టీవీ వ్యాఖ్యాత సుమ పరిచయం అవసరం లేని పేరు. ప్రతిరోజు పలు టీవీ చానెల్లలో సందడి చేస్తూనే ఉంటుంది. ఆడియో ఫంక్షన్లు, ప్రత్యేక కార్యక్రమాలు చేస్తూ అందరినీ అలరిస్తుంది. అలాంటి సుమ ఈ రోజుల్లో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. అప్పుడప్పుడు లైవ్‌లోకి వచ్చి సోషల్ మీడియా అభిమానులను ఆనందిపచేస్తుంటారు. ఇక సంక్రాంతి పండుగ రోజు కూడా సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశారు. అంతే ఆ వీడియో కాస్తా వైరల్ అయింది.