సాక్షి, హైదరాబాద్: టీవీ నటి కొండపల్లి శ్రావణి మృతి కేసులో పోలీసులు టిస్ట్ ఇచ్చారు. రిమాండ్ రిపోర్టులో ఏ1 గా దేవరాజ్ రెడ్డి, ఏ 2 గా సాయి కృష్ణా రెడ్డి, ఏ 3 గా అశోక్ రెడ్డిని చేర్చారు. అయితే, మొన్న (ఆదివారం) మధ్యాహ్నం జరిగిన మీడియా సమావేశంలో ఏ3 గా దేవరాజ్ పేరును వెల్లడించిన పోలీసులు తాజాగా అతన్ని ఏ1 గా పేర్కొన్నారు. ఇక ఈ కేసులో 17 మంది సాక్షులను విచారించినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. నిందితులు దేవరాజ్ రెడ్డి, సాయి కృష్ణా రెడ్డిలు విచారణలో కీలక విషయాలు చెప్పిట్టు తెలిసింది.
రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు
దేవ్‌రాజ్‌ని ప్రేమించిన శ్రావణి ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. అదే విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు దేవ్‌రాజ్‌ని అడగడంతో అతను ఒప్పుకోలేదు. శ్రావణి అతన్ని ఒప్పించే ప్రయత్నం చేసింది. కానీ, సాయి కృష్ణా రెడ్డి, అశోక్ రెడ్డిలతో శ్రావణికి రిలేషన్ ఉండటంతో దేవ్‌రాజ్ ఒప్పుకోలేదు. దేవ్‌రాజ్‌ని కలవడానికి శ్రావణి మెసెజ్‌లు, ఫోన్ కాల్స్‌తో ప్రయత్నించింది. సాయి కృష్ణ, అశోక్ రెడ్డి, శ్రావణి కుటుంబ సభ్యులు శ్రావణిని బెదిరించారు. సెప్టెంబర్ 7న అజీజ్ నగర్ షూటింగ్ లొకేషన్ నుంచి దేవ్‌రాజ్ శ్రావణిని తీసుకెళ్లాడు. ఇద్దరూ కలిసి పంజాగుట్ట శ్రీకన్య హోటల్ కి వెళ్లారు రాత్రి 9.30 గంటలకు చేరుకున్నారు.
(చదవండి: ట్రయాంగిల్ సీ‘రియల్’ స్టోరీ!)
అదే సమయంలో శ్రీకన్య హోటల్ కు చేరుకున్న సాయి కృష్ణా శ్రావణి ని కొట్టి ఆటోలో తీసుళ్లాడు. దేవ్ రాజ్‌ని కలవకూడదని సాయి కృష్ణా, అశోక్ రెడ్డి శ్రావణిని బెదిరించారు. దేవ్ రాజ్ ను చంపేసి, ఆర్థికంగా ఆదుకోము అని బెరింపులకు దిగారు. దీంతో హైదరాబాద్ వదిలి వెళ్లిపోదామని శ్రావణి దేవ్ రాజ్ ను కోరింది. శ్రావణి శ్రావణి తో పారిపోయి పెళ్లిచేసుకోవడానికి దేవ్ రాజ్ ఒప్పుకోలేదు. సాయి కృష్ణా, అశోక్ రెడ్డిల వేదింపులు తట్టుకోలేక శ్రావణి ఆత్మహత్యకు పాల్పడింది. ఏ 3 అశోక్ రెడ్డి పరారీలో ఉన్నాడు. సినీరంగంలో అవకాశాలు ఇప్పిస్తానంటూ ఆశ చూపి అశోక్ రెడ్డి శ్రావణితో సంబంధం ఏర్పరచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దేవరాజ్‌కు శ్రావణి దగ్గర కావటడం జీర్ణించుకోలేని అశోక్‌రెడ్డి సాయికృష్ణ ద్వారా ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment