
తండ్రి రెండో పెళ్లి.. కూతురి ఆత్మహత్యాయత్నం!
కూకట్‌పల్లి(హైదరాబాద్): తండ్రి రెండో వివాహం చేసుకున్నందున మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన నగరంలోని కూకట్‌పల్లి ప్రాంతంలో గురువారం చోటుచేసుకుంది. కూకట్‌పల్లిలోని బాలాజీ నగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉండే శిరీష, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులకు వెళుతుంది. అయితే శిరీష తండ్రి ఇటీవల రెండో వివాహం చేసుకున్నాడు.
దీంతో మనస్తాపం చెందిన శిరీష ఈ రోజు హాస్టల్ భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి యత్నించింది. బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.