ఆమె ఒక టీవీ యాంకర్. లైవ్‌లో వార్తలు చదువుతోంది. అంతలో ఆమెకు ఒక షాకింగ్ న్యూస్ అందింది. తప్పనిసరి పరిస్థితుల్లో కన్నీళ్లు ఆపుకుంటూ దాన్ని చదవాల్సి వచ్చింది. ఆ రోజుతో.. ఇంకా మాట్లాడితే ఆ బులెటిన్‌తోనే ఆ టీవీ చానల్ మూతపడింది. 'చానల్ వన్' అనే ఆ టీవీ చానల్‌ను ఉన్నట్టుండి మూసేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించినట్లు గెలా అనే ఆ యాంకర్‌కు లైవ్‌లో ఉండగా సమాచారం అందింది. ''ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అందుతోంది, పార్లమెంటులో ఓ ప్రకటన చేశారు.. నిజానికి ఈరోజు రాత్రిదే మా చిట్టచివరి న్యూస్ బులెటిన్'' అని ఆమె ప్రేక్షకులకు చెప్పింది. గొంతు వణుకుతుండగా.. ''ఇదే మా చివరి ఎడిషన్. అందువల్ల ఇక ఈ కార్యక్రమంలో వచ్చే మిగిలిన విషయాలకు అర్థంలేదు" అని ఆమె వివరించింది. ఈ రోజుతో చాలామంది తమ ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారని, వాళ్లకు కొత్త ఉద్యోగాలు దొరకాలని ఆశిస్తున్నట్లు చెప్పింది. 55 సెకండ్ల నిడివి ఉన్న ఈ క్లిప్పింగ్‌ను చానల్ వన్ తమ అధికారిక ఫేస్‌బుక్ పేజీలో పబ్లిష్ చేసింది. దాన్ని ఇంతవరకు 3.45 లక్షల మంది చూశారు. 1950 సార్లు షేర్ అయ్యింది.
Published Thu, May 11 2017 4:12 PM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM
Advertisement
Advertisement
Advertisement