
అనసూయకు సరికొత్త ప్రమోషన్!!
టీవీలో రియాల్టీ షో పుణ్యమాని మంచి పేరు కొట్టేసిన బుల్లితెర స్టార్ అనసూయ.. కొత్త ప్రమోషన్ కొట్టేసింది. వాస్తవానికి ఈ ప్రమోషన్ ఆమెకు ఎప్పుడో వచ్చేసినా.. తానే నిరాకరించింది. ఇప్పుడు ఇన్నాళ్లకు ఆ ప్రమోషన్ స్వీకరించేందుకు సిద్ధమైంది. అవును.. అనసూయ హీరోయిన్ అయ్యింది. జబర్దస్త్ షోతో జబర్దస్త్‌గా పేరుపొందిన అనసూయ న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టిన అనసూయకు హీరోయిన్‌గా నటించే అవకాశాలు వస్తున్నాయి. బుల్లితెర, ఆడియో ఫంక్షన్లలో ఎక్కడ చూసినా అనసూయ హవానే కనిపిస్తోంది. సినిమాల ఆడియో విడుదల కార్యక్రమాలు, విజయోత్సవాలు.. ఇలా పలు కార్యక్రమాల్లో ఆమె తెగ కనిపిస్తోంది.
ఇలాంటి అనసూయకు వెండితెరపై మెరిసే అవకాశం కొన్నాళ్ల క్రితమే వచ్చింది. కానీ ఆమె అనేక కారణాల వల్ల నటించడానికి ఒప్పుకోలేదు. అత్తారింటికి దారేది, రేసుగుర్రం చిత్రాల్లో ఆఫర్లు వచ్చినా మిస్ చేసుకుంది. పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడానికి కూడా వెనుకాడిన అనసూయ ఇప్పుడు ఎవరి సరసన చేస్తోందన్న విషయం అందరికీ ఆసక్తికరమే. అడవి శేష్ హీరోగా రవికాంత్ దర్శకత్వంలో రానున్న చిత్రానికి ఈ బ్యూటీ ఓకే చెప్పేసింది. స్ర్కిప్ట్ బాగా నచ్చడంతో అంగీకరించాల్సి వచ్చిందని ఆమె మీడియాకు తెలిపింది. ఈ చిత్రం ప్రముఖ నిర్మాణ సంస్థ పీవీపీ బ్యానర్‌లో తెరకెక్కుతున్నట్లు సమాచారం. కాకపోతే ఈ మధ్య కాస్త లావైన అనసూయ వర్కవుట్లు గట్రా చేసి ఏమైనా తగ్గుతుందో.. మరీ అలాగే బొద్దుగుమ్మలాగే నటిస్తుందో వేచి చూడాలి. ఈ సినిమా కోసం ఆమె భారీగానే రెమ్యునరేషన్ తీసుకుందని టాలీవుడ్ టాక్.