Is Varshini Sounderajan In Love With Cricketer Washington Sundar, Rumours Goes Viral - Sakshi
Sakshi News home page

Varshini Sounderajan: పలుమార్లు స్టేడియానికి వెళ్లిన వర్షిణి! ఆ క్రికెటర్‌ కోసమేనా?

Published Mon, May 22 2023 12:32 PM | Last Updated on Mon, May 22 2023 3:35 PM

Is Varshini Sounderajan Love with Cricketer Washington Sundar - Sakshi

బుల్లితెర యాంకర్‌ వర్షిణి ఈ మధ్య వార్తల్లో బాగా హైలైట్‌ అవుతోంది. కారణం తను ఉప్పల్‌ స్టేడియంకు వెళ్లడం.. వెళ్లిన ప్రతిసారి ఎస్‌ఆర్‌హెచ్‌ ఓడిపోవడం. దీంతో ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమానులు ఇదివరకే ఆమెను ఓ ఆటాడేసుకున్నారనుకోండి అది వేరే విషయం. అయితే ఆమె అలా పదేపదే మ్యాచ్‌కు వెళ్లడానికి ఓ బలమైన కారణం ఉందట. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యువ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ కోసమే తను పదేపదే స్టేడియంకు వెళ్లిందంటూ ఓ వార్త వైరల్‌ అవుతోంది.

వీరిద్దరూ ప్రేమలో పడ్డారని, ఛాన్స్‌ దొరికితే చాలు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై అటు సుందర్‌, ఇటు వర్షిణి ఎవరూ ఇంతవరకు స్పందించలేదు. అయితే వర్షిణిని మాత్రం మళ్లీ చెడుగుడు ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. సోషల్‌ మీడియాలో ఏ ఫోటో పోస్ట్‌ చేసినా క్రికెటర్‌ గురించే గుచ్చి గుచ్చి అడుగుతున్నారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో వర్షిణి గ్లామర్‌ ఫోటోలు షేర్‌ చేయగా దాని కింద అందరూ వాషింగ్టన్‌ సుందర్‌ గురించే ఆరా తీస్తున్నారు.

'ఏంటి, సుందర్‌తో డేటింగ్‌ అంటగా..', 'బహుత్‌ సుందర్‌ హై', 'నీ డ్రెస్‌ చాలా బాగా వాషింగ్‌ చేసుకున్నావ్‌.. బహుత్‌ సుందర్‌ హై' అంటూ కామెంట్లతో చెలరేగిపోతున్నారు. కొందరైతే ఏకంగా క్రికెటర్‌ను పెళ్లి చేసుకోమని సలహా ఇస్తున్నారు. బుల్లితెరపై ఎంత అందాలు ఆరబోసినా రాని గుర్తింపు క్రికెటర్‌ భార్య అయితే వస్తుందని సలహా ఇస్తున్నారు. క్రికెటర్లను పెళ్లి చేసుకున్న సినీతారల జాబితాలో చేరిపోమని సూచిస్తున్నారు.

చదవండి: గ్రాండ్‌గా ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాత దానయ్య ఇంట పెళ్లి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement