
ప్రముఖ యాంకర్, నటుడు సైరస్ సహుకర్ ఓ ఇంటివాడయ్యాడు. ప్రియురాలు వైశాలి మాలహరను పెళ్లాడాడు. శుక్రవారం నాడు (ఏప్రిల్ 15న) మహారాష్ట్రలోని అలీబాగ్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి ఇరు కుటుంబాలతో పాటు బంధుమిత్రులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా ఈ పెళ్లి వేడుకకు హాజరైన పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఫొటోలు షేర్ చేయగా అవి కాస్తా వైరల్‌గా మారాయి.
కాగా సైరస్ సహుకర్ బుల్లితెరమీద ప్రసారమయ్యే పలు టీవీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఎమ్‌టీవీ బాక్రా గాగ్, చిల్ అవుట్, స్పెల్లింగ్ బీ, ఇండియా గాట్ టాలెంట్ సహా తదితర కార్యక్రమాలకు హోస్టింగ్ చేశాడు. అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమైన మౌండ్ ద మల్హోత్రాస్ అనే వెబ్ సిరీస్‌లోనూ ముఖ్య పాత్రలో నటించాడు. అలాగే కౌన్ బనేగి షిఖర్‌వాతి, పాట్‌లక్ వంటి షోలలనూ పాల్గొన్నాడు. సినిమాల విషయానికి వస్తే అతడు ఢిల్లీ 6, ఐషా, రంగ్ దే బసంతి, ఖుబ్‌సూరత్ సహా పలు చిత్రాల్లో నటించాడు. ఆయన చివరిసారిగా అప్‌స్టార్ట్స్ మూవీలో కనిపించాడు.
చదవండి: బాలీవుడ్‌కు 'కేజీఎఫ్ 2' ఒక హారర్ మూవీ: రామ్ గోపాల్ వర్మ
Comments
Please login to add a commentAdd a comment