
శిల్ప (ఫైల్)
చందానగర్: హాస్టల్ భవనంపై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ రవీందర్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లా, చేగుంట గ్రామానికి చెందిన శిల్ప (19)గౌతమీనగర్‌లోని బీఎస్‌ఆర్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటూ అశోక్‌నగర్‌లోని విజయ డయాగ్నోస్టిక్స్‌లో పని చేసేది. ఈ నెల 1న ఉద్యోగం మానేసిన ఆమె ప్రస్తుతం ఖాళీగా ఉంటోంది. మంగళవారం రాత్రి బిల్డింగ్ పై నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడింది. బాధితురాలిని ఆమె స్నేహితుడు అనిల్ సమీపంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.