
తిరువనంతపురం : ప్రముఖ మలయాళ టీవీ యాంకర్, సెలబ్రిటీ చెఫ్ జాగీ జాన్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. కురవాన్ కోణంలోని తన నివాసంలో ఆమె శవమై కనిపించారు. సోమవారం జాగీ ఇంటికి వచ్చిన ఆమె స్నేహితులు ఈ విషయాన్ని పోలీసులు తెలిపారు. దీంతో ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. జాగీ మృతదేహాంపై ఎటువంటి గాయాలు లేవని తెలిపిన పోలీసులు.. అనమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నట్టు వెల్లడించారు.
‘జాగీ తన తల్లితో కలిసి నివాసం ఉంటున్నారు. జాగీ మృతిచెందిన సమయంలో ఆమె తల్లి ఇంట్లోనే ఉన్నారు. అయితే ఆమె తల్లి మానసిక పరిస్థితి బాగా లేకపోవడంతో.. జాగీ ఎలా మృతి చెందారనే అంశంపై సరైన సమాచారం రాబట్టలేకపోయామ’ని పోలీసులు తెలిపారు. కాగా, 38 ఏళ్ల జాగీ ఓ టీవీ చానల్‌లో వంటల పోగ్రామ్ నిర్వహిస్తున్నారు. బ్యూటీ షోలకు ఆమె జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఆమె గాయనిగా, మంచి వక్తగా గుర్తింపు పొందారు.
Comments
Please login to add a commentAdd a comment