
సాక్షి, అమీర్‌పేట : డీసీఎం వ్యాన్ ఢీకొని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి చెందిన సంఘటన ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై జ్ఞానేందర్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన పల్లె ప్రశాంత్ (28) ఉప్పల్‌లో ఉంటూ మధురానగర్‌లోని ఐటీ సొల్యూషన్స్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం తెల్లవారు జామున అతను బైక్‌పై ఇంటికి తిరిగివస్తూ మైత్రివనం చౌరస్తా నుంచి రాంగ్ రూట్‌లో అమీర్‌పేట వైపు వెళుతుండగా ఎదురుగా వచ్చిన డీసీఎం వ్యాను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment