‘ఓటుకు కోట్లు’ కేసు కీలక దశకు చేరుకుంది. ఈ వ్యవహారంలో ముఖ్య ఆధారాలైన ఆడియో, వీడియో రికార్డులను విశ్లేషించి ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) ఇచ్చిన నివేదిక శుక్రవారం ఏసీబీ చేతికి అందింది. ఈ నివేదికలోని అంశాల ఆధారంగా చర్యలు చేపట్టడానికి ఏసీబీ సిద్ధమవుతోంది. నిందితులు, సాక్షుల నుంచి సేకరించిన సమాచారం, వారి ఇళ్లల్లో జరిపిన సోదాల్లో లభించిన ఆధారాలతో పాటు టీడీపీ ముఖ్య నేతలు నడిపిన కొనుగోళ్ల బాగోతంపై దృష్టి పెట్టింది. వీటన్నింటి ఆధారంగా కేసులో కీలకమైన వ్యక్తులను విచారించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది.