తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన ఓటుకు కోట్లు కేసును బుధవారం హైకోర్టు విచారించింది.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన ఓటుకు కోట్లు కేసును బుధవారం హైకోర్టు విచారించింది. తెలంగాణ ఏసీబీ కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది.
తెలంగాణలో శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందేందుకు ఎమ్మెల్యేల కొనుగోలుకు టీడీపీ కుట్ర చేయడం తెలిసిందే. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ఓటు కోసం ప్రలోభపెట్టడంతో పాటు రూ.50 లక్షలు ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, ఇతరులు.. ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది.