ఓటుకు కోట్లు కేసులో వాస్తవాలు బయటపడుతున్నాయి. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక 'సాక్షి' సంపాదించింది. ఓటుకు కోట్లు కేసులో నడిచిన వ్యవహారమంతా వాస్తవాలేనని ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా నిర్ధారించింది. ఏసీబీ దాడులు చేసిన సమయంలో రెడ్‌హాండెడ్‌గా పట్టుకున్న వీడియో, ఆడియో టేపులపై ఫోరెన్సిక్ ల్యాబ్ విశ్లేషించింది. దాదాపు 12 రోజులపాటు నిశితంగా విశ్లేషించి... అవన్నీ వాస్తవాలేనని నిర్ధారించింది.