
సాక్షి, హైదరాబాద్ : ప్రేమ వ్యవహారం ఓ యువతి ప్రాణం బలితీసుకుంది. తల్లిదండ్రుల కళ్ల ముందే హస్టల్ భవనంపై నుంచి దూకి పాలిటెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన బుధవారం ముషీరాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం రొంపిగుంటకు గ్రామానికి చెందిన మహ్మద్ సనా ముషీరాబాద్ ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ పాలిటెక్నిక్ చదువుతోంది. సనా ఓ అబ్బాయితో ప్రేమలో ఉన్నట్లు తెలుసుకున్న తల్లిదండ్రులు ఆమెను ఇంటికి తీసుకెళ్లడానికి బుధవారం కళాశాల దగ్గరకు వచ్చారు. దీంతో సనా తల్లిదండ్రుల ముందే హాస్టల్ భవనం మూడో అంతస్తు మీద నుంచి కిందకు దూకింది. తీవ్రగాయాలపాలైన ఆమె గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
Comments
Please login to add a commentAdd a comment