
శ్రీరామ్, సంచితా పదుకునే
‘‘రోజాపూలు, ఒకరికి ఒకరు, పోలీస్ పోలీస్, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ వంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులకు చేరువయ్యారు హీరో శ్రీరామ్. కొంత విరామం తర్వాత తెలుగులో ఆయన నటిస్తున్న చిత్రం ‘అసలేం జరిగింది’. కన్నడ బ్యూటీ సంచితా పదుకునే కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కెమెరామెన్ ఎన్‌వీఆర్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఎక్సోడస్ మీడియా పతాకంపై నీలిమ నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం విశేషాలను సహ నిర్మాత కింగ్ జాన్సన్ కొయ్యడ వివరిస్తూ– ‘‘గ్రామీణ నేపథ్యంలో కొనసాగే సస్పెన్స్ లవ్‌స్టోరీ ఇది. శ్రీరామ్, సంచితా పదుకునే జంట చక్కగా కుదిరింది. అందం, అభినయం కలగలిసిన అచ్చ తెలుగు అమ్మాయిలా సంచిత ఈ చిత్రంలో కనిపిస్తారు. మ్యూజిక్ డైరెక్టర్ మహావీర్ చక్కటి పాటలు అందిస్తున్నారు. నెర్రపల్లి వాసు మంచి కథను సమకూర్చారు. ఇప్పటివరకు 60 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఈ నెల రెండోవారంలో చివరి షెడ్యూల్‌ని ప్రారంభిస్తాం. మేలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment