
ప్రాణ భయముందంటూ సినీనటి ఫిర్యాదు
హైదరాబాద్: సినీనటి అపూర్వ తనకు ప్రాణ భయముందని ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్ వహిదుద్దీన్ తెలిపిన మేరకు.. సిద్ధార్థనగర్‌లో నివాసముంటున్న అపూర్వ కారును ఈ నెల 21న ఫిలింసిటీ సమీపంలోని చౌటుప్పల్ వద్ద మరో కారు ఢీ కొట్టింది. ఈ సంఘటనలో అపూర్వ కారు పూర్తిగా దెబ్బతినింది.
దీంతో మరమ్మతులు చేయించడానికి ఢీకొట్టిన వారు ఒప్పుకున్నారు. అంతేకాకుండా కారు రిపేరు పూర్తయ్యే వరకు వారి కారును కూడా అపూర్వ వద్దే ఉంచారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల తనకు బెదిరింపు ఫోన్‌కాల్స్‌తోపాటు నివాసముంటున్న సిద్ధార్థనగర్‌లోని తన ఇంటి వద్ద పలువురు వ్యక్తులు తచ్చాడుతున్నారని ఆమె పోలీసులకు సోమవారం రాత్రి ఫిర్యాదు చేశారు.