ఏసీబీ చేతికి ఎఫ్ఎస్ఎల్ నివేదిక
ఓటుకు కోట్లు కేసులో మరో కీలక పరిణామం సంభవించింది. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఇచ్చిన నివేదికను ఏసీబీకి కోర్టు అందించింది. ఎఫ్ఎస్ఎల్ తన ఒక నివేదికతో పాటు మూడు హార్డ్ డిస్కులు, ఒక సీడీని కూడా ఇచ్చింది.
ఈ నివేదికలో ఎఫ్ఎస్ఎల్ పలు అంశాలను ప్రస్తావించినట్లు తెలిసింది. ఆడియోటేపుల్లో ఉన్న సంభాషణలను రాతపూర్వకంగా ఇవ్వాలని కోర్టును కోరింది. దీంతో ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా ఏసీబీకి కీలక ఆధారాలు దొరికినట్లయింది. ఈ నివేదిక ఆధారంగా ఏసీబీ తన దర్యాప్తును మరింత ముమ్మరం చేయనుంది.