
టీవీ యాంకర్ వర్ష... తన అందచందాలతో షోలో సందడి చేసే ఆమె అడపాదడపా సీరియళ్లలోనూ నటిస్తున్న విషయం తెలిసిందే! యాంకరింగ్, నటన రెండింటిలోనూ రాణిస్తున్న ఈ భామ ఫొటోషూట్‌లతో నిత్యం సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చేతికి రింగు ధరించిన ఫొటోను షేర్ చేసి ఫ్యాన్స్‌కు షాకిచ్చింది. జూలై 4వ తారీఖున ఓ ముఖ్యమైన విషయం చెప్పబోతున్నానని వెల్లడించింది. దీంతో ఆ ఉంగరం వెనుక ఏదో దాగి ఉందని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు.
అంతేకాదు.. చేతిలో మంగళసూత్రాన్ని పట్టుకున్న ఫొటోను కూడా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది వర్ష. దీనికి పెళ్లికొడుకు, పెళ్లి కూతురు ఎమోజీలను జత చేసింది. దీంతో వర్ష పెళ్లిపీటలెక్కబోతుందహో.. అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో చాటింపు వేసి మరీ చెప్తున్నారు. చేతికి ఉంగరం ఉంది కాబట్టి ఇప్పటికే నిశ్చితార్థం కూడా జరిగిపోయిందని ఖరారు చేస్తున్నారు. కానీ వర్ష మెడలో మూడు ముళ్లు పడితే ఇమ్మాన్యుయేల్ ఏమైపోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి నిజంగానే వర్ష పెళ్లి చేసుకోబోతుందా? లేదా? అనేది తెలియాలంటే జూలై 4 వరకు ఆగాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment