audio video tapes
-
ఏసీబీ చేతికి ఎఫ్ఎస్ఎల్ నివేదిక
-
ఏసీబీ చేతికి ఎఫ్ఎస్ఎల్ నివేదిక
ఓటుకు కోట్లు కేసులో మరో కీలక పరిణామం సంభవించింది. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఇచ్చిన నివేదికను ఏసీబీకి కోర్టు అందించింది. ఎఫ్ఎస్ఎల్ తన ఒక నివేదికతో పాటు మూడు హార్డ్ డిస్కులు, ఒక సీడీని కూడా ఇచ్చింది. ఈ నివేదికలో ఎఫ్ఎస్ఎల్ పలు అంశాలను ప్రస్తావించినట్లు తెలిసింది. ఆడియోటేపుల్లో ఉన్న సంభాషణలను రాతపూర్వకంగా ఇవ్వాలని కోర్టును కోరింది. దీంతో ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా ఏసీబీకి కీలక ఆధారాలు దొరికినట్లయింది. ఈ నివేదిక ఆధారంగా ఏసీబీ తన దర్యాప్తును మరింత ముమ్మరం చేయనుంది. -
ఓటుకు కోట్లు: రంగంలోకి దిగిన ఎన్నికల సంఘం
ఓటుకు కోట్లు కేసులో కేంద్ర ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది. ఈ కేసుకు సంబంధించి సాక్ష్యాలుగా ఏసీబీ సమర్పించిన 14 ఆడియో, వీడియో టేపుల కాపీలను తమకు ఇవ్వాల్సిందిగా కోరుతూ సీఈసీ తరఫు న్యాయవాది ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ టేపులు అసలువా.. కాదా అన్న విషయాన్ని నిర్ధారించేందుకు వీటిని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపిన విషయం తెలిసిందే. ల్యాబ్ నుంచి వీటిపై ప్రాథమిక నివేదిక కూడా ఇప్పటికే వచ్చింది. ఎఫ్ఎస్ఎల్ నుంచి వచ్చిన టేపులను ఏసీబీ కోర్టు పరిశీలిస్తోంది. ఈ లోపే కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి కూడా తమకు ఈ టేపులు కావాలన్న మెమో దాఖలైంది. తమ వద్ద ఒక కాపీ మాత్రమే ఉందని, ఎఫ్ఎస్ఎల్ వారు మరో కాపీ పంపితే, అప్పుడు ఇవ్వాలా వద్దా అన్న విషయమై నిర్ణయం తీసుకుంటామని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తెలిపారు. తమకు అందిన టేపుల కాపీలను ప్రస్తుతం కోర్టు పరిశీలిస్తోంది. మరో కాపీ వస్తే అప్పుడు దాన్ని సీఈసీకి ఇవ్వాలా లేదా అనే విషయమై నిర్ణయం తీసుకుంటారు. -
ACBకి చేరిన ఫోరెన్సిక్ నివేదిక
-
టేపులు అసలువే.. అతికించలేదు: ఎఫ్ఎస్ఎల్
ఓటుకు కోట్లు కేసులో ఆడియో, వీడియో టేపులను పరిశీలించిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్.. తన ప్రాథమిక నివేదికను ఏసీబీ కోర్టుకు సమర్పించింది. రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, మత్తయ్య తదితరులు మాట్లాడిన టేపులను ఎఫ్ఎస్ఎల్లో పరీక్షిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 14 ఆడియో, వీడియో టేపులను ల్యాబ్‌కు పంపారు. ఇందులో ఎలాంటి ఎడిటింగ్ జరగలేదని, అంతా సక్రమంగానే ఉన్నాయని చెప్పినట్లు సమాచారం. ఇప్పటికి కేవలం ప్రాథమిక నివేదికను మాత్రమే సమర్పించారు. ఇంకా తుది నివేదికను రూపొందించాల్సి ఉంది. ఇందుకు కనీసం 48 గంటల సమయం పడుతుందని చెప్పిన సంగతి తెలిసిందే. ఆడియో టేపులను పోల్చి చూసేందుకు తమకు చంద్రబాబు స్వర నమూనాలు కావాలని కోర్టును ఏసీబీ కోరింది. వీడియో, ఆడియోలను అసలైనవిగానే ఎఫ్ఎస్ఎల్ తేల్చిచెప్పింది. అతికించడం మార్చడం లాంటివి జరగలేదని స్పష్టం చేసింది. -
టేపుల డీకోడింగ్ ప్రారంభం
-
ఓటుకు కోట్లు: టేపుల డీకోడింగ్ ప్రారంభం
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. ఆడియో, వీడియో టేపులను డీకోడింగ్ చేసే కీలక ప్రక్రియను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ప్రారంభించింది. ఇందుకోసం ప్రత్యేకంగా మూడు బృందాలను ఏర్పాటుచేసింది. మొత్తం 14 ఆడియో, వీడియో టేపులను తెలంగాణ ఏసీబీ వర్గాలు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు గతంలో పంపిన విషయం తెలిసిందే. ఇప్పుడు వాటిని విడిగా కాపీచేసి, వాటిలోని నిజాలను నిగ్గుతేల్చేందుకు ఎఫ్ఎస్ఎల్ సిద్ధమైంది. ఇందుకోసం ఏర్పాటుచేసిన మూడు బృందాలు ఇప్పటికే తమ పని మొదలుపెట్టేశాయి. తన ఫోన్ ట్యాప్ చేశారని ఒకసారి, అసలు అందులో ఉన్నది తన గొంతు కాదని మరోసారి.. అప్పుడప్పుడు వేర్వేరు సందర్భాలలో మాట్లాడిన మాటలను కట్ అండ్ పేస్ట్ చేసి ఈ టేపులు రూపొందించారని ఇంకోసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఈ మొత్తం విషయాలన్నింటినీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఏర్పాటుచేసిన మూడు ప్రత్యేక బృందాలు నిగ్గు తేలుస్తాయి. డీకోడింగ్ తర్వాత అన్ని విషయాల్లో వాస్తవాలు వెలుగు చూస్తాయని భావిస్తున్నారు.