చిక్కడపల్లి: ఓ టీవీ యాంకర్, ఆమె భర్తపై సిరియా దేశస్థుడు దాడి చేశాడు. సిగ్నల్ వద్ద బైక్‌ను పక్కకు తీయలేదని ఆగ్రహించిన ఆ విదేశీయుడు ఇద్దరినీ తీవ్రంగా కొట్టాడు. బాధితుల ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు రిమాండ్ చేశారు. మంగళవారం జరిగిన ఈ ఘటనపై చిక్కడపల్లి ఇన్‌స్పెక్టర్ ఎం.సుదర్శన్ తెలిపిన వివరాలివీ.. మంగళవారం ఉదయం 9.30 గంటలకు ఓ ఛానల్‌లో న్యూస్ రీడర్‌గా పనిచేస్తున్న శివజ్యోతి, ఆమె భర్త ముత్యం బైక్‌పై ఆర్టీసీ క్రాస్‌రోడ్డు నుంచి ఇందిరాపార్క్ మీదుగా తమ ఆఫీసుకు వెళ్తున్నారు.
ఈ సమయంలో అశోక్‌నగర్ సిగ్నల్ వద్ద సిగ్నల్ పడటంతో ఆగారు. వెనుకనే ఉన్న సిరియా దేశస్థుడు సాద్ అబ్దల్ మున్నమ్ అబ్‌ఫాయప్(25) యాంకర్ శివజ్యోతి ద్విచక్ర వాహనాన్ని పక్కకు జరపమన్నాడు. సిగ్నల్ పడింది కదా కొద్ది సెకన్లలో వెళ్లిపోవచ్చు కొద్దిగా వెయిట్ చేయమని కోరింది. దీంతో ఆగ్రహానికి గురైన సాద్ అబ్దల్ మున్నమ్ అబ్‌ఫాయప్ శివజ్యోతి చెంపపై కొట్టాడు. భర్త ముత్యం అడ్డుకోగా అతనిపై కూడా చెయ్యి చేసుకుని తీవ్రంగా గాయపరిచాడు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు అబ్దల్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
టీవీ యాంకర్‌పై సిరియా దేశస్థుడి దాడి
Published Tue, Mar 8 2016 8:37 PM | Last Updated on Sun, Sep 3 2017 7:16 PM
Advertisement
Advertisement