Prostitution Racket Busted In Hyderabad, 6 Bangladesh Womens Arrested - Sakshi
Sakshi News home page

Hyderabad: వ్యభిచార ముఠా గుట్టురట్టు.. ఆరుగురు బంగ్లాదేశ్‌ యువతుల అరెస్ట్‌

Published Fri, Oct 8 2021 7:00 AM | Last Updated on Fri, Oct 8 2021 8:54 AM

Prostitution Racket Busted In Hyderabad, 6 Bangladeshis Arrested - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, సిటీబ్యూరో: ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి బంగ్లాదేశ్‌ నుంచి యువతులను అక్రమంగా ఇండియాకు తీసుకొచ్చి బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపుతున్న ముఠాను హైదరాబాద్‌ నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బాపునగర్‌ రోడ్‌లో ఏడుగురు నిందితులను గురువారం అదుపులోకి తీసుకున్నారు. బంగ్లాదేశ్‌ ఖుల్నా జిల్లాలోని భవానీపూర్‌కు చెందిన కౌసుర్దాస్‌ నూర్‌ మహ్మద్‌ కోలిబా, నహిదా ఖుసుర్దాస్‌ కోలిబా, కాచి ముషారఫ్‌ సర్దార్‌లతో పాటు మరి కొందరు యువతులను  అరెస్ట్‌ చేశారు. వారి నుంచి బంగ్లాదేశ్‌ గుర్తింపు కార్డులు, పాస్‌పోర్ట్‌ జిరాక్స్‌ కాపీలు, నకిలీ ఆధార్‌ కార్డులు, 10 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.   

చదవండి: (ఘోర ప్రమాదం.. 15 మంది దుర్మరణం)

వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్‌లోని భవానీపూర్‌కు చెందిన కౌసుర్దాస్‌ నూర్‌ మహ్మద్, అతని భార్య నహిదా ఖుసుర్దాస్‌ కోలిబాలు కొన్నేళ్ల క్రితం అక్రమంగా ఇండియాలోకి ప్రవేశించారు. కొంతకాలం పాటు ముంబైలో గడిపి.. ఇటీవల హైదరాబాద్‌కు మకాం మార్చారు. బంగ్లాదేశ్‌ నుంచి మహిళలను అక్రమంగా తరలించే ఏజెంట్‌ అతియార్‌ మొండల్, వ్యభిచార నిర్వాహకుడు కాచి ముషారఫ్‌తో కలిసి ముఠాగా ఏర్పడ్డారు.

చదవండి: (మాదకద్రవ్యాల స్వర్గధామంగా ముంబై?)

బంగ్లాదేశ్‌లో పని మనిషులుగా ఉన్న కొందరు యువతులకు అతియార్‌ మొండాల్‌ ఇండియాలో మంచి పని, జీతం ఇప్పిస్తాననని మాయమాటలు చెప్పి సనత్‌నగర్‌కు తీసుకొచ్చాడు. ఇక్కడ గ్యాంగ్‌తో కలిసి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ కమిషనర్‌ డీసీపీ (ఓఎస్‌డీ) పీ రాధాకిషన్‌ రావు ఆదేశాల మేరకు, టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కే నాగేశ్వర్‌ రావు, ఎస్‌ఐ కే శ్రీకాంత్, బీ పరమేశ్వర్, బీ అశోక్‌ రెడ్డి, జీ శివానందం నిందితులను పట్టుకున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement