
సాక్షి, హైదరాబాద్ : కొత్తసంవత్సరం వేకువజామునే మందుబాబులకు చుక్కలుచూపించారు ట్రాఫిక్ పోలీసులు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీలు చేపట్టిన పోలీసులు.. పెద్ద సంఖ్యలో కేసులు నమోదుచేశారు. బ్రీత్ అనలైజర్ టెస్టులో దొరికిపోయిన ప్రముఖుల్లో టీవీ యాంకర్ ప్రదీప్ కూడా ఉన్నారు.
ప్రదీప్‌కు జైలు తప్పదేమో!: నూతన సంవత్సరం సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు తనీఖీలు చేశారు. ఈ క్రమంలోనే బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 45 వద్ద ప్రదీప్ కారును పోలీసులు ఆపారు. బ్రీత్ అనలైజ్ చేయగా.. 178 పాయింట్లు నమోదయ్యాయి. సాధారణంగా 35 పాయింట్లు దాటితేనే వాహనదారుడికి శిక్ష, వాహనం సీజ్ లాంటి చర్యలుంటాయి. మోతాదు కంటే చాలా ఎక్కువ మద్యం సేవించి, వాహనం నడిపిన ప్రదీప్‌కు సవరించిన నిబంధనలను అనుసరించి భారీ శిక్షలు పడే అవకాశం ఉంది. అయితే పోలీసులు కేసును ఎలా నమోదుచేస్తారనేది తెలియాల్సిఉంది.
వేలకొద్దీ కేసులు : ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లారి వరకు స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ చేపట్టిన నగర పోలీసులు వేలకొద్దీ కేసులు నమోదు చేశారు. సుమారు 1200 వాహనాలను సీజ్ చేశారు. పట్టుబడిన మందుబాబులు అందరికీ మంగళవారం తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. తీవ్రత ఎక్కువగా ఉన్న కేసుల్లో చర్యలు కూడా అంతే తీవ్రంగా తీసుకునేందుకు యత్నిస్తున్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో చిక్కిన యాంకర్ ప్రదీప్
Comments
Please login to add a commentAdd a comment