Engagement rumors
-
లావణ్య త్రిపాఠితో వరుణ్ నిశ్చితార్థం? నిహారిక ఏమందంటే?
ఇది సమ్మర్ సీజనా? లేక పెళ్లిళ్ల సీజనా? అనేట్లుగా ఓ రేంజ్లో వివాహాలు జరుగుతున్నాయి. మళ్లీ ముహూర్తాలు దొరకవనుకుంటున్నారో ఏమో కానీ మండుటెండలోనూ పెళ్లిపనులు చేసుకుంటూ లగ్గాలు చేసేసుకుంటున్నారు. అటు సెలబ్రిటీల పెళ్లిళ్ల గురించి కూడా ఈ మధ్య వార్తలు వినిపిస్తున్నాయి. జనవరిలో నిశ్చితార్థం చేసుకున్న శర్వానంద్ జూన్‌లో పెళ్లికి రెడీ అయ్యాడు. అటు మెగా హీరో వరుణ్ తేజ్ కూడా పెళ్లిపీటలెక్కబోతున్నాడంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఏడడుగులు వేయనున్నాడంటూ నెట్టింట ఓ వార్త వైరల్‌గా మారింది. తాజాగా డెడ్ పిక్సెట్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న నిహారికకు కూడా వీరిద్దరి పెళ్లి గురించి ఓ ప్రశ్న ఎదురైంది. లావణ్యతో వరుణ్ పెళ్లి అంటూ వార్తలు వస్తున్నాయి. అందులో నిజమెంత? అని ఓ విలేకరి ప్రశ్నించగా దీనిపై స్పందించేందుకు నిహారిక నిరాకరించింది. 'సారీ, ఇప్పుడు దాని గురించి మాట్లాడాలనుకోవడం లేదు. కేవలం డెడ్ పిక్సెల్స్ గురించే చర్చించానుకుంటున్నాను' అని చెప్పుకొచ్చింది. కాగా వరుణ్, లావణ్య.. మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో కలిసి నటించారు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ ఎప్పటినుంచో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇటీవల లావణ్య.. మోస్ట్ హ్యాండ్సమ్ ఎవరన్న ప్రశ్నకు వరుణ్ అని సమాధానమివ్వడంతో ఈ ప్రచారం మరింత జోరందుకుంది. ఈ క్రమంలో జూన్‌లో వీరి నిశ్చితార్థం జరగనుందంటూ వార్తలు ఊపందుకున్నాయి. మరి ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది. చదవండి: వెధవలకు అటెన్షన్ ఇస్తే రెచ్చిపోతారు: నిహారిక -
తాళిబొట్టుతో షాకిచ్చిన వర్ష: పెళ్లికి రెడీ అయిందా?
టీవీ యాంకర్ వర్ష... తన అందచందాలతో షోలో సందడి చేసే ఆమె అడపాదడపా సీరియళ్లలోనూ నటిస్తున్న విషయం తెలిసిందే! యాంకరింగ్, నటన రెండింటిలోనూ రాణిస్తున్న ఈ భామ ఫొటోషూట్లతో నిత్యం సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చేతికి రింగు ధరించిన ఫొటోను షేర్ చేసి ఫ్యాన్స్‌కు షాకిచ్చింది. జూలై 4వ తారీఖున ఓ ముఖ్యమైన విషయం చెప్పబోతున్నానని వెల్లడించింది. దీంతో ఆ ఉంగరం వెనుక ఏదో దాగి ఉందని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు. అంతేకాదు.. చేతిలో మంగళసూత్రాన్ని పట్టుకున్న ఫొటోను కూడా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది వర్ష. దీనికి పెళ్లికొడుకు, పెళ్లి కూతురు ఎమోజీలను జత చేసింది. దీంతో వర్ష పెళ్లిపీటలెక్కబోతుందహో.. అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో చాటింపు వేసి మరీ చెప్తున్నారు. చేతికి ఉంగరం ఉంది కాబట్టి ఇప్పటికే నిశ్చితార్థం కూడా జరిగిపోయిందని ఖరారు చేస్తున్నారు. కానీ వర్ష మెడలో మూడు ముళ్లు పడితే ఇమ్మాన్యుయేల్ ఏమైపోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి నిజంగానే వర్ష పెళ్లి చేసుకోబోతుందా? లేదా? అనేది తెలియాలంటే జూలై 4 వరకు ఆగాల్సిందే! చదవండి: విజయ్ బర్త్‌డే స్పెషల్ పోస్టర్ రిలీజ్ -
రానా, మిహీకా రోకా ఫంక్షన్ ...
-
నిశ్చితార్థంపై క్లారిటీ ఇచ్చిన రానా
రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్ ఈ ఇద్దరి పేర్లు ఇప్పుడు టీ-టౌన్లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. నిన్నటి దాకా రానా, మిహీకా ప్రేమ వ్యవహారం, ఇప్పుడేమో వీరి నిశ్చితార్థం జరిగిపోయిందన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. తాజాగా రామానాయుడు స్టూడియోలో మిహీకాతో దిగిన ఫోటోలను రానా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నిజంగానే భళ్లాలదేవుడు ఎంగేజ్మెంట్ చేసుకున్నాడా అని అభిమానులతోపాటు సినిమా ఇండస్ట్రీ సైతం ఆశ్చర్యానికి గురవుతోంది. దీంతో ప్రముఖుల నుంచి వీరిద్దరికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తాము ఇంకా నిశ్చితార్థం చేసుకోలేదని, కేవలం రోకా ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నట్లు రానా స్పష్టం చేశారు. (సంప్రదాయ దుస్తుల్లో రానా-మిహీక: వైరల్) అంతేగాక హీరో నానితో వాట్సాప్‌లో చాట్ చేసుకున్న సరదా సంభాషణను స్క్రీన్‌షాట్ తీసి రానా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇందులో అబ్బాయి ఎంగేజ్మెంట్ అయ్యిందా అని నాని అడగ్గా.. లేదు రోకా ఫంక్షన్ అని రానా బదులిచ్చారు. వెంటనే నాని రోకా ఫంక్షన్ అంటే తనకు తెలియదన్నట్టు గూగుల్‌లో సెర్చ్ చెస్తా అని ఫన్నీ కామెంట్ పెట్టారు. రోకా వేడుక అనేది వధూవరుల కుటుంబాలు ఒకరినొకరు కలుసుకొని నిశ్చితార్థం, పెళ్లి, రిసెప్షన్‌కు సంబంధించిన విషయాల గురించి చర్చించడం. దీనితోనే ఇంట్లో పెళ్లి పనులు ప్రారంభం అయినట్లు సంకేతం. దక్షిణాదిలో దీనిని పెద్దగా పట్టించకపోయినా ఉత్తరాదిలో ఎక్కువగా పాటిస్తారు.(ముహూర్తం ఎప్పుడు?) View this post on Instagram To the beginning of forever 💕 @ranadaggubati A post shared by miheeka (@miheeka) on May 20, 2020 at 11:28pm PDT ఇక రోకా ఫంక్షన్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలను మిహీకా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీనికి ‘జీవితానికి ఇది ప్రారంభం’ అంటూ హార్ట్ సింబల్‌ను జతచేశారు. ఈ పోస్ట్‌పై వెంకటేష్ పెద్ద కూతురు అశ్రితా దగ్గుబాటి, సోనమ్ కపూర్ భర్త ఆనంద్ అహుజా స్పందించారు. ‘నా ఆనందాన్ని ఆపులేకపోతున్నాను’. అని అశ్రితా కామెంట్ చేశారు. కాగా అశ్రితా, మిహీకా, సోనమ్ కపూర్ స్నేహితులు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాదే రానా ఇంట్లో పెళ్లి బాజాలు మొగనున్నాయి. View this post on Instagram My happy place! 🥰🥰 @ranadaggubati A post shared by miheeka (@miheeka) on May 21, 2020 at 12:03am PDT -
ఫ్రెండ్‌కు థ్యాంక్స్!
దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య తెగ వినిపిస్తున్న పేరు త్రిష. కారణం ఆమె సినిమాలు, ప్రదర్శన కాదు... మొన్నటి వరకు రానాతో ‘డేటింగ్’షిప్... ఇప్పుడు ఫ్రెండ్ వరుణ్ మానియన్‌తో ఎంగేజ్మెంట్ రూమర్స్. ఎంత అడిగినా... తమిద్దరి మధ్యా అలాంటిదేమీ లేదంటూ కొట్టి పారేస్తున్నారు త్రిష, వరుణ్. అయితే... ఇటీవలే తమిళంలో ‘రేడియన్స్ మీడియా గ్రూప్’ను కూడా స్టార్ట్ చేసిన వరుణ్ తీసిన చిత్రం ‘కావియా తలైవన్’పై ప్రశంసలు కురిపించేసింది త్రిష. టీమ్ అందరి ఎఫర్‌ట బాగుందంటూనే... అద్భుతమైన సినిమా తీసినందుకు వరుణ్‌కు థ్యాంక్స్ చెప్పింది. సినిమాతో తనకు ఎలాంటి రిలేషన్ లేకపోయినా... స్పెషల్‌గా వరుణ్‌కు థ్యాంక్స్ ఏమిటనేది ఇండస్ట్రీ తంబీల ప్రశ్న.