
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల 7న(సోమవారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. పర్యటనలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల వివరాలను బీజేపీ జాతీయ నేతలకు వివరించనున్నారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన కేంద్రమంత్రులు ప్రకాష్ జావడేకర్, స్మృతీ ఇరానీ సహా పలువును కలిసి కృతజ్ఞతలు తెలిపే అవకాశం ఉంది.
(చదవండి : గ్రేటర్‌లో మూడు ముక్కలాట)
కాగా, గ్రేటర్ ఎన్నికల్లో నగర ఓటరు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. టీఆర్ఎస్-55, బీజేపీ-48, ఎంఐఎం-44, కాంగ్రెస్-2 స్థానాల్లో విజయం సాధించింది. మేయర్ పీఠం దక్కించుకోవాలంటే 76 స్థానాల్లో విజయం సాధించాలి. కానీ ఒక్క పార్టీ కూడా 60 దాటలేదు. దాంతో హంగ్ తప్పదంటున్నారు విశ్లేషకులు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై జాతీయ నేతలతో బండి సంజయ్ చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment