సుహైబ్ ఇలియాసి (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : భార్య హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ టీవీ యాంకర్, నిర్మాత సుహైబ్ ఇలియాసికి ఎట్టకేలకు ఊరట లభించింది. ట్రయల్ కోర్టు విధించిన యావజ్జీవ కారగార శిక్షను శుక్రవారం ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. సుహైబ్ భార్య అంజూ ఇలియాసి 2000లో శరీరంపై కత్తిపోట్లతో అనూమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. అదనపు కట్నం కోసం అంజూని వేధించి అతని భర్తే హత్య చేశాడని ఆమె కుటుంబ సభ్యులు స్థానిక కోర్టులో ఫిర్యాదు చేశారు. సుమారు 17ఏళ్లపాటు జరిగిన కేసు విచారణ.. 2017 డిసెంబర్‌లో సుహైబ్‌ను దోషిగా పేర్కొంటూ విచారణ కోర్టు అతనికి యావజ్జీవ కారాగార శిక్షను విధించింది.
ఈ తీర్పును గత మార్చిలో అతని ఢిల్లీ హైకోర్టులో సవాలు చేశారు. దీనిపై విచారణ చెప్పట్టిన జస్టిస్ మురళీధర్, వినోద్ గోయల్.. హత్య కేసులో సరైన సాక్ష్యాధారాలు రుజువు చేయలేకపోయారని, ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ.. అతన్ని నిర్దోషిగా విడుదల చేయాలని తీర్పును వెలువరించారు. కాగా క్రైమ్ యాంకర్‌గా సుహైబ్ పలు షోలు నిర్వహించిన పాపులర్ అయ్యారు. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై అతని తరుఫు న్యాయవాదుల హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment