hostel building
-
80 చెంపదెబ్బలు కొట్టిన సీనియర్లు.. రెండో అంతస్తు నుంచి దూకిన విద్యార్థి
దిస్పూర్: అస్సాం డిబ్రూగఢ్ యూనివర్సిటీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. సీనియర్ల టార్చర్ భరించలేక ఓ విద్యార్థి హాస్టల్ రెండో అంతస్తు నుంచి కిందకు దూకాడు. తీవ్రగాయాల పాలైన అతడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాధితుడ్ని శివసాగర్ జిల్లా అమ్గూరికి చెందిన ఆనంద్ శర్మగా గుర్తించారు. ఈ యూనివర్సిటీలో ఎంకామ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే తమ కుమారుడ్ని సీనియర్లు వారం రోజులుగా వేధిస్తున్నారని అతని తల్లి తెలిపింది. ఆదివారం కూడా 80 చెంపదెబ్బలు కొట్టారని, కర్రలు, బాటిళ్లతో టార్చర్ చేశారని వెల్లడించింది. అది భరించలేకే తన కుమారుడు భవనం పైనుంచి దూకేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. ర్యాగింగ్ విషయం గురించి హాస్టల్ వార్డెన్‌ను ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని ఆనంద్ శర్మ తల్లి వాపోయింది. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జితెన్ హజారికా చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీఎం స్పందన.. ఈ ఘటనకు సంబంధించి మొత్తం ముగ్గురిని అరెస్టు చేశారు పోలీసులు. అయితే ప్రధాన నిందితుడు ఇంకా పరారీలోనే ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు విద్యార్థులు ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలని సీఎం హిమంత బిశ్వ శర్మ సూచించారు. పోలీసులు తక్షణమే విచారణ చేపట్టి ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చదవండి: పెళ్లి చేసుకోకపోతే.. ముక్కలు ముక్కలు చేస్తా.. అమ్మాయికి బెదిరింపులు.. -
పరిక్షల్లో ఫెయిల్.. ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య
న్యూఢిల్లీ: మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ (ఎంఎఎంసీ)కి చెందిన 19 ఏళ్ల వైద్య విద్యార్థి గురువారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడింది. కాలేజీలోని ఉమెన్స్ హాస్టల్లో యువతి తన గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థిని దివ్య యాదవ్‌గా గుర్తించారు. డిసెంబర్ 29 సాయంత్రం విడుదలైన మెడికల్ విద్య పరీక్ష ఫలితాల్లో రెండు పేపర్లలో ఫెయిల్ అయ్యింది. అప్పటి నుంచి ఆమె డిప్రెషన్‌తో ఉన్నట్లు దివ్య రూమ్మేట్స్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే గురువారం ఉదయం 64వ నంబర్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆమె గదిలో మొబైల్ ఫోన్, సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి ఆమె తండ్రికి అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు. చదవండి: (అనుమానంతో కూతుర్ని కాల్చి చంపిన తండ్రి) -
భవనం పైనుంచి దూకి యువతి ఆత్మహత్య
చందానగర్: హాస్టల్ భవనంపై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ రవీందర్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లా, చేగుంట గ్రామానికి చెందిన శిల్ప (19)గౌతమీనగర్‌లోని బీఎస్ఆర్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ అశోక్‌నగర్‌లోని విజయ డయాగ్నోస్టిక్స్‌లో పని చేసేది. ఈ నెల 1న ఉద్యోగం మానేసిన ఆమె ప్రస్తుతం ఖాళీగా ఉంటోంది. మంగళవారం రాత్రి బిల్డింగ్ పై నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడింది. బాధితురాలిని ఆమె స్నేహితుడు అనిల్ సమీపంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
స్పోర్ట్స్ హాస్టల్‌కు సుస్తీ
వరంగల్ స్పోర్ట్స్: హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ఆవరణలో ఉన్న వరంగల్ రీజినల్ స్పోర్ట్స్ హాస్టల్ భవనానికి సుస్తి చేసింది. దశాబ్దాల క్రితం నిర్మించిన భవనం కావడంతో శిథిలావస్థకు చేరింది. పగుళ్లు ఏర్పడి, పెచ్చులూడిన పైకప్పు నుంచి ఇటీవల వరుసగా కురిసిన భారీ వర్షాలకు భవనంలోని గోడలు తడిసి పాకురు పట్టాయి. అయినా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదు. నేడు జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని హాస్టల్ స్థితిగతులు, క్రీడాకారుల వసతులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. హైదరాబాద్ తర్వాత రెండో రాజధానిగా చెప్పుకుంటున్న వరంగల్ అందుకు తగ్గట్టుగా అభివృద్ధికి నోచుకోవడం లేదు. క్రీడాకారులకు పెద్ద పీట, క్రీడల అభ్యున్నతికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్న పాలకుల హామీలు కాగితాల్లోనే పరిమితమయ్యాయి. జేఎన్‌ఎస్‌లోని వరంగల్ రీజినల్ స్పోర్ట్స్ హాస్టల్లో అథ్లెటిక్స్, హ్యాండ్‌బాల్, జిమ్నాస్టిక్స్ క్రీడల్లో ప్రవేశం కల్పిస్తున్నారు. ఈ మూడు ఆటల క్రీడాకారుల్లో ప్రస్తుతం 108 మంది క్రీడాకారులు ఉంటున్నట్లు డీఎస్ఏ అధికారులు చెబుతున్నారు. అందులో 38మంది బాలికలు కాగా, మిగిలిన వారు బాలురు ఉంటున్నారు. సుమారు 40 ఏళ్ల క్రితం నిర్మించిన హాస్టల్ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోగా రెండేళ్ల క్రితం బాలురను స్టేడియం ఆవరణలో నిర్మించిన కొత్త భవనంలోకి మార్చారు. బాలికలు మాత్రం పాత భవనంలోనే ఉంటున్నారు. ఇందులోనే క్రీడాకారులకు భోజనం వడ్డిస్తుంటారు. ఇక కొత్తగా నిర్మించిన భవన నిర్మాణంలో జరిగిన లోపాల వల్ల వర్షాలు కురిసిన ప్రతీసారీ వర్షపు నీరు హాస్టల్ వరండాలోకి చేరుతోంది. దీంతో క్రీడాకారులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఫస్ట్ ఎయిడ్ కిట్టు లేదు.. ప్రమాదకరంగా భావించే జిమ్నాస్టిక్తోపాటు సాధారణంగా గాయాలు తగిలే అథ్లెటిక్స్, హ్యాండ్‌బాల్ క్రీడాకారులకు కనీసం ప్రాథమిక చికిత్స అందించే మందులు లేవు. చిన్నపాటి దెబ్బలు తగిలినప్పుడు క్రీడాకారులకు అప్లై చేసే పెయిన్ కిల్లర్ జెల్ కూడా హాస్టల్ క్రీడాకారులకు అందుబాటులో లేదు. అంతేకాదు జ్వరమొస్తే వేసుకునే పారాసెటమాల్ టాబ్లెట్లు కూడా లేకపోవడం విశేషం. జ్వరమొచ్చినా, చిన్న పాటి గాయమైన సంబందిత కోచ్ క్రీడాకారుడిని వెంటబెట్టుకుని ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 108 మంది క్రీడాకారుల హెల్త్బడ్జెట్ రూ.3 వేలే.. స్పోర్ట్స్ హాస్టల్లో ఉంటున్న 108 మంది క్రీడాకారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ రూ.3వేలే కావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సీజనల్ వ్యాధులతో సతమతమవుతున్న తరుణంలో కనీసం డెంగీ పరీక్ష చేసి, పది రోజులకు మందులు వాడాలంటేనే ఒక్కరికి కూడా ఆ సొమ్ము సరిపోదన్న విషయం తెలిసిందే. అలాంటి సమయంలో క్రీడాకారుడికి మేజర్‌గా గాయాలైన, ఇంకేమైనా మొదట ఖర్చు చేసి ఆ తర్వాత ‘సాట్’కు బిల్లులు పంపిస్తే అప్పుడు ఖర్చులు వెచ్చిస్తుందట. ఇదీ మన ప్రభుత్వం క్రీడాకారుల సంక్షేమానికి ఇస్తున్న ప్రాధాన్యం. కొత్త భవనానికి ప్రతిపాదనలు పంపించాం శిథిలావస్థలో ఉన్న భవనం స్థానంలో కొత్త భవనం నిర్మించాలని కోరుతూ జిల్లా కలెక్టర్, సాట్ చైర్మన్, ఎండీలకు ప్రతిపాదనలు పంపించాను. సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకుని వారానికోసారి స్పోర్ట్స్ హాస్టల్లో మెడికల్ క్యాంపు నిర్వహించాలని కోరాం. పిల్లలకు జ్వరం వచ్చినా, చిన్న గాయమైనా మేము దగ్గరుండి ఆస్పత్రికి తీసుకెళ్తాం. – ధనలక్ష్మి, డీవైఎస్ఓ, వరంగల్ అర్బన్ జిల్లా -
ప్రేమ వ్యవహారం.. భవనంపై నుంచి దూకిన యువతి
సాక్షి, హైదరాబాద్ : ప్రేమ వ్యవహారం ఓ యువతి ప్రాణం బలితీసుకుంది. తల్లిదండ్రుల కళ్ల ముందే హస్టల్ భవనంపై నుంచి దూకి పాలిటెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన బుధవారం ముషీరాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం రొంపిగుంటకు గ్రామానికి చెందిన మహ్మద్ సనా ముషీరాబాద్ ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ పాలిటెక్నిక్ చదువుతోంది. సనా ఓ అబ్బాయితో ప్రేమలో ఉన్నట్లు తెలుసుకున్న తల్లిదండ్రులు ఆమెను ఇంటికి తీసుకెళ్లడానికి బుధవారం కళాశాల దగ్గరకు వచ్చారు. దీంతో సనా తల్లిదండ్రుల ముందే హాస్టల్ భవనం మూడో అంతస్తు మీద నుంచి కిందకు దూకింది. తీవ్రగాయాలపాలైన ఆమె గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. -
యువతి ప్రాణం బలితీసుకున్న ప్రేమ వ్యవహారం
-
అయ్యో.. గిరీష్
రాజాం సిటీ/ రూరల్/ కాకినాడ: ఆ కుటుంబంతో పాటు పొరుగున ఉన్న ఏ ఒక్క గ్రామంలోనూ ‘డాక్టర్’ చదువు చదివినోళ్లు లేరు. నిరుపేద కుటుంబమైనా తమ కుమారుడిని డాక్టర్ చేయాలనే లక్ష్యంతో ఆ తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు. అతడిపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆ యువకుడు ప్రస్తుత విద్యావిధానంలో నెలకొన్న మానసిక ఒత్తిడిని జయించలేక.. ప్రాణాలు తీసుకున్నాడు. కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు, ఆ ఊరి ప్రజల ఆశల ను అడియాసలు చేస్తూ అనంతలోకాలకు వెళ్లిపోయాడు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ద్వితీయ సంవత్సరం విద్యార్థి లెంకా గిరీష్‌నాయుడు(21) హాస్టల్‌పై నుంచి దూకి గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. నిత్యం నవ్వుతూ సరదాగా, ఉత్సాహంగా ఉండే గిరీష్‌నాయుడు తమ మధ్య లేడన్న నిజాన్ని జీర్ణించుకోలేని విద్యార్థులు తీవ్ర విషాదంలో పడిపోయారు. వ్యవసాయ కుటుంబం నుంచి... శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం అంతకాపల్లి పంచాయతీ మొగలి వలస గ్రామానికి చెందిన లెంక వెంకటరమణ, రాజేశ్వరి సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందినవారు. వీరి పెద్దకుమారుడు శ్రీధర్ విశాఖలో ఇంజినీరింగ్ చదువుతుండగా, రెండో కుమారుడు గిరీష్‌నాయుడు కాకినాడలో వైద్య విద్యనభ్యసిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి విద్యపై మక్కువతో బాగా రాణించేవాడని, పదో తరగతిలో అత్యుత్తమ మార్కులతోపాటు, ఏపీఆర్జేసీకి ఎంపికై విజయవాడలో ఇంటర్ చదివాడు. అక్కడ కూడా మంచి ర్యాంకులు సాధించి మెడిసిన్‌లో 200లోపు ర్యాంకు సాధించి ప్రభుత్వ కోటాలో కాకినాడ ఆర్ఎంసీలో వైద్య విద్యార్థిగా చేరాడు. ప్రాణం తీసిన సెమిస్టర్ పరీక్ష వైద్య విద్య ద్వితీయ సంవత్సరంలోని సెమిస్టర్ పరీక్ష గిరీష్‌నాయుడు ఆత్మహత్యకు కారణమైందని తోటి విద్యార్థులంటున్నారు. వాస్తవానికి ద్వితీయ సంవత్సరం సెమిస్టర్ విధానంలో ప్రతీ ఆరు నెలలకు రెండేసి సెమిస్టర్లు ఉండేవని, అయితే ఈసారి నాలుగు సెమిస్టర్ పరీక్షలు ఒకేసారి నిర్వహించాలన్న నిర్ణయంతో గిరీష్‌నాయుడు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైనట్టు తెలిసింది. శుక్రవారం మైక్రో బయాలజీ పరీక్ష రాయాల్సి ఉందని, ఒక అంశంపై ఎన్నిసార్లు కసరత్తు చేసినా ఫలితంలేకపోతుందంటూ ఆత్మహత్యకు ముందు తోటి విద్యార్థుల వాపోయినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 6–7 గంటల సమయంలో హాస్టల్లోని టెర్రస్‌పైకి ఎక్కి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. క్రీడల్లో రాణింపు: చదువుతోపాటు క్రీడల్లో కూడా గిరీష్ బాగా రాణించేవాడని తోటి విద్యార్థులు చెప్పారు. గత ఏడాది డిసెంబర్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహించిన క్రీడాపోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయిలో ప్రతిభ చాటాడని చెబుతున్నారు. స్పోర్ట్స్ సెక్రటరీగా కూడా గిరీష్ వ్యవహరించే వాడని చెప్పారు. అలుముకున్న విషాదం గిరీష్ ఆత్మహత్య చేసుకున్నాడన్న వాస్తవాన్ని తోటి విద్యార్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. సంఘటన స్థలంలో, ఆ తరువాత కాకినాడ మార్చురీ వద్ద గిరీష్ స్నేహితులు విలపించారు. కాకినాడలోని ఐడీబీఐ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్న గిరీష్ మామయ్య వరహాలనాయుడు సమాచారం తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకుని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆర్ఎంసీలో ఇది రెండో ఘటన విద్యలో ఎదురయ్యే మానసిక ఒత్తిడితో కాకినాడ ఆర్ఎంసీలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం రెండోసారని విద్యార్థుల ద్వారా తెలిసింది. సుమారు ఎనిమిదేళ్ల క్రితం ఒక విద్యార్థిని ఇదే తరహాలో ఆత్మహత్యకు పాల్పడిందని, ఇప్పుడు ఇది రెండో సంఘటన అని చెబుతున్నారు. మెడికో మరణంతో స్వగ్రామంలో విషాదం రాజాం సిటీ: లెంక గిరీష్‌కుమార్ (20) కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడనే సమాచారంతో గ్రామంలో విషాదం నెలకొంది. లెంక వెంకటరమణ, రాజేశ్వరమ్మలు వ్యవసాయం చేసుకుంటూ తన ఇద్దరు కుమారులను ఉన్నతులుగా చూడాలన్న కోరికతో ఉన్నత చదువులు చదివిస్తున్నారు. గిరీష్ వైద్యవిద్యలో చేరి గ్రామానికి మంచిపేరు తెస్తాడనుకున్న తరుణంలో ఈ మృతివార్త విషాదాన్ని నింపింది. గిరిష్ మృతిచెందాడన్న సమాచారంతో తండ్రి కుప్పకూలిపోయాడు. చదువులో ముందుండే గిరీష్ ఎందుకు ఇంత అఘాయిత్యానికి పాల్పడ్డాడోనని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకునేటంత పిరికివాడు కాదని, ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించి సీటు సంపాదించాడని కన్నవారు తెలిపారు. గిరీష్ మృతిచెందిన విషయం గుండెకు సంబంధించి వ్యాధితో బాదపడుతున్న తన తల్లి రాజేశ్వరికి తెలియకుండా ఈ విషయాన్ని దాచిపెట్టేందుకు ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ గ్రామస్థులు ఆందోళన తీవ్రతరం కావడంతో ఆమె పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన పలువురిలో వ్యక్తమౌతుంది. విషయం తెలిసిన వెంటనే తండ్రి వెంకటరమణతోపాటు సోదరుడు శ్రీధర్, బంధువుల హుటాహుటిన కాకినాడకు బయలుదేరి వెళ్లారు. -
హాస్టల్లో ఉండటం ఇష్టం లేకే..?
నిజామాబాద్ నగరంలోని వినాయక్‌నగర్‌లోగల శ్రీ మేధా జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం చదు వుతున్న విద్యార్థిని రుచిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కళాశాల నాలుగో అంతస్తు నుంచి దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన స్థానికులు, విద్యార్థులు, కళాశాల యాజమాన్యం ప్రయివేటు ఆస్ప త్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. జిల్లా ఇంటర్ విద్యాధికారి దాసరి ఒడ్డెన్న ఘటనా స్థలానికి వెళ్లి తోటి విద్యార్థులతో విచారణ చేపట్టారు. విద్యార్థిని ఆత్మహత్యాయ త్నం చేసుకున్న ఘటన జిల్లాలో కలకలం రేపింది. వినాయక్‌నగర్(నిజామాబాద్‌అర్బన్): ఆర్మూర్ మండలం పెర్కిట్‌కు చెందిన రాజేశ్వర్ తన కూతురు రుచితను నగరంలోని శ్రీమేధ జూనియర్ కళాశాల హాస్టల్లో చేర్చారు. విద్యార్థిని గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో కళాశాల భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అక్కడే వాకింగ్‌కు వచ్చిన వారంతా గుమిగూడారు. దీన్ని గమనించిన వైద్యులు ప్రేమానందం తన కారులో విద్యార్థినిని తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్చారు. ప్రాథమిక చికిత్స అనంతరం విద్యార్థినికి వైద్య పరీక్షలు నిర్వహించారు. విద్యార్థిని రెండు కాళ్లు ఫ్రాక్చర్ అయినట్లు, మూడు పక్కటెముకులు విరిగినట్లు వైద్యులు తెలిపారు. రక్త స్రావం అధికంగా కావడంతో విద్యార్థిని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న నాలుగో టౌన్ ఎస్ఐ నరేష్ విద్యార్థిని వాంగ్మూలం తీసుకునేందుకు జడ్జిని ఆసుపత్రికి తీసుకొచ్చారు. విద్యార్థిని స్పృహలోకి రాకపోవడంతో వారు వెనుదిరిగారు. ఈ ఘటనకు సంబంధించి జిల్లా ఇంటర్ విద్యాధికారి ఒడ్డెన్న విచారణ చేపట్టారు. సాయంత్రం ఆస్పత్రి వచ్చిన ఒడ్డెన్న విద్యార్థినిని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులు, కళాశాల యాజమాన్యంతో ఘటనకు గల కారణాలపై ఆరా తీశారు. అనంతరం ఘటనాస్థలానికి వెళ్లి తోటి విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రుచిత చదువులోనూ, ఆరోగ్యపరంగా చురుగ్గా ఉండేదని వారు తెలిపారు. కళాశాల యాజమాన్యం ఎలాంటి ఒత్తిళ్లకు గురిచేయలేదని, ఆమె అలా ఎందుకు చేసుకుందో అర్థం కావడంలేదని సమాధానమిచ్చారు. ఇదేవిషయమై కళాశాల డైరెక్టర్ భూపతిరెడ్డిని అడగగా మూత్రశాలకు వెళ్లిన రుచిత కళాశాలపై నుంచి పడిన విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్నానన్నారు. ప్రస్తుతం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. చదువు, ఫీజు విషయంలో ఎలాంటి ఒత్తిళ్లు చేయలేదన్నారు. నాలుగో టౌన్ పోలీసులు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. హాస్టల్లో ఉండటం ఇష్టం లేకనే..? ఇటీవలే విద్యార్థిని తనకు హాస్టల్లో ఉండటం ఇష్టం లేదని తన తల్లితో చెప్పినట్లు సమాచారం. మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రులను అడిగే ప్రయత్నం చేయగా వారు వివరాలు తెలిపేందుకు నిరాకరించారు. -
సైన్స్ కాలేజీలో రూ.10 కోట్లతో హాస్టల్ భవనం
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధంగా సైఫాబాద్‌లో ఉన్న సైన్స్ కాలేజీలో మరో హాస్టల్ భవనం నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరయ్యాయని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ లక్ష్మయ్య తెలిపారు. కళాశాల పూర్వ విద్యార్థి, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అందించనున్న రూ.8 కోట్ల నిధులకు తోడు యూనివర్సిటీ నుంచి రూ.2 కోట్లు రానున్నాయని ఆయన వివరించారు. ఈ మొత్తం రూ.10 కోట్లతో విద్యార్థులకు కొత్త హాస్టల్ భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఒకే హాస్టల్ భవనంలో డిగ్రీ, పీజీ విద్యార్థులకు వసతి కల్పించడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని వివరించారు. మంత్రి ప్రకటించిన మేరకు నిధులు అందిన వెంటనే వచ్చే మార్చిలో నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు ఆయన శనివారం 'సాక్షి'కి వెల్లడించారు. -
తండ్రి రెండో పెళ్లి.. కూతురి ఆత్మహత్యాయత్నం!
కూకట్పల్లి(హైదరాబాద్): తండ్రి రెండో వివాహం చేసుకున్నందున మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన నగరంలోని కూకట్పల్లి ప్రాంతంలో గురువారం చోటుచేసుకుంది. కూకట్‌పల్లిలోని బాలాజీ నగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉండే శిరీష, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులకు వెళుతుంది. అయితే శిరీష తండ్రి ఇటీవల రెండో వివాహం చేసుకున్నాడు. దీంతో మనస్తాపం చెందిన శిరీష ఈ రోజు హాస్టల్ భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి యత్నించింది. బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కుప్పకూలిన హాస్టల్ భవనం : విద్యార్థులు సురక్షితం
కాకినాడ : కాకినాడ నగరం సాంబమూర్తినగర్లోని ప్రభుత్వ బధిరుల పాఠశాలలోని హాస్టల్ భవనం కుప్పకూలింది. అయితే భవనంలోని 46 మంది విద్యార్థులు సురక్షితంగా ఉన్నారు. విద్యార్థులు స్నానాలు చేస్తున్న సమయంలో భవనం కూలడంలో పెద్ద ప్రమాదం తప్పింది. హాస్టల్ భవనం ఆదివారం ఉదయం 6.00 గంటల సమయంలో కూలిందని స్థానికులు చెబుతున్నారు. కాగా ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. -
నత్తనడకన ‘ఇందిరమ్మ
విద్యా నిలయం’ పనులు మొయినాబాద్: కళాశాల విద్యార్థినుల కోసం ప్రభుత్వం నిర్మిస్తున్న ‘ఇందిరమ్మ విద్యా నిలయం’ హాస్టల్ భవనం నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు ప్రారంభమై ఎనిమిది నెలలు దాటినా ఇప్పటికీ పునాదులకే పరిమితమయింది. కళాశాలల్లో చదివే విద్యార్థుల వసతి కోసం ఇందిరమ్మ విద్యా నిలయాలు నిర్మించేందుకు గత ఏడాది అప్పటి ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా జిల్లాలో ఆరు హాస్టల్ భవనాలను నిర్మించేం దుకు ప్రణాళికలు సిద్ధం చేసి, ఒక్కో భవనానికి రూ. 2.50 కోట్ల నిధులు కేటాయించింది. వాటిలో ఒకటి మొయినాబాద్‌లో బాలికల కోసం నిర్మించేందుకు మంజూరు చేశారు. దాంతో భవన నిర్మాణంకోసం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో అర ఎకరం ప్రభుత్వ భూమిని కేటాయించారు. ఈ భవన నిర్మాణానికి గత సంవత్సరం నవంబర్ 14న అప్పటి జిల్లా చేనేత, జౌళి శాఖ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్ శంకుస్థాన చేశారు. ప్రభుత్వం ఈ భవన నిర్మాణ పనుల పర్యవేక్షణను వైద్య, ఆరోగ్య శాఖ ఇంజనీరింగ్ విభాగానికి అప్పగించింది. నెల రోజుల్లోపే టెండర్లు పూర్తి కావడంతో వెం టనే పనులు ప్రారంభించారు. కానీ ఆ పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. ఈ సంవత్సరం డిసెంబర్‌లోపు ఈ భవనం పూర్తి కావాల్సి ఉంది. ప్రస్తుతం నడుస్తున్న పనులను బట్టిచూస్తే మరో సంవత్సరం పాటు భవని ని ర్మాణ పనులు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. నాలుగు నెలల క్రితం పనులను పరిశీలించేందుకు వచ్చిన వైద్య, ఆరోగ్య శాఖ ఇంజనీరింగ్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆనందర్‌కుమార్ పనులు వేగవంతం చేయాలని, డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచిం చారు. అయినా పనులు మందకొడిగానే సాగుతుండడంతో వచ్చే విద్యా సంవత్సరంలోనైనా ఈ భవనం విద్యార్థులకు అందుబాటులోకి వస్తుందో రాదోననే సందేహం నెలకొంది. -
ఆరిన విద్యాకుసుమం
ఎం.గౌరారం(కనగల్), న్యూస్‌లైన్: ఎందరికో వెలుగులు పంచాల్సిన ఆ విద్యాకుసుమం మధ్యలోనే ఆరిపోయింది. తమ కుమారుడు మంచి స్థితిలో ఉండాలని కూలినాలి చేసి ఉన్నత చదువు చదివిస్తున్న ఆ తల్లిదండ్రుల ఆశ నెరవేరకుండానే ఈ లోకాన్ని వీడాడు. ఉన్నత ఉద్యోగంలో స్థిరపడి మిమ్మల్ని మంచిగా చూసుకుంటానని అమ్మానాన్నలతో ఫోన్లో చెప్పిన కొన్ని గంటల్లోనే అనంతలోకాలకు వెళ్లిపోయాడు. ఆదిలాబాద్ జిల్లా బాసర ఐఐటీలో చదువుతున్న ఎం.గౌరారం విద్యార్థి శనివారం రాత్రి హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలు.. కనగల్ మండలం ఎం. గౌరారానికి చెందిన బొమ్మపాల వెంకటయ్య-జయమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. కూలినాలి చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరిలో పెద్దకొడుకు నాగరాజు(21) 2008లో కనగల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివి అత్యున్నత మార్కులు సాధించడంతో బాసర ఐఐటీలో సీటు వచ్చింది. ప్రస్తుతం బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. శనివారం రాత్రి ఐఐటీలోని హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్ర గాయాలైన నాగరాజును చికిత్స నిమిత్తం నిజామాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మేనత్త కూతురితో పెళ్లి నిశ్చయం నాగరాజుకు ఇటీవల మేనత్త కూతురితో పెళ్లి కుదిరింది. ఈ నెల 26న వివాహం నిశ్చయమై నప్పటికీ అనివార్య కారణాల వల్ల నిలిచిపోయింది. ఇదే విషయమై శనివారం రాత్రి 8 గంటల సమయంలో తల్లిదండ్రులతో మాట్లాడాడు. వచ్చే నెల 5న లగ్నం పెట్టుకోవాలని నాగరాజు తమతో చెప్పినట్లు అతని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. కూలినాలి చేసుకుంటూ కొడుకును చదివించామని, అతని ఇష్టప్రకారమే పెళ్లి నిశ్చయం చేశామని వారు రోదించారు. ఇంతలోనే తమ కుమారుడు కనిపంచని లోకాలకు వెళ్లిపోయాడని వారు కన్నీరుమున్నీరయ్యారు. మృతిపై అనుమానాలు నాగరాజు మృతిపై అతని కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శనివారం రాత్రి సంఘటన జరిగితే ఆదివారం ఉదయం వరకు తమకు చెప్పలేదన్నారు. కళాశాల యాజమాన్యం సరైన సమాచారం ఇవ్వడం లేదని వారు తెలిపారు.