టీవీ యాంకర్‌ను తిడుతూ 2వేల కాల్స్ | tv anchor gets more than 2 thousand abusive calls after show | Sakshi
Sakshi News home page

టీవీ యాంకర్‌ను తిడుతూ 2వేల కాల్స్

Published Tue, Mar 1 2016 2:48 PM | Last Updated on Sun, Sep 3 2017 6:46 PM

టీవీ యాంకర్‌ను తిడుతూ 2వేల కాల్స్

టీవీ యాంకర్‌ను తిడుతూ 2వేల కాల్స్

మహిషాసుర జయంతి జరుపుకోవడాన్ని దేశద్రోహంగా పరిగణించాలా.. వద్దా అనే అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించిన టీవీ యాంకర్‌ను తిడుతూ ఏకంగా 2వేలకు పైగా ఫోన్ కాల్స్ వచ్చాయి. ఈ ఘటన కేరళలో జరిగింది. అక్కడ ఏషియానెట్ చీఫ్ కోఆర్డినేటింగ్ ఎడిటర్, యాంకర్ అయిన సింధు సూర్యకుమార్ ఫిబ్రవరి 26న ఈ షో నిర్వహించారు. అప్పటి నుంచి ఆమెను తెగ తిట్టిపోస్తూ లెక్కలేనన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి. షో సమయంలో హిందూ దేవత ఒకరిని సెక్స్ వర్కర్‌గా అభివర్ణించారని సింధుపై ఆరోపణలు వచ్చాయి. దాంతో ఒక్కసారిగా జనం రెచ్చిపోయారు. ఆమె ఫేస్‌బుక్ పేజీలో తీవ్రవ్యాఖ్యలతో పోస్టులు పెట్టారు. అందులో ఒకరు ఏకంగా సింధు మొబైల్ నెంబరు కూడా పోస్ట్ చేసి, ఆమెకు నేరుగా ఫోన్ చేసి తిట్టాలని చెప్పారు.

అప్పటి నుంచి ఆమెకు లెక్కలేనన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి. చివరకు విసిగిపోయిన సింధు.. పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఆమెకు ఫోన్లు చేసిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వాళ్లంతా బీజేపీ, ఆర్ఎస్ఎస్, శ్రీరామ సేన లాంటి సంస్థలకు చెందినవారని తిరువనంతపురం పోలీసు కమిషనర్ స్పర్జన్ కుమార్ తెలిపారు. అయితే.. దేవతను తిడుతూ చేసిన వ్యాఖ్యలు బీజేపీ నేత వీవీ రాజేష్ ఓ కరపత్రంలో చదివారని, దాన్ని దేశద్రోహం అని ఎలా అంటారని మాత్రమే అడిగానని సింధు తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు. హిందూదేవతను సెక్స్‌వర్కర్‌గా చెప్పడంలో తప్పేంటని తాను అనలేదని ఖండించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement