బాలీవుడ్‌లోనూ 'క్షణం' | Kshanam Bollywood Remake | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌లోనూ 'క్షణం'

Published Tue, Mar 1 2016 3:22 PM | Last Updated on Sun, Jul 14 2019 4:31 PM

బాలీవుడ్‌లోనూ 'క్షణం' - Sakshi

బాలీవుడ్‌లోనూ 'క్షణం'

అడవి శేష్ హీరోగా గత శుక్రవారం విడుదలై మంచి విజయం సాధించిన సినిమా క్షణం. పీవీపీ సంస్థ నిర్మించిన ఈ సినిమా ద్వారా రవికాంత్ పేరుపు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అదాశర్మ, అనసూయ భరద్వాజ్లు ఇతర లీడ్ రోల్స్లో నటించిన ఈ సినిమాను కేవలం కోటి రూపాయల బడ్జెట్తో తెరకెక్కించారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కూడా మంచి వసూళ్లను రాబడుతున్న క్షణం నిర్మాణ వ్యయానికి నాలుగు రెట్లకు పైగా వసూలు చేసే అవకాశం ఉందంటున్నారు.

ఇంతటి ఘన విజయం సాధించిన ఈ సినిమాను ఇప్పుడు బాలీవుడ్లో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఎంతో మంది దర్శక నిర్మాతలు ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా.. పీవీపీ సంస్థ మాత్రం తామే స్వయంగా బాలీవుడ్లో రీమేక్ చేయాలని భావిస్తుంది. మరోసారి రవికాంత్ దర్శకత్వంలో, అడవి శేష్ హీరోగా క్షణం సినిమాను బాలీవుడ్ రూపొందించే ఆలోచనలో ఉంది పీవీపీ సంస్థ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement