హైదరాబాద్: ప్రేమించిన యువతితో గొడవ జరగడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని క్రిష్ణారెడ్డి నగర్ కాలనీలో కృష్ణ(23) అనే యువకుడు ఓ యువతిని ప్రేమించాడు.
గత కొన్ని రోజులుగా ఆ యువతితో కృష్ణ గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్తాపం చెందిన అతను ఆదివారం విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.