
సాక్షి, హైదరాబాద్ : బోరబండలో దారుణం జరిగింది. మూడో పెళ్లి కోసం ఇద్దరు భార్యలను వేధించాడు ఓ భర్త. తాను మూడో పెళ్లి చేసుకునేందుకు అనుమతి పత్రంపై సంతకం చేయాలంటూ తన భార్యలిద్దరిపై ఒత్తిడి తెచ్చాడు. సంతకం చేయమని చెప్పడంతో పచ్చి బాలింతరాలని కూడా కనికరం లేకుండా రెండో భార్యను బెల్టుతో చావబాదాడు. దీంతో ఇద్దరు భార్యలు కలిసి భర్తపై ఎస్ ఆర్ నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment