టేపులు అసలువే.. అతికించలేదు: ఎఫ్ఎస్ఎల్ | fsl submits primary report of audio video tapes in cash for vote scam | Sakshi
Sakshi News home page

టేపులు అసలువే.. అతికించలేదు: ఎఫ్ఎస్ఎల్

Published Wed, Jun 24 2015 4:40 PM | Last Updated on Thu, Oct 4 2018 5:51 PM

టేపులు అసలువే.. అతికించలేదు: ఎఫ్ఎస్ఎల్ - Sakshi

టేపులు అసలువే.. అతికించలేదు: ఎఫ్ఎస్ఎల్

ఓటుకు కోట్లు కేసులో ఆడియో, వీడియో టేపులను పరిశీలించిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్.. తన ప్రాథమిక నివేదికను ఏసీబీ కోర్టుకు సమర్పించింది. రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, మత్తయ్య తదితరులు మాట్లాడిన టేపులను ఎఫ్ఎస్ఎల్లో పరీక్షిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 14 ఆడియో, వీడియో టేపులను ల్యాబ్కు పంపారు. ఇందులో ఎలాంటి ఎడిటింగ్ జరగలేదని, అంతా సక్రమంగానే ఉన్నాయని చెప్పినట్లు సమాచారం.


ఇప్పటికి కేవలం ప్రాథమిక నివేదికను మాత్రమే సమర్పించారు. ఇంకా తుది నివేదికను రూపొందించాల్సి ఉంది. ఇందుకు కనీసం 48 గంటల సమయం పడుతుందని చెప్పిన సంగతి తెలిసిందే. ఆడియో టేపులను పోల్చి చూసేందుకు తమకు చంద్రబాబు స్వర నమూనాలు కావాలని కోర్టును ఏసీబీ కోరింది. వీడియో, ఆడియోలను అసలైనవిగానే ఎఫ్ఎస్ఎల్ తేల్చిచెప్పింది. అతికించడం మార్చడం లాంటివి జరగలేదని స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement