విశ్వదాభిరామ వినుర బాబు!
తప్పుచేయువారు తమ తప్పులెరగరయ్యా విశ్వదాభిరామ వినుర బాబు! చేసిన ఒక తప్పును కప్పి పుచ్చుకునేందుకు వంద తప్పులు చేస్తారన్నది సామెత. నీవు మాత్రం ఇంతవరకు పది తప్పులు మాత్రమే చేసినట్టు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు సాక్షాత్తు మీడియా ముందు తెగేసి చెప్పారు. కలియుగ శిశుపాలుడు అన్న బిరుదు కూడా ఇచ్చిపారేశారు. ఆ లెక్కన కూడా చూసుకుంటే ఇంకా 90 తప్పులు చేయొచ్చన్నమాట. పోయిన పరువు ఎలాగూ పోయింది కొత్త తప్పులతో కొత్తగా పోయేదేమీ లేదు. అందుకే సరదాగా ఈ తప్పులు ట్రై చేస్తో పోలా..!
-ముందు చూపుతో ఫోరెన్సిక్ నిపుణుడిని సలహాదారుడిగా పెట్టుకున్నావు. ఇప్పటికీ నీ మాటల టేపులు ఫోరెన్సిక్ ల్యాబ్‌లోనే ఉన్నాయి. నీ బుద్ధి ముందే పసిగట్టిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం టేపులను తారుమారు చేయకుండా గట్టి భద్రతను ఏర్పాటుచేసింది. వీలైతే నానాయాగీ చేసి ఏపీ పోలీసులను అక్కడ పెట్టు.
-నీవు అనుకున్నది జరక్కపోతే వాయిస్ శాంపిల్స్ టెస్ట్‌కెళ్లాల్సి ఉంటుంది. గ్రహరాశి నీకు అనుకూలించేవరకు గొంతు నొప్పంటూ కాలయాపన చేయి.
- ఈలోగా వాయిస్ శాంపుల్స్ టెస్ట్‌లో దొరక్కకుండా ఉండేందుకు ఫోరెన్సిక్ నిపుణుడి సలహాతో మూడు రకాల ఫ్రీక్వెన్సీ కాకపోతే 36 రకాల ఫ్రీక్వెన్సీలో మాట్లాడేందుకు ప్రాక్టీస్ చేసి టెస్ట్‌లో దొరక్కుండా చూసుకో.
-అప్పటికీ నోరు తిరగకపోతే గొంతు క్యాన్సర్ అంటూ అస్పత్రిలో చేరు. అప్పటికీ తమకనుకూలంగా పరిస్థితులు మారకపోతే ఏకంగా క్యాన్సర్ పేరుతో 'వోకల్ కార్డ్'ను తొలగించుకో. ఎలాగూ మాట్లాడలేవు గనక శాంపుల్స్ టెస్ట్‌లో దొరకవు. తప్పుమీద తప్పులు మాట్లాడలేవు. 'వెర్రిబాబు'లోడిలాగా సైగలతో ఎలాగోలా కేసు నుంచి బయటపడొచ్చు.
-ఓ నెటిజెన్ వ్యంగ్యోక్తులు