![GHMC Elections 2020: FIR Filed Against Bandi Sanjay, Akbaruddin - Sakshi](/styles/webp/s3/article_images/2020/11/28/Akbaruddin.jpg.webp?itok=Ool7Iq4c)
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బీజేపీ, ఎంఐఎం నేతలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై సుమోటో కింద పోలీస్ శాఖ కేసు నమోదు చేసింది. ఎర్రగడ్డ డివిజన్‌లో ప్రచారం నిర్వహించిన బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై ఐపీసీ 505 కింద కేసు ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. దారుసలాం, పీవీ నర్సింహారావు, ఎన్టీఆర్ ఘాట్ కూల్చివేత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
కాగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్, పీవీ సమాధులను కూల్చాలన్న ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందిస్తూ... ‘ఒవైసీ నీకు దమ్ముంటే ఆ మహనీయులు సమాధులు ముట్టుకో చూద్దాం.. అదే జరిగితే మా కార్యకర్తలు క్షణాల్లో దారుసలాంని నేల మట్టం చేస్తారు’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. (పాతబస్తీలో సర్టికల్ స్ట్రైక్ చేస్తాం: సంజయ్)
Comments
Please login to add a commentAdd a comment