంటాయి. హెచ్ఎండీఏ ఖాతాలోని డబ్బును నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేశారనే ఆరోపణలున్నాయి. రాష్ట్ర ఖజానాకు నష్టం చేకూర్చి ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలకు లబ్ధి చేకూర్చారని అభియోగాలున్నాయి. ఆరోపణల మేరకు ఏసీబీ అధికారులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అప్పటి ప్రభుత్వంలో పురపాలక మంత్రిగా ఉన్న కేటీఆర్ హెచ్ఎండీఏ నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలున్నాయి. ఎఫ్ఐఆర్ను కొట్టివేసే అధికారాన్ని కోర్టు కొన్ని సందర్భాల్లో మాత్రమే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.పోలీసుల దర్యాప్తు అన్యాయంగా ఉంటేనే కోర్టు తన అధికారాన్ని వినియోగించుకోవాల్సి ఉంటుంది. పోలీసులకు ఉన్న అధికారాలను కోర్టు ఎప్పుడూ అన్యాయంగా తీసుకోదు. ఏసీబీ చేసిన ఆరోపణల్లోకి వెళ్లి దర్యాప్తు చేయాలని కోర్టు భావించడం లేదు. ఈ కేసులో నేరపూరిత కుట్ర జరిగిందని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి బాధ్యత గల హోదాలో ఉన్నారు. మరో నిందితుడితో కలిసి కేటీఆర్ హెచ్ఎండీఏ(HMDA) నిధులను అక్రమంగా వినియోగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మంత్రి మండలి, ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే పిటిషనర్ హెచ్ఎండీఏ నుంచి భారీ మొత్తంలో నగదు బదిలీ చేయించినట్లు ఆరోపణలున్నాయి. సొంత లబ్ధి కోసమా.. లేక మూడో వ్యక్తి ప్రయోజనం కోసం నగదు బదిలీ జరిగిందా.. అనేదానిపై దర్యాప్తు జరగాల్సి ఉంది.అయితే, నిధుల దుర్వినియోగం జరగలేదని పిటిషనర్ వాదించడాన్ని కోర్టు నమ్మడం లేదు. దర్యాప్తులో ఈ విషయాలన్నీ తేలాల్సి ఉంది. నేరం జరిగిందని చెప్పడానికి ప్రాథమిక ఆరోపణలు మాత్రమే ఎఫ్ఐఆర్(FIR)లో ఉంటాయి. పూర్తిస్థాయి వివరాలన్నీ ఎఫ్ఐఆర్లో పొందుపర్చాల్సిన అవసరం లేదు. డిసెంబర్ 18న ఫిర్యాదు అందితే, 19న ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. డిసెంబర్ 20న పిటిషనర్ క్వాష్ పిటిషన్ వేశారు. ఆధారాలు సేకరించాల్సిన సమయం దర్యాప్తు సంస్థలకు కావాలి. దర్యాప్తు విషయంలో హైకోర్టు జోక్యం చేసుకోదల్చుకోలేదు’ అని ధర్మాసనం కామెంట్స్ చేసింది. ఇది కూడా చదవండి: ఏసీబీ దూకుడు.. ‘సుప్రీం’కు చేరిన ఈ-కార్ రేసు పంచాయితీ! -
సుప్రీం కోర్టుకు ఈ-కార్ రేసు పంచాయితీ!
హైదరాబాద్, సాక్షి: ఫార్ములా ఈ కార్ రేసు కేసులో శరవేగంగా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కేటీఆర్ క్వాష్‌పై హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఏసీబీ దూకుడు ప్రదర్శించింది. ఈ కేసులో కీలకంగా ఉన్న గ్రీన్కో, దాని అనుబంధ సంస్థల్లో తనిఖీలు నిర్వహించింది. అదే సమయంలో ఈ కేసులో నిందితుల ఇళ్లపై సోదాలకు కోర్టు నుంచి సెర్చ్ వారెంట్(Search Warrant) తెచ్చుకుంది.ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా.. కోర్టు అనుమతితో ఏ క్షణమైనా వీళ్ల నివాసాల్లో తనిఖీలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. గ్రీన్ కో కంపెనీ ద్వారా జరిగిన ఒప్పందం, లావాదేవీలపై వాళ్లను విచారించే అవకాశం కనిపిస్తోంది. అలాగే.. హెచ్ఎండీ ద్వారా రేసు కోసం జరిగిన ఒప్పంద పత్రాలను సేకరించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు.. ఫార్ములా ఈ కార్ రేసు(Formula E Car Race Case) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ పంచాయితీ సుప్రీం కోర్టుకు చేరింది. తెెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేవియట్ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఫాార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ గనుక సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే.. తమ వాదనలు సైతం వినాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఇక.. హైకోర్టులో చుక్కెదురు కావడంతో సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో కేటీఆర్ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే బీఆర్ఎస్ లీగల్ టీం, బీఆర్ఎస్(BRS Party) కీలక నేతలతో ఆయన సంప్రదింపులు జరిపారు. హైకోర్టు తీర్పు కాపీ అందిన వెంటనే ఆయన సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసే అవకాశం ఉంది. -
సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో (సీసీఎస్) ఏసీపీగా పని చేస్తున్న టీఎస్ ఉమామహేశ్వరరావును ఏసీబీ అరెస్ట్ చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆయన, ఆయన బంధువుల నివాసాలపై మంగళవారం దాడులు చేశారు. తెలంగాణ, ఏపీలోని ఉమామహేశ్వరావు ఇళ్లు, ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లతో సహా మొత్తం 11 చోట్ల సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో నగదు, బంగారం, ఆస్తి పత్రాలతో పాటు రెండు బ్యాంకు లాకర్లను గుర్తించినట్లు తెలిసింది. మంగళవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ప్రారంభమైన సోదాలు రాత్రి వరకు కొనసాగాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీపీ ఉమామహేశ్వరరావును అరెస్టు చేసినట్లు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్రబాబు తెలిపారు. ‘ప్రీలాంచ్’ నిందితులకు వత్తాసుపై ఫిర్యాదులు ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో వేలాది మంది నుంచి డబ్బు వసూలు చేసి నిండా ముంచిన సాహితీ ఇన్ఫ్రా సంస్థ, దాని అనుబంధ సంస్థలపై అనేక కేసులు నమోదయ్యాయి. రూ.వేల కోట్లతో ముడిపడి ఉన్న ఈ స్కామ్‌కు సంబంధించిన కేసులు అన్నీ సీసీఎస్‌కు బదిలీ అయ్యాయి. దాదాపు 50 కేసుల దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసిన ఉన్నతాధికారులు దాని బాధ్యతలు ఉమామహేశ్వరరావుకు అప్పగించారు. దీన్ని తనకు అనువుగా మార్చుకున్న ఉమా మహేశ్వరరావు నిందితుల నుంచి భారీ మొత్తం డిమాండ్ చేసి వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితులకు వత్తాసు పలుకుతూ బాధితులకు తీవ్ర అన్యాయం చేశారనే ఫిర్యాదులు ఏసీబీకి అందాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఫిర్యాదులూ వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న ఏసీబీ దర్యాప్తు చేపట్టింది. ఏపీలోని బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు మంగళవారం ఉదయం అశోక్‌నగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో ఉన్న ఉమామహేశ్వరరావు ఇల్లు, నేరేడ్మెట్, ఎల్బీనగర్‌ల్లోని స్నేహితుల ఇళ్లు, ఆయన సోదరుడు, మామ ఇళ్ళతో సహా ఏపీలోని భీమవరం, విశాఖపట్నం, నర్సీపట్నంల్లోని బంధువుల ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. అనకాపల్లి జిల్లా రోలుగుంటలో ఉమామహేశ్వరరావు దూరపు బంధువు దివంగత మడ్డు తమ్మునాయుడు ఇంట్లో ఐదుగురు సభ్యులతో కూడిన తెలంగాణ ఏసీబీ అధికారుల బృందం తనిఖీలు చేసింది. తమ్మునాయుడు భార్య నుంచి వారి ఇల్లు, భూములు తదితర ఆదాయ వనరుల వివరాలు సేకరించారు. పత్రాలు, డైరీల్లో సందీప్ అనే పేరు దాడుల్లో పలు కీలక డాక్యుమెంట్లతో పాటు రూ.38 లక్షల నగదు, 60 తులాల బంగారం, 17 ఆస్తులకు సంబంధించిన పత్రాలు, 5 ప్లాట్ల వివరాలు లభించినట్లు తెలిసింది. ఉమామహేశ్వరరావు బినామీల పేరిట భారీగా ఆస్తులు కూడగట్టారని ఏసీబీ అధికారులు గుర్తించారు. బ్యాంకు లాకర్ల విషయంలో ఉమామహేశ్వరరావు సహకరించట్లేదని, వాటిని తెరవడానికి కొంత సమయం పడుతుందని అధికారులు చెప్తున్నారు. ఉమామహేశ్వరరావు నుంచి స్వా«దీనం చేసుకున్న పత్రాలు, డైరీల్లో సందీప్ అనే పేరును అధికారులు గుర్తించారు. తన వెంట నిత్యం ల్యాప్‌టాప్ ఉంచుకునే ఉమామహేశ్వరరావు అందులో తాను ఎవరి నుంచి ఎంత తీసుకున్నరీ రాసుకున్నట్లు తెలిసింది. దీన్ని స్వాదీనం చేసుకున్న ఏసీబీ అధికారులు అందులోని వివరాలు విశ్లేషిస్తున్నారు. సోదాలు పర్యవేక్షించిన జేడీ సు«దీంద్రబాబు ఉమామహేశ్వరరావు, సందీప్ కలిసి అనేక చోట్ల పెట్టుబడులు పెట్టారని ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ సందీప్ ఎవరు? అతడి పాత్ర ఏంటి? అనేది లోతుగా ఆరా తీస్తున్నారు. సీసీఎస్‌లోని ఉమామహేశ్వరరావు చాంబర్లో తనిఖీలు చేపట్టి ,ఆయన దర్యాప్తు చేసిన కేసుల వివరాలు ఆరా తీస్తున్నారు. జేడీ సుదీంద్రబాబు మంగళవారం రాత్రి అశోక్‌నగర్‌లోని ఉమామహేశ్వరరావు ఇంటికి వెళ్లి సోదాలను పర్యవేక్షించారు. ఉమామహేశ్వరరావును అరెస్టు చేశామని, బుధవారం కోర్టులో ప్రవేశపెడతామని తెలిపారు. గతంలో అబిడ్స్ ఇన్స్పెక్టర్గా పని చేసిన ఉమామహేశ్వరరావు అక్కడ ఓ మహిళా కానిస్టేబుల్‌తో దురుసుగా ప్రవర్తించి సస్పెండ్ అయ్యారు. విధుల్లోకి తిరిగి వచి్చన ఆయన్ను రేంజ్ అధికారులు సైబరాబాద్ కమిషనరేట్‌కు అలాట్ చేశారు. జవహర్‌నగర్ పోలీసుస్టేషన్ ఇన్స్పెక్టర్గా పని చేస్తుండగా ఓ నేర స్థలికి వెళ్లిన ఆయన అక్కడ ఓ మహిళ ముందు అభ్యంతరకంగా ప్రవర్తిస్తూ వివాదాస్పదుడు కావడంతో మరోసారి సస్పెండ్ అయ్యారు. ఇబ్రహీంపట్నం ఏసీపీగా పని ఉమామహేశ్వరరావు ఎన్నికల ముందు జరిగిన బదిలీల్లో సీసీఎస్‌కు వచ్చారు. -
బినామీలుగా సంబంధంలేని వ్యక్తులు!
సాక్షి, హైదరాబాద్: భూవినియోగ మార్పు, భవన అనుమతుల్లో అక్రమాలతో భారీగా ఆర్జించిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్, రెరా కార్యదర్శి శివబాలకృష్ణ.. చాలా తెలివిగా తనకు బంధుత్వం, దగ్గరి సంబంధమేదీ లేని వ్యక్తులను బినామీలుగా పెట్టుకుని వందల కోట్ల రూపాయల ఆస్తులు కొనుగోలు చేసినట్టు ఏసీబీ అధికారులు చెప్తున్నారు. తెలిసినవారైతే అనుమానం వస్తుందని భావించి ఇలా వ్యవహరించారని.. అధికారులు, రాజకీయ నేతల సహకారంతో వందల కోట్ల విలువ చేసే భూములను ఆర్జించారని అంటున్నారు. శివబాలకృష్ణపై ఆదాయానికి మించి ఆస్తుల కేసులో కోర్టులో దాఖలు చేసిన 45పేజీల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను వెల్లడించారు. సహకరించిన అధికారుల పాత్రపైనా విచారణ శివ బాలకృష్ణ ఇంటితోపాటు పీర్జాదిగూడలో రమాదేవి, జూబ్లీహిల్స్ ప్రమోద్‌కుమార్, మాదాపూర్‌లో సందీప్‌రెడ్డి, బాచుపల్లిలో సత్యనారాయణమూర్తి ఇళ్లు, ఇతర కార్యాలయాలు కలిపి మొత్తం 18 చోట్ల సోదాలు చేశామని.. భారీగా స్థిర, చరాస్తుల డాక్యుమెంట్లను గుర్తించామని రిమాండ్ రిపోర్టులో అధికారులు వివరించారు. ‘‘బాలకృష్ణ ఇంట్లో స్వాధీనం చేసుకున్న 50 స్థిర, చరాస్తుల డాక్యుమెంట్లను పరిశీలించాం. పట్టణాల్లో విల్లాలు, ఇళ్లతోపాటు నాగర్‌కర్నూల్‌లో 12.13 ఎకరాలు, అబ్దుల్లాపూర్, భువనగిరి, చేవెళ్ల, యాదగిరిగుట్ట, సిద్దిపేట తదితర ప్రాంతాల్లో భూములు ఉన్నట్టు గుర్తించాం. స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల మేరకు స్థిరాస్తుల విలువ రూ.4.9 కోట్లుగా ఉంది. బహిరంగ మార్కెట్లో వీటి విలువ అంతకు 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అలాగే రూ.83,80,000 నగదు, నాలుగు కార్లు, రూ.8.26 కోట్ల విలువైన బంగారం, వెండితోపాటు పలు వస్తువులు సీజ్ చేశాం. 155 డాక్యుమెంట్లు, 4 బ్యాంక్ పాస్‌బుక్‌లు, ఖరీదైన వాచీలు, సెల్ఫోన్లు, లాకర్ పత్రాలు, ఎల్ఐసీ బాండ్లను స్వాధీనం చేసుకున్నాం. వీటిలో బినామీలను విచారించాల్సి ఉంది. అలాగే ఈ ఉదంతంలో ఇతర అధికారుల పాత్రపైనా దర్యాప్తు జరపాల్సి ఉంది..’’ అని అధికారులు పేర్కొన్నారు. రాజకీయ నాయకులూ సహకరించారు లేఔట్ల అనుమతుల కోసం శివబాలకృష్ణ పెద్ద ఎత్తున లంచాలు డిమాండ్ చేసేవారని.. రెరా సెక్రటరీ హోదాలోనూ పలు అవకతవకలకు పాల్పడ్డారని ఏసీబీ అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. బాలకృష్ణ హయాంలో అనుమతులు ఇచ్చిన వాటిపై దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. అక్రమాలకు తనవారు అవసరమని భావించిన బాలకృష్ణ బంధువులను ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు నియమించుకున్నారని.. కొందరు రాజకీయ నాయకులు కూడా సహకరించారని పేర్కొన్నారు. సోదాల్లో పట్టుబడిన ఆస్తులు, వస్తువులకు సంబంధించిన వివరాలపై ఎంత అడిగినా.. బాలకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు సహకరించలేదన్నారు. అన్ని వివరాలు బయటపడాలంటే ఇప్పటికే అరెస్టయి చంచల్‌గూడ జైలులో ఉన్న బాలకృష్ణను తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. డ్రైవర్ పేరిట రూ.20 కోట్ల ఆస్తులు బాలకృష్ణ డ్రైవర్ పేరిట నగర శివార్లలో రూ.20 కోట్లకుపైగా (మార్కెట్ రేట్ల ప్రకారం) విలువైన భూములు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారానికి సంబంధించి పలు జిల్లాల రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, ఉద్యోగులు, బ్యాంకు లాకర్ల నుంచి ఆధారాలు సేకరిస్తున్నారు. ఆ ఆధారాలను బట్టి ఈ కేసుతో సంబంధమన్న వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. బినామీల్లో ఒకరు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నట్టు గుర్తించి వివరాలు సేకరిస్తున్నట్టు తెలిసింది. హెచ్ఎండీఏ పరిధిలో ఏ పని జరగాలన్నా తొలుత ఆయన బినామీలను సంప్రదించాకే అధికారుల వద్దకు వెళ్లేలా బాలకృష్ణ ప్రత్యేకంగా ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు కూడా విచారణలో తేలిందని ఏసీబీ వర్గాలు చెప్తున్నాయి. -
బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను ఏసీబీ మరో వారం రోజుల కస్టడీ కోరనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో బాలకృష్ణ ఆమోదించిన ఫైల్స్, బినామీ ఆస్థులపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. మరోవైపు.. బాలకృష్ణ రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలను అధికారులు వెల్లడించారు. కాగా, లేఅవుట్ అనుమతుల కోసం బాలకృష్ణ భారీగా లంచాలు డిమాండ్ చేసినట్లు రిమాండ్ రిపోర్ట్ పేర్కొన్నారు. అప్లికేషన్లలో తప్పులు ఉన్నాయని లాభాలు పొందినట్టు తెలిపారు. ప్లాట్స్ నిర్మాణాల్లో విల్లాలను సైతం లంచంగా బాలకృష్ణ తీసుకున్నాడు. బాలకృష్ణ ఆధ్వర్యంలో హెచ్ఎండీఏ, రెరాలో భారీగా అక్రమాలు జరిగినట్టు స్పష్టం చేశారు. హెచ్ఎండీఏలోని మూడు జోన్లపై బాలకృష్ణకు మంచిపట్టు ఉందని గుర్తించారు. ఇక, హెచ్ఎండీఏలోని కీలక పోస్టులో బాలకృష్ణ సుదీర్ఘంగా పనిచేశారు. మరోవైపు.. బాలకృష్ణను కస్టడీలోకి తీసుకున్నాక ఏసీబీ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనుంది. ఇదే సమయంలో బాలకృష్ణకు సహాయం చేసిన అధికారులపై కూడా విచారించనున్నారు. ఇదిలా ఉండగా.. వట్టి నాగులపల్లిలో ప్రభుత్వ భూముల యాజమాన్యం, వినియోగ హక్కుల మార్పిడిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అక్రమాలు జరిగిన భూముల ఫైల్స్‌పై సాంకేతిక కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. వట్టి నాగులపల్లిలో ఎలక్షన్ కోడ్‌కు కొద్దిరోజుల ముందే పెద్ద ఎత్తున భూ వినియోగ మార్పిడి జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఆ సమయంలో హెచ్ఎండీఏ డైరెక్టర్‌గా లేకపోయినా ఫైల్స్ ఆమోదంలో బాలకృష్ణ పాత్రపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇక, హెచ్ఎండీఏ నుండి ఆరు నెలల క్రితమే బదిలీ అయి తెలంగాణ రేరా సెక్రటరీగా బాలకృష్ణ విధులు నిర్వహిస్తున్నారు. దీంతో, బాలకృష్ణ హయాంలో ఇచ్చిన అక్రమ అనుమతులపై ఏసీబీ దర్యాప్తు చేపట్టింది. అయితే, బాలకృష్ణ తన దగ్గరి బంధువులను ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా నియమించుకుని అక్రమాలకు పాల్పడినట్టు అధికారులు గుర్తించారు. కొందరు పొలిటికల్ లీడర్లు కూడా అక్రమాలకు మధ్యవర్తులుగా వ్యవహరించినట్టు సమాచారం. -
నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీలో కొనసాగుతున్న ఏసీబీ తనిఖీలు
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీలో రెండో రోజు ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎగ్జిబిషన్ సొసైటీలో నిధులు దుర్వినియోగం జరిగినట్లు ఏసీబీకి ఫిర్యాదు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్‌గా మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆరేళ్లు పనిచేశారు. ఆయన ప్రెసిడెండట్‌గా ఉన్న సమయంలో సొసైటీలో మెంబర్‌షిప్‌లు ఇస్టానుసారంగా ఇచ్చారని ఏసీబీకి ఫిర్యాదు అందింది. దీంతో సొసైటీ ఆడిట్ సెక్షన్లో రెండు రోజు దనిఖీల్లో భాగంగా ఏసీబీ రికార్డులను పరిశీలిస్తున్నారు. -
ఓటుకు కోట్లు... ఆశ చూపింది సెబాస్టియనే..!
సాక్షి,హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డి గెలుపు కోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.5 కోట్లు లంచం ఇస్తామని ప్రలోభపెట్టింది ఈ కేసులో రెండో నిందితునిగా ఉన్న బిషప్ హ్యారీ సెబాస్టియన్ అని ఏసీబీ ప్రత్యేక కోర్టుకు నివేదించింది. ఈ కుట్రలో సెబాస్టియన్ పాత్రకు సంబంధించి అన్ని సాంకేతిక ఆధారాలు ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు సెబాస్టియన్ దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌పై గురువారం ఏసీబీ అదనపు ఎస్పీ రమణకుమార్ కౌంటర్ దాఖలు చేశారు. ‘‘ఓటుకు కోట్లు కేసులో సెబాస్టియన్ పాత్రకు సంబంధించి స్పష్టమైన ఆధారాలున్నాయి. సెబాస్టియన్ ఫోన్లో కుట్రకు సంబంధించిన ఆధారాలు లభ్యమయ్యాయి. నామినేటెడ్ ఎమ్మెల్యేను ఓటు కోసం ప్రలోభపెట్టడం అవినీతి నిరోధక చట్టం కింద నేరం. ఈ కేసులో తనను అక్రమంగా ఇరికించారన్న సెబాస్టియన్ వాదనలో నిజం లేదు. స్టీఫెన్‌సన్‌తో ముందుగా ఫోన్లో మాట్లాడిందని సెబాస్టియన్. అడ్వాన్స్‌గా 50 లక్షల రూపాయలు ఇచ్చేందుకు రేవంత్‌రెడ్డితో కలసి సెబాస్టియన్ స్టీఫెన్సన్ సూచించిన అపార్ట్‌మెంట్‌కు వచ్చారు. కేసు నమోదు చేసిన తర్వాత సెబాస్టియన్ సెల్‌ఫోన్‌ను ఫోరెన్సిక్ పరిశీలనకు పంపగా అనేక ఆధారాలు లభించాయి’’ అని తెలిపారు. ( ఓటుకు కోట్లు కుట్ర నిరూపిస్తాం: ఏసీబీ) అంతేకాక ‘‘అభియోగాల నమోదుపై 2018 మార్చి 5 నుంచి దాదాపు రెండున్నర ఏళ్లుగా నిందితులు సమయం తీసుకుంటూనే ఉన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈనెల 9న స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేందర్‌రావు అభియోగాలు నమోదు చేయాలని మరోసారి ప్రత్యేక కోర్టును కోరారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న సండ్ర వెంకట వీరయ్య, రుద్ర ఉదయసింహలు గత అక్టోబరు 12న డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేయగా.. ఇతర నిందితులు డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేసుకోవాలని లేదా నేరుగా వాదనలు వినిపించుకోవాలని న్యాయమూర్తి సూచించారు. అయితే సెబాస్టియన్ తరఫు న్యాయవాది పలు వాయిదాలు తీసుకున్నారు. ఇప్పుడు డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు విచారణను జాప్యం చేసేందుకే ఒకరి తర్వాత ఒకరు డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన డిశ్చార్జ్ పిటిషన్‌ను కొట్టివేయండి’’ అని కౌంటర్లో కోరారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం వాదనలు జరగనున్నాయి. -
లంచం తీసుకుంటూ.. ఏసీబీకి అడ్డంగా దొరికిపోయి..
సాక్షి, జనగామ: ఇరిగేషన్ డిపార్టమెంట్‌కు చెందిన ఓ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. వివరాల్లోకెళ్తే.. ఇరిగేషన్ డిపార్టమెంట్ డీఈ రవీందర్ రెడ్డి శనివారం ఓ కాంట్రాక్టర్ నుంచి 50 వేల రూపాయలు లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన జనగామ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. (నడి రోడ్డు మీద లంచావతారం..) -
ఓటుకు కోట్లు కుట్ర నిరూపిస్తాం: ఏసీబీ
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసును నిరూపించేందుకు అన్ని ఆధారాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో నిందితుల డిశ్చార్జ్ పిటిషన్లను కొట్టివేయాలని ఏసీబీ స్పెషల్ పీపీ సురేందర్‌రావు ప్రత్యేక కోర్టుకు నివేదించారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ఓటు కోసం ప్రలోభపెట్టిన కేసులో నిందితులుగా ఉన్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, రుద్ర ఉదయసింహలు దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్లను న్యాయమూర్తి సాంబశివరావు నాయుడు మంగళవారం విచారించారు. కుట్రలో నిందితుల పాత్ర ఉందనేందుకు అన్ని సాంకేతిక ఆధారాలు ఉన్నాయని తెలిపారు. (తెలుగుదేశం పార్టీకి సుప్రీంకోర్టు నోటీసులు) రేవంత్‌రెడ్డితో కలసి వీరంతా ఈ కుట్రలో పాలుపంచుకున్నారని పేర్కొన్నారు. మరో నిందితుడు ఉదయసింహ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డి నుంచి రూ.50 లక్షల నగదు తెచ్చారని వివరించారు. రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆయన డబ్బు తెచ్చారని, స్టీఫెన్సన్ ఇంటికి తెచ్చి ఇచ్చింది కూడా ఉదయసింహనే అని పేర్కొన్నారు. డిశ్చార్జ్ పిటిషన్లను కొట్టివేయాలంటూ అన్ని ఆధారాలతో కౌంటర్లు దాఖలు చేశామని, ఈ నేపథ్యంలో వారి పిటిషన్లు కొట్టివేసి నిందితులపై అభియోగాలను నమోదు చేయాలని సురేందర్‌రావు నివేదించగా, ఈ కేసులో నిందితుల తరఫున వాదనలు వినేందుకు తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు. -
సోదాలు @30 గంటలు
సాక్షి, మెదక్/మెదక్ రూరల్: మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేశ్ ఇంట్లో ఏసీబీ అధికారులు గురువారం కూడా విస్తృతంగా సోదాలు నిర్వ హించారు. దాదాపు 30 గం టల పాటు సోదాలు నిర్వహిం చిన అధికారులు.. రూ.లక్ష నగదు, హార్డ్‌డిస్కులు, కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే.. నర్సా పూర్ ఆర్డీవో కార్యాలయంలో కూడా 20 గంటల పాటు జరిగిన సోదాల్లో రూ.28 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అడిషనల్ కలెక్టర్ నగేశ్ 112 ఎకరాలకు ఎన్ఓసీ కోసం రూ.1.12 కోట్ల లంచం కేసులో పట్టుబడిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైన సోదాలు.. గురువారం కూడా కొనసాగాయి. నగేశ్, ఆయన భార్య మమత, బంధువులు, ఇతర బినామీల పేరిట దొరి కిన పలు డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. 12 బృందాలు.. 12 చోట్ల సోదాలు ఏసీబీ అధికారులు 12 బృం దాలుగా విడిపోయి ఏక కాలంలో 12 చోట్ల సోదాలు నిర్వహిం చారు. మాచవరంలోని అదనపు కలెక్టర్ నగేశ్ ఇంట్లో ఏసీబీ రంగారెడ్డి రేంజ్ డీఎస్పీలు సూర్యనారాయణ, ఫయాజ్ ఆధ్వర్యంలో సోదాలు జరిగాయి. డాక్యుమెంట్లన్నీ స్వాధీనం చేసుకున్నాక.. గురువారం ఉదయం 11.30 గంటలకు ఏసీ నగేశ్‌ను అదుపులోకి తీసుకుని హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని అవినీతి నిరోధక శాఖ ప్రధాన కార్యాలయానికి తరలించారు. నర్సాపూర్ ఆర్డీఓ అరుణారెడ్డి, అప్పటి నర్సాపూర్ ఇన్చార్జి, ప్రస్తుత చిలప్‌చెడ్ తహసీల్దార్ సత్తార్, జూనియర్ అసిస్టెంట్ వసీంతోపాటు అడిషనల్ కలెక్టర్ బినామీ జీవన్‌గౌడ్‌ను సైతం అరెస్టు చేశారు. ఏసీ ఇంట్లో రూ.లక్ష .. ఆర్డీఓ ఇంట్లో రూ.28 లక్షలు మాచవరంలోని అదనపు కలెక్టర్ ఇంట్లో సోదాల సందర్భంగా రూ. లక్ష నగదు, లింగమూర్తి సంతకం చేసిన 8 చెక్కులు, రూ.72 లక్షలకు సంబంధించి ఏసీ బినామీ జీవన్‌గౌడ్ పేరిట ఐదు ఎకరాల అగ్రిమెంట్‌తోపాటు పలు కీలక డాక్యుమెంట్లు లభించాయి. మరోవైపు హైదరాబాద్‌లోని నర్సాపూర్ ఆర్డీఓ అరుణారెడ్డి ఇంట్లో రూ.28 లక్షలు, అరకిలో బంగారు ఆభరణాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విచారణకు సహకరించని ఏసీ, ఆయన భార్య ఏసీబీ అధికారుల విచారణకు అదనపు కలెక్టర్ నగేష్‌తోపాటు ఆయన భార్య మమత సహకరించలేదని తెలిసింది. హైదరాబాద్ బోయిన్‌పల్లిలో ఉన్న బ్యాంక్ లాకర్‌ను తెరిచేందుకు ఆమెను తీసుకెళ్లారు. అయితే లాక్ తెరిచేందుకు కీ లేదంటూ బుకాయించారు. పైగా అధికారులకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదని సమాచారం. మెదక్‌లోని ఇంట్లో బీరువా కీ కూడా లేదని దురుసుగా సమాధానం చెప్పినట్లు చెబుతున్నారు. కాగా, అడిషనల్ కలెక్టర్ నగేశ్ బాధితులు గురువారం మెదక్ కలెక్టర్‌ను కలసి తమకు న్యాయం చేయాలని కోరారు. తమ భూములు ఇప్పించాలని వేడుకున్నారు. శాపనార్థాలు అడిషనల్ కలెక్టర్ నగేష్‌ను ఏసీబీ అధికారులు హైదరాబాద్‌కు తరలించే సమయంలో గ్రామానికి చెందిన చాకలి లక్ష్మి అక్కడకు చేరుకుని శాపనార్థాలు పెట్టింది. తాను చాకలి పని చేస్తానని.. దుస్తులు ఉతికేందుకు ఏసీ భార్య మమతను కలసినట్లు తెలిపారు. ఒక్కరికి నెలకు రూ. 200 తీసుకుంటామని చెబితే.. రూ.100 ఇస్తామని ఏసీ భార్య బేరమాడిందని.. ఆ తర్వాత తెల్లారి రా అని పంపించినట్లు తెలిపింది. అయితే ఇదే గ్రామానికి చెందిన మరో చాకలి వచ్చి.. ఈ ఇల్లు తన పరిధిలోకి వస్తుందని గొడవకు దిగినట్లు వివరించింది. ఏసీ భార్య తనపై మెదక్ రూరల్ పోలీసులకు చెప్పి కేసు నమోదు చేయించినట్లు వాపోయింది. తనతోపాటు కుటుంబీకులు ముగ్గురిపై కేసు పెట్టగా.. బెయిల్‌పై బయటకొచ్చినట్లు వివరించింది. స్థాయిలో ఉన్న అధికారికి ఇది తగునా అంటూ.. సరైన శాస్తే జరిగిందని సదరు మహిళ శాపనార్థాలు పెట్టింది. -
మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : లంచం తీసుకున్న కేసులో మెదక్ అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. ఈ కేసులో నగేష్‌తో పాటు నర్సాపూర్ ఆర్డీవో అరుణా రెడ్డి, చల్పిచేడు తహసీల్దార్ అబ్దుల్ సత్తార్, సర్వేల్యాండ్ రికార్డ్ జూనియర్ అసిస్టెంట్ వసీం మహ్మద్, నగేష్ బినామీ జీవన్ గౌడ్‌ను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. వీరిందరికీ వైద్య పరీక్షల నిర్వహించిన అనంతరం హైదరాబాద్ తరలిస్తున్నారు. భూ వివాదం కేసులో లంచం తీసుకుంటూ నగేస్ పట్టుబడిన విషయం తెలిసిందే. (ఏసీబీ వలలో మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్) కాగా కోట్ల రూపాయిలు లంచాలు తీసుకుంటున్న నగేష్‌కు ఏసీబీ అధికారులను చూడగానే ముచ్చెమటలు పట్టాయి. ఆయన నివాసంలో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో తనకు 103 డిగ్రీల జ్వరం ఉందని, ఛాతీలో నొప్పి, ఆయాసంగా ఉందంటూ చెప్పడంతో... వైద్యుల పర్యవేక్షణలో నగేష్‌కు ఫీవర్ చెక్ చేయడంతో పాటు మందులు అందిస్తూనే మరోవైపు ఏసీబీ అధికారులు తనిఖీలు కొనసాగించారు. అయితే తనకు ఆరోగ్యం సరిగా లేదని ఆస్పత్రిలో చేర్పించాలంటూ అడిషనల్ కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులను కోరారు. (రూ.1.12 కోట్లకు డీల్: ఆడియో సంభాషణ) ఎకరానికి లక్ష చొప్పున ఒప్పందం ఈ కేసుపై ఏసీబీ అధికారులు మాట్లాడుతూ.. ‘శేరిలింగంపల్లికి చెందిన లింగమూర్తి ఫిర్యాదుతో సోదాలు చేశాం. మాకు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోదాలు చేశాం. 29 ఫిబ్రవరి 2020 న, ఆయనతో పాటు మరో నలుగురు 112 ఎకరాల విస్తీర్ణంలో భూమిని కొనుగోలు చేయడానికి అమ్మకం ఒప్పందానికి ఎన్వోసీ ఇవ్వడం కోసం లంచం డిమాండ్ చేశారు. నిషేధిత భూముల జాబితాలో భూమి ఉన్నందున ఎన్వోసీ కోసం బాధితుడు వెళ్ళాడు. జులై 31న మెదక్ అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్‌కు రూ.1 కోట్ల 12 లక్షలు మేరకు డీల్ కుదిరింది. ఎకరానికి లక్ష రూపాయిల చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నారు. మొదట విడతగా ఫిర్యాదుదారుడి నుండి19.5 లక్షలు అడిషనల్ కలెక్టర్ తీసుకున్నారు. ఆగస్ట్ 7 తేదీన ఫిర్యాదుదారుడి నుండి మరోసారి 20.5 లక్షలు లంచం తీసుకున్నారు. మిగిలిన రూ.72 లక్షలకుగాను 5 ఎకరాల భూమిని నగేష్ బినామీ కోలా జీవన్ గౌడ్‌కి బాధితుడు బదిలీ చేసినట్టు సేల్ అగ్రిమెంట్ చేసుకున్నారు. భూమి రిజిస్ట్రేషన్ అయ్యేవరకు షూరిటీ కోసం గడ్డం నగేష్ ఫిర్యాదుదారుడి నుండి 8 ఖాళీ చెక్కులను తీసుకున్నాడు. జూలై 31న జూనియర్ అసిస్టెంట్ వసీమ్ అహ్మద్ ఫిర్యాదుదారు నుండి 5 లక్షలు తీసుకున్నాడు. లక్ష రూపాయిలు ఆర్డీవోకి, మరో లక్ష తహసీల్దార్‌కు వసీం ఇచ్చాడు. ఆర్డీవో అరుణా రెడ్డి ఇంట్లో సోదాలు చేసి 28 లక్షలు నగదు, అర కిలో బంగారం స్వాధీనం చేసుకున్నాం. దీంతో పాటు పలు భూ డాక్యుమెంట్లు కూడా గుర్తించాం. నగేష్ ఇంట్లో అగ్రిమెంట్ సెల్ డీడ్ కు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం’ చేసుకున్నట్లు తెలిపారు. -
రూ.కోటి 12 లక్షలు లంచం: ఆడియో సంభాషణ
-
రూ.1.12 కోట్లకు డీల్: ఆడియో సంభాషణ
సాక్షి, హైదరాబాద్ : మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ కేసులో తీగ లాగేకొద్దీ డొంక కదులుతోంది. అడిషనల్ కలెక్టర్ సహా పలువురు రెవెన్యూ సిబ్బంది అరెస్ట్‌కు రంగం సిద్ధం అవుతోంది. ఏసీబీ దర్యాప్తులో అడిషనల్ కలెక్టర్ మొదలు వీఆర్వో స్థాయి వరకూ ఈ కేసులో సంబంధం ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మొత్తం 12ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. భూ వివాదానికి సంబంధించి అడిషనల్ కలెక్టర్ నగేష్ రూ.40లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఆడియో టేప్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆడియోలో బాధితుడిని నగేష్ లంచం డిమాండ్ చేయడమే కాకుండా ఎంత అడిగానో తనకు క్లారిటీ ఉందని చెప్పడం గమనార్హం. మరోవైపు ఆర్డీవో అరుణారెడ్డి నివాసంలోనూ ఏసీబీ సోదాలు ముగిశాయి. ఆమె ఇంట్లో పెద్ద ఎత్తున నగలు, నగదును అధికారులు గుర్తించారు. సోదాలు అనంతరం హైదరాబాద్ ఏసీబి ప్రధాన కార్యాలయంకు తరలించనున్నారు. (ఏసీబీ వలలో మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్) బాధితుడితో అడిషనల్ కలెక్టర్ ఆడియో సంభాషణ ►మీరు ఎంత ఇవ్వాలనుకుంటున్నారు ఫైనల్ గా, మీకు క్లారిటీ ఉందా ►మీకు క్లారిటీ ఉందా లేదా అనేది కూడా నాకు అర్థం అవ్వడం లేదు - అడిషనల్ కలెక్టర్ ►నాకు క్లారిటీ ఉంది సర్ - బాధితుడు ►మొదటగా 25 లక్షలు ఇస్తాం అన్నారు , ఆ తరువాత 19.5 ఇచ్చారు - అడిషనల్ కలెక్టర్ ►మీరు డబ్బులు ఎవరెవరికి ఇచ్చారు - అడిషనల్ కలెక్టర్ ►వసీం 5 లక్షలు ఇచ్చాను , మొదటగా రెండు లక్షలు , ఆ తరువాత మూడు లక్షలు ఇచ్చాను - బాధితుడు ►నేను రెండు లక్షలు చెప్పాను కదా, నాకు చెప్పాలి కదా - అడిషనల్ కలెక్టర్ ►మీకు వసీం కాల్ చేశాను అని చెప్పాడు , అందుకే ఇచ్చాను సర్ - బాధితుడు ►ఎవరికీ ఏమి ఇచ్చిన ప్రతిదీ నాకు చెప్పాలి కదా - అడిషనల్ కలెక్టర్ ►ఐదు లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదు - అడిషనల్ కలెక్టర్ ►ఆడియో క్లిప్‌లో డబ్బు లావాదేవీల చర్చతో అడ్డంగా బుక్కైన అధికారి -
ఏసీబీ వలలో మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్
సాక్షి, హైదరాబాద్ : కీసర మాజీ తాహసీల్దార్ నాగరాజు ఉదంతం మరవకముందే ఓ భూ వివాదంలో పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ మెదక్ అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ ఆడియో టేపులతో సహా ఏసీబీకి పట్టుబడ్డారు. దీంతో అడిషనల్ కలెక్టర్ నగేష్ వ్యవహారంపై ఇప్పుడు తెలంగాణలో సంచలనంగా మారింది. మెదక్ జిల్లా నర్సపూర్ మండలం చిప్పల్తుర్తి గ్రామంలో 112 ఎకరాల భూమికి ఎన్వోసీ ఇచ్చేందుకు రూ. కోటి 12 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో భాగంగా రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. దీంతో బుధవారం ఉదయం మాచవరంలోని నగేష్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. అలాగే ఆయన బంధువులకు సంబంధించిన ఇళ్లపై ఏకకాలంలో 12 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. (మొన్న నాగరాజు.. నేడు వెంకటేశ్వర్‌రెడ్డి) అడిషనల్ కలెక్టర్ నగేష్.. ఒక ఎకరానికి లక్ష రూపాయల చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. 15 రోజులుగా తిరుగుతున్నా పని కాకపోవడంతో హైదరాబాద్‌కు చెందిన మూర్తి ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ లంచం తీసుకుంటుండగా నగేష్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మెదక్ మాచవరంలో లక్ష రూపాయల నగదుతో పాటు హైదరాబాద్ బోయినపల్లిలో లాకర్ ను గుర్తించారు. బ్లాంక్ చెక్కులు, అగ్రిమెంట్ పేపర్లు, విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు మొత్తం ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది.ఏసీబీ తనిఖీల్లో ఇంకా ఎన్ని ఆస్తులు బయటపడతాయనేది ఆసక్తిగా మారింది. (రూ.కోటి 10 లక్షలు ఎవరివని ఏసీబీ ఆరా) అయితే, నర్సాపూర్ మండలం చిప్పలకుర్తిలో 113 ఎకరాల ల్యాండ్ ఎన్వోసీ కోసం.. ఏకంగా అడిషనల్ కలెక్టర్ నగేష్ రూ.కోటి 40 లక్షలు లంచం డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఎకరాకు లక్ష చొప్పున రూ.కోటి 12 లక్షలకు డీల్ కుదిరింది. రూ.40 లక్షల నగదుతో పాటు తన పేరిట రూ.72 లక్షల విలువైన భూములు రిజిస్ట్రేషన్‌కు ఒప్పందం కుదిరింది. ఇక, ఏసీబీ తనిఖీల్లో నగేష్ ఇంట్లో బ్లాంక్ చెక్కులు, అగ్రిమెంట్ పేపర్లు స్వాధీనం చేసుకున్నారు. జాయింట్ కలెక్టర్ గడ్డం నగేష్, ఆర్డీవో బండారు అరుణా రెడ్డి, ఎమ్మార్వో సత్తార్, విఆర్వో, విఆర్ఏ,జూనియర్ అసిస్టెంట్ల నివాసాలు, కార్యాలయాలపై ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే నగేష్ భార్యను విచారణ నిమిత్తం బోయిన్‌పల్లికి తరలించారు.ఇతర రెవిన్యూ సిబ్బంది నివాసాలపై సోదాలు జరుపుతున్నారు. చౌదరిగూడా ఆర్డీవో నివాసం, కొంపల్లి జేసీ నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున నగలు, నగదు స్వాదీనం చేసుకున్నారు. (పాసు పుస్తకాలకెళ్తే.. ఆర్ఐకి రూ. 35 లక్షల అప్పు) -
ఆంధ్రజ్యోతి కథనాన్ని ఖండించిన ఏసీబీ డీజీ
సాక్షి, హైదరాబాద్ : ఓ తెలుగు దినపత్రికలో ‘దొరికినా.. దొరేనా? సీఎం కేసీఆర్‌కు ఏసీబీ డీజీ సంచలన లేఖ’ అంటూ వచ్చిన వార్తను ఏసీబీ డైరెక్టర్ జనరల్ పూర్ణచంద్రరావు తీవ్రంగా ఖండించారు. తాను సీఎంవోకు, సీఎస్‌కు లేఖ రాశాననేది పూర్తిగా అవాస్తవమని, ఆ వార్త తనను చాలా బాధకు గురి చేసిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీజీ ఆదివారమిక్కడ మాట్లాడుతూ...‘మీడియా, దినపత్రికలు బాధ్యతాయుతంగా వ్యవహరించినట్లే ఏసీబీ కూడా పని చేస్తుంది. ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ‘దొరికినా దొరేనా’ అనే శీర్షికతో రాసిన వార్త ఏ విధంగా ప్రచురించారని ప్రశ్నిస్తున్నా. నేను సీఎంవోకు, సీఎస్‌కు లేఖ రాయలేదు. పత్రికలో మొదటి పేజీలో వార్త రాసేటప్పుడు ఏ విధమైన అంశాలను పరిగణనలోకి తీసుకుంటారని అడుగుతున్నా. తప్పుడు వార్తపై ఖచ్చితంగా న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం. ఇటువంటి ఊహాజనిత వార్తల వల్ల సంబంధిత శాఖపై సమాజంలో ఉన్న మంచిపేరు పోతుంది. మేము మనుషులమే, మాకు మనసు ఉంటుంది. తప్పుడు వార్తలతో నిందలు వేయడం వల్ల ఇబ్బందులు పడతామనేది గ్రహించారు. ఈ వ్యవహారంపై పత్రిక యాజమాన్యం సంజాయిషీ ఇవ్వాలి. లేకుంటే చట్టపరంగా ముందుకు వెళతాం.’ అని స్పష్టం చేశారు. -
ఏసీబీ కేసు.. ఇదేంది బాసు?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ రూ.కోట్ల అక్రమాస్తులు కూడబెట్టారంటూ వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మార్వోపై ఏసీబీ కేసు నమోదు చేసింది. రూ. 30 కోట్లకు పైగా ఆదాయానికి మించి ఆస్తులు పోగేశారని అభియోగం మోపింది. తీరా కేసు 6 నెలల్లోనే మూతపడింది! అదేంటంటే కేసును నిరూపించేందుకు సరైన ఆధారాల్లేవట!.. ఆ అధికారి మరో చోటికి బదిలీ అయి ఎడాపెడా దండుకుంటున్నాడు! ఓ డీఎస్పీ.. వాణిజ్య ప్రాంతంగా పేరుపొందిన సబ్ డివిజన్‌కు అధికారి. ఆయన రూ. 25 కోట్ల మేర ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఏసీబీ కేసు పెట్టి నానా హడావుడి చేసింది. 3 నెలలు గడవక ముందే ఆ డీఎస్పీ.. డిమాండ్ ఉన్న ప్రాంతంలో ఏసీపీగా బాధ్యతలు చేపట్టారు. ఇక్కడా అదే కథ! ఆయనపై ఆరోపణలు నిరూపించేందుకు ఆధారాల్లేవని, కేసు మూసేసినట్టు ఏసీబీ కోర్టుకు తెలిపింది!! ...ఇలా ఒకట్రెండు కేసుల్లోనే కాదు.. అనేక కేసుల్లో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) తీరు ఇలాగే ఉంది. నాలుగు బృందాలు, ఆరు ప్రాంతాలు, పదుల కోట్లలో అక్రమాస్తులంటూ హడావుడి చేసే ఏసీబీ.. ఆ కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా చూడటంలో మాత్రం ఘోరంగా విఫలమవుతోంది. అవినీతి తిమింగళాలను కటకటాల్లోకి నెట్టాల్సిన ఏసీబీ అధికారులే.. కేసులు మూసేయ్యడం వెనుక ఆంతర్యం ఏంటన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తాజాగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) విడుదల చేసిన క్రైమ్ ఇన్ ఇండియా నివేదిక ఏసీబీ, విజిలెన్స్ నమోదు చేసిన కేసులు, వాటి మూసివేతకు సంబంధించిన అంశాలపై సంచలన విషయాలను వెల్లడించింది. అవినీతి కేసుల మూసివేతలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని తెలిపింది. అవినీతి కేసుల నమోదు, అధికారుల అరెస్ట్ తదితర వ్యవహారాల్లో 12 స్థానంలో ఉన్నా.. ఆయా కేసుల్లో సరైన ఆధారాల్లేవంటూ మూసివేయడంలో రాష్ట్ర ఏసీబీ, విజిలెన్స్ మొదటి తొలిస్థానంలో నిలవడం గమనార్హం. కేవలం 2016లోనే రాష్ట్రంలో 125 కేసులను ఆధారాల్లేక మూసివేసినట్టు ఎన్సీఆర్బీ వెల్లడించింది. మూడేళ్లలో 125 కేసులు మూత ఏసీబీ నమోదు చేస్తున్న కేసుల్లో చాలావరకు చార్జిషీట్ దశకు వచ్చేసరికి మూతపడుతున్నట్టు ఎన్సీఆర్బీ పేర్కొంది. ఇలా గడిచిన మూడేళ్లలో ఏసీబీ, విజిలెన్స్ విభాగాలు నమోదు చేసిన 125 కేసులు మూతబడ్డాయి. అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్) కింద మూడేళ్లలో 421 కేసులు నమోదయితే అందులో 295 కేసులు ఇంకా దర్యాప్తులోనే ఉన్నాయి. చట్ట ప్రకారం ఎఫ్ఐఆర్ చేసిన 90 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలి. కానీ వాటిని ఏళ్ల పాటు పెండింగ్‌లో పెట్టడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అలాగే కోర్టుల్లో విచారణ దశలో 712 కేసులు ఉన్నట్టు ఎన్సీఆర్బీ స్పష్టంచేసింది. ఇక 2016లో ఏసీబీ, విజిలెన్స్ వివిధ ఆరోపణలపై 101 మందిని అరెస్ట్ చేసింది. వారిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు ఏసీబీ సిఫార్సు చేయాలి. కానీ ఇందులో కూడా విఫలమైనట్టు స్పష్టమవుతోంది. 101 మందిని అరెస్ట్ చేస్తే కేవలం 16 మందిపై మాత్రమే చర్యలు తీసుకున్నట్టు ఎన్సీఆర్బీ నివేదిక తెలిపింది. ఒత్తిడి నిజమేనా..? ఏసీబీ కేసుల్లో అరెస్టవుతున్న అధికారులు.. వారి బం«ధుమిత్రులు, రాజకీయ పరిచయాలతో ఒత్తిడి తెస్తున్నారని, అందువల్లే కేసులు మూసేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోనీ నమోదైన కేసుల్లోనైనా సమయానికి చార్జిషీట్ దాఖలు చేస్తున్నారా అంటే అంటే అదీ లేదు! ఏసీబీ, విజిలెన్స్ విభాగాలు కేసులు నమోదు చేసి, నిందితులను ప్రాసిక్యూషన్ చేసేందుకు అనుమతి కావాలంటూ జనరల్ అడ్మినిస్ట్రేటివ్, న్యాయశాఖకు ప్రతిపాదన పంపుతాయి. రాజకీయ ఒత్తిళ్లతో ఈ అనుమతులు కూడా రావడం లేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. -
తెలంగాణ ఏసీబీ డీజీగా చారు సిన్హా
హైదరాబాద్: అవినీతి నిరోధక విభాగం(ఏసీబీ) నూతన అధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి చారు సిన్హాను నియమిస్తూ శనివారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆ పదవిలో కొనసాగుతున్న ఏకే ఖాన్ (డిసెంబర్ 31న) రిటైర్ కానున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. చారు సిన్హా ప్రస్తుతం అదే విభాగంలో డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. పదవీ విరమణ చేయనున్న ఏకే ఖాన్(1981 ఐపీఎస్ బ్యాచ్).. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఓటుకు నోట్లు సహా పలు కీలకమన కేసులను పర్యవేక్షించిన సంగతి తెలిసిందే. ఈ-ఆఫీసు, లీగల్ సెల్, సైబర్‌సెల్ ఏర్పాటుచేసి దేశంలోనే తొలి సాంకేతిక హంగులు గల ఏసీబీ ఆఫీసుగా తెలంగాణ ఏసీబీ ఆఫీసును తీర్చిదిద్దడంలో ఖాన్ నిర్ణయాత్మకంగా వ్యవహరించారు. -
అనుబంధ చార్జిషీట్ అంటూ ఏసీబీ సేఫ్‌గేమ్
- ఓటుకు కోట్లు కేసులో ఉండవల్లి అరుణ్‌కుమార్ వాదన - ఈ కేసు కోసం చంద్రబాబు ఏపీ ప్రయోజనాలను తాకట్టుపెట్టారు సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో అనుబంధ చార్జిషీట్ దాఖలు చేస్తామంటూ తెలంగాణ ఏసీబీ సేఫ్‌గేమ్ ఆడుతోందని న్యాయవాది ఉండవల్లి అరుణ్‌కుమార్ వివరించారు. ఈ కేసులో విసృ్తత ప్రజా ప్రయోజనాలు ఉన్నాయని, బాధ్యతాయుతమైన పౌరుడిగా వాస్తవాలను కోర్టు ముందుంచేందుకే ఈ కేసులో తన వాదనలను వినాలని హైకోర్టును కోరానని తెలిపారు. ఓటుకు కోట్లు కేసులో తన వాదనలు వినాలంటూ ఉండవల్లి అరుణకుమార్ అనుబంధ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో న్యాయమూర్తి జస్టిస్ సునీల్ చౌదరి బుధవారం ఈ కేసులో జోక్యం చేసుకునే అర్హతపై ఉండవల్లి వాదనలు కూడా విన్నారు. చంద్రబాబు గురించి ఏసీబీ తన చార్జిషీట్లో పలుమార్లు పేర్కొందని, అరుునప్పటికీ ఆయనను ఇప్పటివరకు ఒక్కసారి కూడా ప్రశ్నించలేదని ఉండవల్లి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిని బట్టి ఏసీబీ దర్యాప్తు ఏ కోణంలో సాగుతుందో సులభంగా అర్థం చేసుకోవచ్చునని తెలిపారు. ప్రజా ప్రతినిధుల కేసుల్లో విచారణను సంవత్సరంలోపు పూర్తి చేయాలని లా కమిషన్ సిఫారసు చేసిందని, కానీ ఏసీబీ సంవత్సరాల తరబడి ఈ కేసును దర్యాప్తు చేస్తోందని తెలిపారు. ఈ కేసుతో తనకు సంబంధం లేదని కానీ, స్టీఫెన్‌సన్‌తో జరిగిన సంభాషణల్లోని స్వరం తనది కాదని కానీ చంద్రబాబు ఇప్పటివరకూ ఎక్కడా చెప్పలేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని 9,10 షెడ్యూళ్లలో ఉన్న ఆస్తుల విభజన ఇంతవరకు జరగలేదని, చంద్రబాబు ఏపీ ప్రజల ప్రయోజనాలను తాకట్టుపెట్టి ఓటుకు కోట్ల కేసు నుంచి బయటపడాలని చూస్తున్నారని వివరించారు. సీఆర్పీసీ సెక్షన్ 482 కింద హైకోర్టుకు స్వతఃసిద్ధ అధికారాలున్నాయని, వాటిని ఉపయోగించి తప్పును సరిచేసేందుకు తగిన ఉత్తర్వులు జారీ చేయవచ్చునన్నారు. తరువాత ఫిర్యాదుదారు ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి గతవారం నాటి తన వాదనలను మరోసారి పునరుద్ఘాటించారు. కోర్టు లేవనెత్తిన పలు సందేహాలను నివృత్తి చేశారు. చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూత్రా తిరుగు సమాధానం కోసం తదుపరి విచారణ గురువారానికి వారుుదా పడింది. -
ఈ నెల 27కు ఓటుకు కోట్లు కేసు వాయిదా
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన ఓటుకు కోట్లు కేసును బుధవారం హైకోర్టు విచారించింది. తెలంగాణ ఏసీబీ కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది. తెలంగాణలో శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందేందుకు ఎమ్మెల్యేల కొనుగోలుకు టీడీపీ కుట్ర చేయడం తెలిసిందే. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ఓటు కోసం ప్రలోభపెట్టడంతో పాటు రూ.50 లక్షలు ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, ఇతరులు.. ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. -
పోలీసులకు నోటీసులు ఇవ్వనున్న ఏసీబీ!
-
ఎవరీ జనార్దన్?
-
ఏసీబీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు
రేవంత్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుల నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేశారని, సీఆర్పీసీ సెక్షన్ 164 కింద కేసు విచారణ పూర్తి చేశారని కోర్టు భావించింది. ఇప్పుడు మళ్లీ కస్టడీకి తీసుకుని ఏం విచారిస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రధాన నిందితుడు కేసును ప్రభావితం చేస్తాడని ఏసీబీ వాదించినా, ఆ వాదనలను సుప్రీంకోర్టు తిరస్కరించింది. హైకోర్టు ఇచ్చిన బెయిల్ మీద జోక్యం చేసుకోడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. (చదవండి- రేవంత్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ ప్రారంభం) ఏసీబీ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పులో పలు లోపాలు ఉన్నాయని సిబల్ అన్నారు. కానీ, ఆయన వాదనతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి. భోస్లే ఏకీభవించలేదు. ఇప్పటికే నెల రోజుల పాటు రేవంత్ రెడ్డి జైల్లో ఉన్నారని అన్నారు. విచారణ పూర్తయినందున ఇక ఆయన బెయిల్ రద్దుచేయాల్సిన అవసరం లేదని భావించారు. కాగా, బెయిల్ షరతులను రేవంత్ ఉల్లంఘించారని, జైలు నుంచి విడుదలైన సమయంలోనే బెదిరింపు ధోరణిలో ముఖ్యమంత్రిపై మాట్లాడారని న్యాయవాదులు అంటున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తిరస్కరించడంతో ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని, మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశముంది. -
ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా: ఏసీబీకి సండ్ర లేఖ
ఓటుకు కోట్లు కేసులో విచారణకు హాజరయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలంగాణ ఏసీబీకి లేఖ రాశారు. తాను ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నానని, ఆస్పత్రి నుంచి కూడా డిశ్చార్జి అయ్యానని ఆయన తెలిపారు. ఇక విచారణకు ఎప్పుడు రమ్మంటే అప్పుడే వస్తానని ఆయన ఆ లేఖలో రాశారు. కాగా, ఓటుకు కోట్లు కేసులో నోటీసులు జారీ చేసినా హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్న వెంకటవీరయ్యకు మరోసారి నోటీసులు జారీ చేసేందుకు ఏసీబీ సిద్ధమైందన్న సమాచారం అందడం వల్లే ఆయన ఇప్పుడు విచారణకు వస్తానని లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈసారీ స్పందించకపోతే ఆయన్ని నిందితుల జాబితాలోకి చేర్చాలని ఏసీబీ భావించడంతో ఇక తప్పనిసరిగా విచారణకు రావాల్సిందేనని ఆయనకు సలహాలు ఇచ్చారు. వెంకట వీరయ్యను విచారించాలని భావించిన ఏసీబీ.. జూన్ 16న సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేసింది. హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సండ్ర ఇంటి (208 క్వార్టర్) తలుపులకు నోటీసు అంటించారు. దీనికి సండ్ర తనకు వంట్లో బాగాలేదని, ఆరోగ్యం కుదుటపడ్డాక వస్తానని లేదా ఆస్పత్రికి వస్తే విచారణకు సహకరిస్తానని పేర్కొంటూ జూన్19న ఏసీబీకి లేఖ రాశారు. పది రోజులైనా ఏసీబీ ఎదుటకు రాలేదు. ఎక్కడ చికిత్స పొందుతున్నారో వెల్లడించలేదు. ఎట్టకేలకు బుధవారం నాడు తాను విచారణకు వస్తానంటూ ఏసీబీకి ఓ లేఖ రాశారు. -
ఏసీబీ చేతికి ఎఫ్ఎస్ఎల్ నివేదిక
ఓటుకు కోట్లు కేసులో మరో కీలక పరిణామం సంభవించింది. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఇచ్చిన నివేదికను ఏసీబీకి కోర్టు అందించింది. ఎఫ్ఎస్ఎల్ తన ఒక నివేదికతో పాటు మూడు హార్డ్ డిస్కులు, ఒక సీడీని కూడా ఇచ్చింది. ఈ నివేదికలో ఎఫ్ఎస్ఎల్ పలు అంశాలను ప్రస్తావించినట్లు తెలిసింది. ఆడియోటేపుల్లో ఉన్న సంభాషణలను రాతపూర్వకంగా ఇవ్వాలని కోర్టును కోరింది. దీంతో ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా ఏసీబీకి కీలక ఆధారాలు దొరికినట్లయింది. ఈ నివేదిక ఆధారంగా ఏసీబీ తన దర్యాప్తును మరింత ముమ్మరం చేయనుంది. -
'రేవంత్ తరచూ ఓ ఫైనాన్షియర్ తో మాట్లాడేవారు'
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో నిందితుడుగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి సంబంధించిన మరికొన్ని వాస్తవాలు వెల్లడవుతున్నాయి. రేవంత్ తరచుగా అమీర్‌పేటకు చెందిన ఓ ఫైనాన్షియర్ తో ఫోన్లో మాట్లాడేవారని ఏసీబీ వెల్లడించింది. తమ వద్ద ఉన్న కాల్ లిస్టు సమాచారంతో తెలంగాణ ఏసీబీ ఈ విషయాన్ని ధృవీకరించింది. కాగా, ఆ ఫైనాన్షియర్ కృష్ణా జిల్లాకు చెందిన వారని పోలీసులు భావిస్తున్నారు. ఓటుకు కోట్లు కేసు విచారణలో భాగంగా రేవంత్ కు సన్నిహితుడైన ఆ ఫైనాన్షియర్ ను ప్రశ్నించాలని ఏసీబీ అధికారులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలను కొనేందుకు రేవంత్ కు నగదు ఏమైనా ఇచ్చాడా అనే కోణంలోనూ దర్యాప్తు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఆ నివేదిక వస్తే సంచలనాలే!
ఓటుకు కోట్లు కేసులో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక కోసం తెలంగాణ ఏసీబీ వర్గాలు వేచి చూస్తున్నాయి. ఇప్పటి వరకు సాక్ష్యాలు, ఆధారాలు సేకరించిన ఏసీబీ, త్వరలోనే మరి కొంతమందికి నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఒక వైపు స్టీఫెన్సన్ వాంగ్మూలాన్ని పరిశీలిస్తున్న ఏసీబీ వర్గాలు.. మరో రెండు రోజుల్లో ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు కూడా తమ చేతికి అందుతుందని భావిస్తున్నాయి. స్టీఫెన్సన్ ఇప్పటికే తన వాంగ్మూలంలో చంద్రబాబే కుట్రకు సూత్రధారుడని చెప్పటంతో బాబుకు నోటీసులు ఇచ్చే అంశంపై న్యాయ నిపుణులతో ఏసీబీ సంప్రదిస్తోంది. అయితే చంద్రబాబు, స్టీఫెన్సన్ ఆడియో టేపులకు సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు వచ్చిన తర్వాత, వాటిని పరిశీలించి.. వాటి ఆధారంగానే నోటీసులు ఇస్తే బాగుంటుందని న్యాయ నిపుణులు ఏసీబీకి సూచించినట్లు తెలుస్తోంది.. దీంతో ఇప్పటికే స్తబ్దుగా ఉన్న ఏసీబీ మరో రెండు రోజులపాటు ఇదే నిశ్శబ్దాన్ని కొనసాగించే అవకాశం ఉంది. ఆ తర్వాత సంచలనాలే ఉంటాయని ఏసీబీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ఏసీబీ.. ఏం చేస్తోంది?
ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ.. గురువారం అంతా ఆధారాల పరిశీలన, డాక్యుమెంట్ల తయారీలో మునిగిపోయింది. ముందు ముందు ఎలా సాగాలన్న దానిపై కూడా తీవ్రస్థాయిలో ఏసీబీ అధికారులు చర్చించారు. న్యాయపరమైన అంశాలు, నిందితులకు జారీ చేయాల్సిన నోటీసుల గురించి కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు బుధవారం రికార్డ్ చేసిన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ వాంగ్మూలం శుక్రవారం సాయంత్రంలోగా ఏసిబీకి అందే అవకాశాలున్నాయి. ఒక్కసారి అది అందిన వెంటనే ఏసీబీ విచారణ మరింత వేగం పుంజుకోనుంది. ఇప్పటివరకు ఏసీబీ సేకరించిన ఆడియో, వీడియో ఫుటేజీలు ప్రస్తుతం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో ఉన్నాయి. వాటి నివేదికలు కూడా ఇంకా అందాల్సి ఉంది. మొత్తమ్మీద గురువారం మొత్తం ఏసీబీ ఉన్నతాధికారులు ఎవరూ పెద్దగా బయటకు వెళ్లిన దాఖలాలు లేవు. డాక్యుమెంటేషన్ ప్రక్రియమీదే ఎక్కువగా దృష్టిపెట్టారు. మరో రెండు రోజులు కూడా ఇలాగే ఉండొచ్చని సమాచారం. అయితే.. నిందితులు ఎవరూ తప్పించుకోకుండా ఏసీబీ చాకచక్యంగా వ్యవహరిస్తోంది. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య శుక్రవారం సాయంత్రం 5 గంటల్లోగా ఏసీబీ వద్ద విచారణకు హాజరు కావాల్సి ఉంది. అలాగే ఇప్పటికే ఒకసారి విచారించిన వేం నరేందర్ రెడ్డిని మళ్లీ సోమవారం పిలుస్తారని సమాచారం. ఇవన్నీ జరిగిన తర్వాత చకచకా పావులు కదిపి మరింతమందికి నోటీసులు ఇవ్వడం, అవసరమైతే అరెస్టులు చేయడం లాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. -
ఏసీబీ.. ఏం చేస్తోంది?
-
బాబోయ్ ..!
సాక్షి ప్రతినిధి, గుంటూరు : ఓటుకు నోటు వ్యవహారంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చిక్కుకోవడం నవ్యాంధ్ర రాజ ధాని నిర్మాణంపై ప్రభావ ం చూపుతోంది. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు, పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ భూములు, స్థలాలను కొనుగోలు చేసిన పెట్టుబడిదారులు, తాజా రాజకీయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. రేపు ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో బాబు చిక్కుకుంటే తమ జీవితాలు తారుమారు అవుతాయనే ఆందోళన వారిలో కనపడుతోంది. టీడీపీ నాయకులు ఎవరు ఎదురైనా దీనిపై ప్రశ్నలు సంధిస్తున్నారు. తెలంగాణ ఏసీబీ చంద్రబాబుకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా? సీఎం అరెస్టు అవుతారా? తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల్లో కొందరు ఖరీఫ్‌కు సమాయత్తం అవుతున్నారు. ముఖ్యంగా విత్తనాలు సేకరణ, మెట్ట దుక్కులు దున్నుకోవడం వంటి పనుల్లో నిమగ్నం అయ్యారు. ఇప్పటికే 33,347 ఎకరాల భూ సమీకరణ చేసిన ప్రభుత్వం 22 వేల ఎకరాలకు సంబంధించిన రైతులకు కౌలు డీడీలు పంపిణీ చేసింది. ఆరువేల ఎకరాలకు సంబంధించి కౌలు డీడీలు ఇవ్వడానికి కొన్ని సమస్యలు ఎదురవడంతో వాటిని పెండింగ్‌లో పెట్టారు. మిగిలిన 5 వేల ఎకరాలకు సంబంధించి మారిన రాజకీయ నేపథ్యంలో రైతులు కౌలు డీడీలు తీసుకునేందుకు విముఖత చూపుతున్నారు. ఓటుకు నోటులో సీఎం పాత్ర ఉందని రుజువైతే, రాజధాని నిర్మాణం ఆగిపోయినట్టేనని రైతులు అంటున్నారు. దీంతో తమ భూములను తిరిగి తామే సాగుచేసు కోవాలనుకొంటున్నారు. ఈ వివాదం వల్ల రాజధాని నిర్మాణానికి కొన్ని నెలలు ఆటంకం ఏర్పడే అవకాశం లేకపోలేదని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. దీంతో రైతులు రాజధాని నిర్మాణానికి ఇచ్చిన భూములను వెనక్కి తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. భూమిపూజ అనంతరం నేటి వరకు మంత్రులు కానీ, ఉన్నతాధికారులు కానీ రాజధాని ప్రాంతంలో పర్యటించకపోవటం రైతుల్లో ఉన్న అనుమానాలకు బలం చేకూరుతోంది. రియల్టర్లకు అడుగడుగునా ఆటంకాలు ... జిల్లాలోని రియల్టర్లకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. కొన్నాళ్లు రాజధాని గ్రామాల్లోని స్థలాలు, భూములు రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం నిలిపి వేసింది. గ్రామకంఠంకు అర కిలోమీటరు పరిధిలోని స్థలాలకే ప్లాన్ ఇవ్వాలని, అర కిలోమీటరు పరిధి దాటిన లే-అవుట్లకు అనుమతి ఇవ్వవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని ఈ ప్రాంతంలో రావడంతో భూముల ధరలు అనూహ్యంగా పెరుగుతా యని, స్థలాలు, అపార్టుమెంట్ల నిర్మాణాలు పెరుగుతాయని మొదటి నుంచి రియల్టర్లు భావించారు. అయితే తరచూ ఏదో ఆటంకం ఎదురుకావడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం ముందుకు సాగడం లేదు. మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా ఓటుకు నోటు వివాదంలో సీఎం చిక్కుకోవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా పడిపోయింది. వ్యవసాయ కార్మికుల వలస ... రాజధాని గ్రామాల్లో వ్యవసాయ పనులు జరిగే అవకాశాలు లేకపోవడంతో వ్యవసాయ కార్మికులు ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలకు వలస వెళుతున్నారు. ఆ జిల్లాల్లో వ్యవసాయ పనులు ముందుగా ప్రారంభమయ్యే అవకాశం ఉండటంతో అక్కడికి వెళుతున్నారు. -
ఈ దశలో జోక్యం చేసుకోలేం!
-
ఈ దశలో జోక్యం చేసుకోలేం!
* ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు కేంద్రం స్పష్టీకరణ * ఇప్పటికే ఐబీ ద్వారా పూర్తి సమాచారం సేకరించిన కేంద్రం * ఏసీబీ దర్యాప్తులో జోక్యం చేసుకునేందుకు ససేమిరా * సెక్షన్ 8కు సంబంధించి కూడా బాబుకు దక్కని భరోసా సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు నోటు’ కేసు నుంచి బయటపడేయమంటూ విజ్ఞప్తి చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు హస్తినలో నిరాశే ఎదురైంది. తెలంగాణ ప్రభుత్వాన్ని కట్టడి చేయాల్సిందిగా మొరపెట్టుకోగా.. ఈ దశలో జోక్యం చేసుకోలేమని కేంద్రం సమాధానం ఇచ్చింది. ఈ వ్యవహారంపై తెలంగాణ ఏసీబీ చేస్తున్న దర్యాప్తులో ఏమాత్రం జోక్యం చేసుకోలేమని, కేవలం ట్యాపింగ్ జరిగిందని చెబుతున్న అంశంపై మాత్రమే దృష్టి పెడతామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) స్పష్టం చేసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. తెలంగాణ ఏసీబీ ద్వారా తనకు నోటీసులు జారీ చేయకుండా, తనను నిందితుల జాబితాలో చేర్చకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని కట్టడి చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఢిల్లీలో ప్రధానిని, కేంద్ర మంత్రులను కోరారు. అయితే అప్పటికే కేంద్ర నిఘా సంస్థ (ఇంటెలిజెన్స్ బ్యూరో) ద్వారా ఈ వ్యవహారంపై పూర్తి సమాచారం సేకరించిన కేంద్రం.. ఇందుకు ససేమిరా అంది. ప్రాథమిక సాక్ష్యాలు, సాంకేతిక ఆధారాల ద్వారా ముందుకెళ్తూ చట్ట పరిధిలో సంబంధిత న్యాయస్థానానికి సమాచారం ఇస్తూ చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో తాము జోక్యం చేసుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. విభజన చట్టంలోని సెక్షన్ 8కు సంబంధించి బాబు లేవనెత్తిన అంశంపై కూడా.. ఇప్పటివరకు ఆ కోణంలో సమస్యలు వచ్చినట్లుగా తమకు ఎలాంటి నివేదికలు అందలేదని పేర్కొంది. ఏసీబీ పని తీరు శాంతిభద్రతల అంశం పరిధిలోకి రాదని తేల్చిచెప్పింది. దీనికి సంబంధించి ఎలాంటి అభ్యం తరాలున్నా, ఉల్లంఘనలు జరిగాయని ఆధారాలు సమీకరించినా సంబంధిత న్యాయస్థానాన్నే ఆశ్రయించాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అధికారులు, ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛ, ఇతర హక్కులు, అధికారాలకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమైనా, వాటిని తెలంగాణ ప్రభుత్వం హరిస్తున్నట్లు ఆధారాలు లభించినప్పుడు మాత్రమే కేంద్రం జోక్యం చేసుకుని గవర్నర్ ద్వారా ఆ ప్రభుత్వాన్ని కట్టడి చేయడం సాధ్యమవుతుందని చెప్పినట్లు తెలిసింది. ఏపీ ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులకు సంబంధించిన 120 ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయన్న విషయంపై ఢిల్లీ పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. గతంలో తాము జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ఈ అంశాన్ని పరిశీలిస్తామని, ట్యాపింగ్ జరిగిందో లేదో తేల్చడానికి ఉన్నతస్థాయి విచారణ జరిపిస్తామని హోంశాఖ హామీ ఇచ్చింది. ఒకటి రెండురోజుల్లో టెలికం మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేయడం ద్వారా సాంకేతిక నిపుణులు, హోం మంత్రిత్వ శాఖ అధికారులతో కూడిన ప్రత్యేక బృందాన్ని హైదరాబాద్ పంపాలని నిర్ణయించింది. ఈ బృందం నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఎంహెచ్ఏ ఉన్నతాధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం.