
సాక్షి, హైదరాబాద్ : ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో టీవీ నటి లలిత అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. అమీర్‌పేటలోని ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటున్న ఆమె ఆకస్మికంగా కనపించకుండా పోయింది. గుర్తు తెలియని వ్యక్తి వచ్చి లలితను తీసుకెళ్లినట్టు ఆమె స్నేహితులు తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. లలిత స్వస్థలం అనంతపురం జిల్లా ధర్మవరం కాగా ఏడాదిగా టీవీ సీరియల్స్‌లో నటిస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం ఆమె తెలుగు చానెళ్లలో ప్రసారమయ్యే ప్రేమ, కల్యాణ వైభవం, స్వర్ణ ఖడ్గం అనే సీరియల్స్‌లో నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment