Sowmya Rao
-
అమ్మకు బ్రెయిన్ క్యాన్సర్.. నన్ను కూడా గుర్తుపట్టలేదు: యాంకర్
నటిగా కెరీర్ మొదలుపెట్టిన సౌమ్య రావు జబర్దస్త్ షోతో యాంకర్‌గా మారింది. పైకి నవ్వుతూ, పంచులు విసురుతూ చలాకీగా కనిపించే ఆమె జీవితంలో మాత్రం ఎంతో విషాదం దాగి ఉంది. తల్లి క్యాన్సర్‌తో పోరాడి కన్నుమూయడం ఆమెను ఎంతగానో కుంగదీసింది. చివరి రోజుల్లో తల్లి అనుభవించిన నరకాన్ని చూసి తల్లడిల్లిపోయింది. తాజాగా ఓ షోలో హైపర్ ఆది.. సౌమ్య రావుకు ఆమె తల్లి జ్ఞాపకార్థం ఓ ఫోటో ఫ్రేమ్ ఇచ్చాడు. ఇది చూసి స్టేజీపైనే ఏడ్చేసింది సౌమ్య రావు. ఆమె మాట్లాడుతూ.. 'ఒకరోజు అమ్మకు బాగా తలనొప్పి వచ్చింది. ఆస్పత్రికి తీసుకెళ్తే బ్రెయిన్ క్యాన్సర్ అన్నారు. తను నెమ్మదిగా జ్ఞాపకశక్తిని కోల్పోతూ వచ్చింది. ఆఖరికి నన్ను కూడా మర్చిపోయింది. తనను మూడున్నరేళ్లపాటు బెడ్‌పైనే చూసుకున్నాను. ఆ దేవుడు అమ్మను ఇంతటి దారుణ స్థితిలో వదిలేస్తాడని అసలు ఊహించలేదు. అమ్మ మళ్లీ నా కడుపులో పుట్టాలని కోరుకుంటున్నాను' అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సౌమ్య. మొన్నామధ్య మాతృ దినోత్సవం సందర్భంగానూ తల్లిని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనైంది సౌమ్య. తల్లి కోసం భగవంతుడికి ఎన్నో పూజలు చేసినా, ఉపవాసాలు ఉన్నా ఆ దేవుడు కరుణించలేదని బాధపడింది. ఆ భగవంతుడు తనకే ఎందుకిలా చేశాడని ఆవేదన చెందింది. అందరూ అమ్మ ఫోటో షేర్ చేసి మదర్స్ డే శుభాకాంక్షలు చెప్తుంటే తనకు మాత్రం చివరి రోజుల్లో తల్లి పడ్డ బాధే కళ్ల ముందు మెదులుతోందని కన్నీళ్లు పెట్టుకుంది.. అమ్మ లేకుండా తన జీవితం అసంపూర్తిగా మిగిలిపోయిందని పేర్కొంది. ప్రతిరోజు, ప్రతిక్షణం తల్లిని మిస్ అవుతూనే ఉంటానని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. View this post on Instagram A post shared by Sowmya Rao (@sowmya.sharada) చదవండి: వెకేషన్‌కు మెగాస్టార్ దంపతులు -
నేను చేసిన పూజలు, ఉపవాసాలు వృథా.. జబర్దస్త్ యాంకర్ వీడియో వైరల్
-
ఆ దేవుడు నన్ను కరుణించలేదు: జబర్దస్త్ యాంకర్ ఎమోషనల్
సీరియల్స్‌తో నటిగా కెరీర్ ఆరంభించిన సౌమ్య రావు జబర్దస్త్‌తో యాంకర్‌గా మారింది. షోలో నవ్వుతూ, చలాకీగా ఉంటూ, కంటెస్టెంట్లపై పంచులు విసిరే ఆమె వ్యక్తిగతంగా మాత్రం ఎంతో బాధను అనుభవిస్తున్నట్లు తెలుస్తోంది. సౌమ్య తల్లి క్యాన్సర్‌తో పోరాడి కన్నుమూశారు. చివరి రోజుల్లో తన తల్లి ఎదుర్కొన్న నరకం గురించి వివరిస్తూ ఇటీవల ఓ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో సౌమ్య రావు ఆస్పత్రి బెడ్ మీద ఉన్న తల్లిని కంటికి రెప్పలా చూసుకుంటూ తనను నవ్వించేందుకు ప్రయత్నించింది. తన తల్లి అనుభవించిన నరకం ఏ తల్లికీ రాకూడదని ఎమోషనలైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'అంబులెన్స్, డాక్టర్స్.. ట్రీట్మెంట్.. మందులు.. ఎంతో బాధ అనుభవించావు. నీ కోసం ఆ భగవంతుడికి ఎన్నో పూజలు చేశాను. ఉపవాసాలు ఉన్నాను. అయినా ఆ దేవుడు కరుణించలేదు. ఆ భగవంతుడు నాకెందుకిలా చేశాడని బాధేస్తోంది. అందరూ అమ్మ ఫోటో షేర్ చేసి మదర్స్ డే శుభాకాంక్షలు చెప్తుంటే నాకు మాత్రం చివరి రోజుల్లో నువ్వు పడ్డ బాధే గుర్తొస్తోంది. దాన్ని మర్చిపోలేకపోతున్నాను. రేయిపగలు నీకు సేవ చేసినా, భగవంతుడికి పూజ చేసినా అన్నీ వృథా అయ్యాయి. నువ్వు లేకుండా నా జీవితం అసంపూర్తిగా మిగిలింది. ప్రతిరోజు, ప్రతిక్షణం నిన్ను మిస్ అవుతూనే ఉన్నాను. అమ్మా, నాకోసం మళ్లీ పుడతావని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నాను. దేవుడా.. మా అమ్మానాన్నలను మళ్లీ నాకివ్వు. నిన్ను చాలా మిస్ అవుతున్నా అమ్మా.. లవ్ యూ సోమచ్' అని రాసుకొచ్చింది. చదవండి: పొద్దున ఆరు గంటలకే చికెన్ తిన్న ఎన్టీఆర్.. నాక్కూడా : రామ్ చరణ్