Jabardasth Anchor Sowmya Rao's Emotional Video Goes Viral - Sakshi
Sakshi News home page

Sowmya Rao: నేను చేసిన పూజలు, ఉపవాసాలు వృథా.. జబర్దస్త్‌ యాంకర్‌ వీడియో వైరల్‌

Published Sun, May 21 2023 2:38 PM | Last Updated on Mon, May 22 2023 9:09 AM

Jabardasth Anchor Sowmya Rao Emotional Video Goes Viral - Sakshi

సీరియల్స్‌తో నటిగా కెరీర్‌ ఆరంభించిన సౌమ్య రావు జబర్దస్త్‌తో యాంకర్‌గా మారింది. షోలో నవ్వుతూ, చలాకీగా ఉంటూ, కంటెస్టెంట్లపై పంచులు విసిరే ఆమె వ్యక్తిగతంగా మాత్రం ఎంతో బాధను అనుభవిస్తున్నట్లు తెలుస్తోంది. సౌమ్య తల్లి క్యాన్సర్‌తో పోరాడి కన్నుమూశారు. చివరి రోజుల్లో తన తల్లి ఎదుర్కొన్న నరకం గురించి వివరిస్తూ ఇటీవల ఓ వీడియో షేర్‌ చేసింది.

ఈ వీడియోలో సౌమ్య రావు ఆస్పత్రి బెడ్‌ మీద ఉన్న తల్లిని కంటికి రెప్పలా చూసుకుంటూ తనను నవ్వించేందుకు ప్రయత్నించింది. తన తల్లి అనుభవించిన నరకం ఏ తల్లికీ రాకూడదని ఎమోషనలైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 'అంబులెన్స్‌, డాక్టర్స్‌.. ట్రీట్‌మెంట్‌.. మందులు.. ఎంతో బాధ అనుభవించావు. నీ కోసం ఆ భగవంతుడికి ఎన్నో పూజలు చేశాను. ఉపవాసాలు ఉన్నాను. అయినా ఆ దేవుడు కరుణించలేదు. ఆ భగవంతుడు నాకెందుకిలా చేశాడని బాధేస్తోంది. 

అందరూ అమ్మ ఫోటో షేర్‌ చేసి మదర్స్‌ డే శుభాకాంక్షలు చెప్తుంటే నాకు మాత్రం చివరి రోజుల్లో నువ్వు పడ్డ బాధే గుర్తొస్తోంది. దాన్ని మర్చిపోలేకపోతున్నాను. రేయిపగలు నీకు సేవ చేసినా, భగవంతుడికి పూజ చేసినా అన్నీ వృథా అయ్యాయి. నువ్వు లేకుండా నా జీవితం అసంపూర్తిగా మిగిలింది. ప్రతిరోజు, ప్రతిక్షణం నిన్ను మిస్‌ అవుతూనే ఉన్నాను. అమ్మా, నాకోసం మళ్లీ పుడతావని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నాను. దేవుడా.. మా అమ్మానాన్నలను మళ్లీ నాకివ్వు. నిన్ను చాలా మిస్‌ అవుతున్నా అమ్మా.. లవ్‌ యూ సోమచ్‌' అని రాసుకొచ్చింది.

చదవండి: పొద్దున ఆరు గంటలకే చికెన్‌ తిన్న ఎన్టీఆర్‌.. నాక్కూడా : రామ్‌ చరణ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement