wife murder case
-
భర్తకు జీవిత ఖైదు సరైందే
సాక్షి, హైదరాబాద్: భార్య హత్య కేసులో భర్తకు ట్రయల్ కోర్టు జీవిత ఖైదు విధించడం సరైందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ‘మృతిరాలితో అప్పీలెంట్ (భాస్కర్)కు వివాహం జరిగి నాలుగు నెలలే అయ్యింది. ఆమె మంటల్లో కాలిపోతున్నప్పుడు గదిలో నిందితుడు ఉన్నాడని సాకు‡్ష్యలు చెబుతున్నారు. ఆ మంటలను ఆర్పేందుకు అతను ఎలాంటి చర్యలు చేపట్టలేదు. భర్తకు వ్యతిరేకంగా మృతురాలు తప్పుడు వాంగ్మూలం ఇచ్చిందనడానికి ఎలాంటి కారణాలు లేవు. ట్రయల్ కోర్టు తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనిపించడం లేదు’ అని హైకోర్టు తీర్పునిచ్చింది. 2012లో జరిగిన హత్య కేసులో అప్పీలెంట్‌కు జీవిత ఖైదు సరైందేనని 2015లో తేల్చిచెప్పింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన పెద్దింటి భాస్కర్‌కు మృతురాలితో 2012, ఏప్రిల్ 25న వివాహం జరిగింది. వివాహం తర్వాత నెల పాటు దంపతులు భార్య తల్లిగారింట్లోనే ఉన్నారు. 2012, జూలై 15న రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రించారు. అయితే తనకు పీడకలలు వస్తున్నాయని, తల్లి వద్ద నిద్రిస్తానని భాస్కర్‌ను కోరింది. అందుకు నిరాకరించి దుర్భాషలాడుతూ ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. కాలిన గాయాలతో ఆమె చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆసుపత్రిలో మృతురాలు మేజిస్ట్రేట్‌కు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా భాస్కర్‌ను ట్రయల్ కోర్టు దోషిగా నిర్ధారించింది.బాధితురాలి మానసిక స్థితి బాగానే ఉంది... 2015, ఏప్రిల్ 17న రంగారెడ్డి జిల్లా కోర్టు తనకు యావజ్జీవ శిక్ష విధించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పెద్దింటి భాస్కర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.సురేందర్, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ జితేందర్‌రావు వీరమల్ల వాదనలు వినిపించారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మృతురాలి తల్లి కూడా నిందితుడికి వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వలేదని, పథకం ప్రకారం హత్య చేశాడని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం... బాధితురాలి నుంచి మేజిస్ట్రేట్ వాంగ్మూలం తీసుకునేముందు ఆమె మానసిక పరిస్థితి బాగానే ఉందని డాక్టరు ధ్రువీకరించారని పేర్కొంది. మరణ వాంగ్మూలం ఆధారంగా శిక్ష విధించవచ్చని సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులను ప్రస్తావిస్తూ అప్పీలును కొట్టివేసింది. -
భార్య హత్య కేసులో.. మాజీ ఎమ్మెల్యేకి యావజ్జీవ శిక్ష
భువనేశ్వర్: భార్య హత్య కేసులో మాజీ ఎమ్మెల్యేకు న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. స్థానిక ప్రత్యేక తృతీయ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ కమ్ ఎంపీ/ ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు మంగళవారం ఈ తీర్పు వెల్లడించింది. రాయగడ జిల్లా గుణుపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రామమూర్తి గొమాంగో ఈ కేసులో నిందితుడు. 11 మంది సాక్షుల వాంగ్మూలాలు, 15 పత్రాలను పరిశీలించిన మేరకు ఈనెల 24వ తేదీన కోర్టు అతడిని దోషిగా నిర్ధారించిన విషయం తెలిసిందే. ఇరవై ఏడు సంవత్సరాల క్రితం ఆయన భార్య శశిరేఖ అనుమానస్పద మృతి కేసులో దోషిగా ఆయనను నిర్ధారించారు. ఇదీ విషయం... అప్పట్లో స్థానిక ఖారవేళ నగర్ ఎమ్మెల్యే కాలనీలోని ప్రభుత్వ వసతి భవనం బాత్రూమ్లో ఎమ్మెల్యే భార్య సగం కాలిన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 1995 సంవత్సరం ఆగస్టు 29వ తేదీన ఈ విచారకర సంఘటన చోటు చేసుకుంది. అప్పటికి ఆమె 4 నెలల గర్భవతిగా గుర్తించారు. ఆత్మహత్యకు పాల్పడి మరణించినట్లు ప్రకటించడంతో తొలుత అసహజ మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆ తర్వాత హత్య కేసుగా ధ్రువీకరించారు. ఎమ్మెల్యే ఆమెని చంపేసినట్లు ఖారవేళ నగర్ ఠాణాలో ఫిర్యాదు దాఖలు చేయడంతో కేసు విచారణ మలుపు తిరిగింది. గొమాంగో తన భార్యను హత్య చేసి, ఆమె శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిందని చిత్రీకరించేందుకు ప్రయత్నం చేసినట్లు ప్రాసిక్యూషన్‌లో నిరూపించబడింది. శిక్ష వివరాలు నిందిత మాజీ ఎమ్మెల్యే రామమూర్తి గొమాంగో కోర్టులో హాజరైన తర్వాత న్యాయస్థానం శిక్ష వివరాలను ప్రకటించింది. సెక్షన్ 302 కింద యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఏడాది శిక్ష విధించింది. సాక్ష్యాధారాల గల్లంతు, రద్దు చేసిన నేరం రుజువు కావడంతో 201 సెక్షన్ కింద రూ.10 వేల జరిమానా, జరిమానా జమ చేయని పక్షంలో 6 నెలల శిక్షని ఎంపీ/ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు ప్రకటించింది. రామమూర్తి రాజకీయ నేపథ్యం 1995లో గుణుపురం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి జనతాదళ్ టికెట్‌పై ఎన్నికై న రామమూర్తి గొమాంగో 2000 సంవత్సరంలో బీజేపీలో చేరారు. 2000లో గుణుపూర్ నుంచి బీజేపీ టికెట్‌పై పోటీచేసి, 30 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో తిరిగి ఎన్నికయ్యారు. 2004 అసెంబ్లీ ఎన్నికలలో అతను తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి హేమా గొమాంగోపై 20,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. 2009లో బిజూ జనతా దళ్, భారతీయ జనతా పార్టీ కూటమి కుప్పకూలడంతో బీజేపీ నుంచి దూరం అయ్యారు. అయితే 2014 సంవత్సరం సార్వత్రిక ఎన్నికల్లో గుణుపురం అసెంబ్లీ స్థానానికి పోటీ చేసేందుకు బీజేడీ టిక్కెట్ నిరాకరించడంతో ఆయన తిరిగి బీజేపీలో చేరారు. -
భార్య హత్య కేసులో దోషిగా మాజీ ఎమ్మెల్యే
భువనేశ్వర్: భార్య హత్య కేసులో మాజీ ఎమ్మెల్యేని దోషిగా స్థానిక కోర్టు నిర్ధారించింది. వివరాల్లోకి వెళ్తే.. 27 ఏళ్ల క్రితం గుణుపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రామమూర్తి గొమాంగో భార్య అనుమానస్పద మృతి కేసు విచారణలో హత్యగా తేలింది. ఈ కేసు విచారణ జరిపిన స్థానిక కోర్టు మాజీ ఎమ్మెల్యేనే ఈ కేసులో దోషిగా ప్రకటించింది. 11 మంది సాక్షుల వాంగ్మూలాలు, 15 పత్రాల ఆధారంగా కోర్టు అతడిని దోషిగా నిర్ధారించింది. శిక్ష వివరాలను మంగళవారం ప్రకటిస్తామని సంబంధిత వర్గాలు తెలిపాయి. అతని భార్య సగం కాలిన మృతదేహాన్ని 1995 సంవత్సరంలో స్థానిక ఖారవేళ నగర్లో ఎమ్మెల్యే నివాసం నుండి స్వాధీనం చేసుకున్నారు. అప్పటికి ఆమె గర్భవతి అని గుర్తించారు. తొలుత అసహజ మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆ తర్వాత హత్య కేసుగా ధ్రువీకరించారు. గొమాంగో రాజకీయ ప్రస్థానం 1995లో గుణుపురం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి జనతాదళ్ టికెట్‌పై రామమూర్తి గొమాంగో ఎన్నికయ్యారు. అనంతరం 2000 సంవత్సరంలో బీజేపీలో చేరారు. 2000లో గుణుపూర్ నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేసి 30 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో మరలా ఎన్నికయ్యారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో అతను తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి హేమా గొమాంగోపై 20,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. 2009లో బిజూ జనతా దళ్, భారతీయ జనతా పార్టీ కూటమి విడిపోవడంతో బీజేపీ నుంచి దూరమయ్యారు. అయితే 2014 సంవత్సరం సార్వత్రిక ఎన్నికల్లో గుణుపురం అసెంబ్లీ స్థానానికి పోటీ చేసేందుకు బీజేడీ టిక్కెట్ నిరాకరించడంతో ఆయన తిరిగి మరలా బీజేపీలో చేరారు. -
భార్యా హంతకునికి జీవితఖైదు రద్దు: హైకోర్టు సంచలన తీర్పు
బనశంకరి: భార్యను హత్య చేసిన కేసులో భర్తకు కింది కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను హైకోర్టు రద్దు చేసింది. వివరాలు.. చిక్కమగళూరు జిల్లా మూడిగెరెలో 2016లో వినాయక చవితి రోజున భార్య రాధ వంట చేయకుండా మద్యం తాగి పడుకుంది. కోపోద్రిక్తుడైన భర్త సురేశ్ కట్టెతో దాడిచేయడంతో ఆమె మృతిచెందింది. 2017లో స్థానిక కోర్టు అతనికి యావజ్జీవిత ఖైదు శిక్ష విధించగా అప్పటి నుంచి జైల్లో ఉన్నాడు. అతడు ఈ తీర్పును హైకోర్టులో అప్పీల్ చేశాడు. హైకోర్టు ఏం చెప్పిందంటే మంగళవారం కేసును విచారించిన హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కే.సోమశేఖర్, టీజీ శివశంకరేగౌడల ధర్మాసనం.. అతడు చేసింది ఉద్దేశపూర్వక హత్యగా పరిగణించలేమని పేర్కొన్నారు. ఈ నేరాన్ని హత్యగా భావించలేమని, కాబట్టి హత్యానేరం సెక్షన్‌ను తొలగించాలని స్పష్టంచేశారు. ఇప్పటికే 6 ఏళ్లు జైలుశిక్ష అనుభవించడంతో, అతనిపై ఎలాంటి కేసులు లేకపోవడంతో తక్షణం జైలు నుంచి విడుద చేయాలని ఆదేశించారు. (చదవండి: ప్రేమిస్తే చంపేస్తారు!) -
భార్యను హత మార్చిన 'సాఫ్ట్వేర్' భర్త
-
కట్టుకున్నోడే కడతేర్చాడు
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): నిండు నూరేళ్లు తోడుగా ఉంటానని బాస చేసిన కట్టుకున్నోడే కాలయముడయ్యాడు. భార్యను రోకలిబండతో మోది హతమార్చిన ఘటన ఆదివారం యైటింక్లయిన్‌కాలనీలో జరిగింది. గోదావరిఖని టూటౌన్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలు. యైటింక్లయిన్‌కాలనీ రాజీవ్నగర్తండాలో నివసించే వృద్ధురాలు బానోతు దానమ్మ(65), ధర్మయ్య భార్యభర్తలు. ఆదివారం తెల్లవారుజామున ధర్మయ్య తన భార్య తలపై రోకలిబండతో మోది దారుణంగా హతమార్చాడు. మందమర్రి ఏరియాలో సింగరేణి ఉద్యోగం చేసి పదేళ్లక్రితం రిటైర్డ్ అయి తన అత్తగారి ఊరిలో ఇల్లు కొనుక్కుని భార్యతో కలిసి ఉంటున్నారు. అనారోగ్య సమస్యలతో తరచూ ఇబ్బందులు పడుతున్న ధర్మయ్యను భార్య సరిగా చూడడం లేదని మనసులో పెట్టుకున్నాడు. ఈక్రమంలో మంచంపైన నిద్రిస్తున్న దానమ్మ తలపై రోకలిబండతో మోది హత్య చేశాడు. భర్తకు చిన్న ఆపదొచ్చినా.. తరచూ అనారోగ్యంతో బాధపడే ధర్మయ్యకు చిన్న సమస్య తలెత్తిన భార్యే దగ్గరుండి ఆసుపత్రికి తీసుకెళ్లి బాగుచేయించుకుని తీసుకొచ్చేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. గతంలో రెండుసార్లు భర్త ప్రాణాలమీదకొస్తే దానమ్మ దగ్గరుండి వైద్యం చేయించిందని తెలిపారు. పెద్ద కూతురు రాజమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో గోదావరిఖని టూటౌన్ సీఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. -
భార్య హత్య కేసులో టీవీ యాంకర్ విడుదల
సాక్షి, న్యూఢిల్లీ : భార్య హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ టీవీ యాంకర్, నిర్మాత సుహైబ్ ఇలియాసికి ఎట్టకేలకు ఊరట లభించింది. ట్రయల్ కోర్టు విధించిన యావజ్జీవ కారగార శిక్షను శుక్రవారం ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. సుహైబ్ భార్య అంజూ ఇలియాసి 2000లో శరీరంపై కత్తిపోట్లతో అనూమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. అదనపు కట్నం కోసం అంజూని వేధించి అతని భర్తే హత్య చేశాడని ఆమె కుటుంబ సభ్యులు స్థానిక కోర్టులో ఫిర్యాదు చేశారు. సుమారు 17ఏళ్లపాటు జరిగిన కేసు విచారణ.. 2017 డిసెంబర్లో సుహైబ్‌ను దోషిగా పేర్కొంటూ విచారణ కోర్టు అతనికి యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. ఈ తీర్పును గత మార్చిలో అతని ఢిల్లీ హైకోర్టులో సవాలు చేశారు. దీనిపై విచారణ చెప్పట్టిన జస్టిస్ మురళీధర్, వినోద్ గోయల్.. హత్య కేసులో సరైన సాక్ష్యాధారాలు రుజువు చేయలేకపోయారని, ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ.. అతన్ని నిర్దోషిగా విడుదల చేయాలని తీర్పును వెలువరించారు. కాగా క్రైమ్ యాంకర్‌గా సుహైబ్ పలు షోలు నిర్వహించిన పాపులర్ అయ్యారు. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై అతని తరుఫు న్యాయవాదుల హర్షం వ్యక్తం చేశారు. -
గృహిణి హత్య కేసులో భర్త అరెస్టు
చోడవరం: చోడవరం మండలం కన్నంపాలెం గ్రామానికి చెందిన బైన సుజాత(35) హత్య కేసులో ఆమె భర్త బైన వెంకటఅప్పన్నదొరను పోలీసులు అరెస్టు చేసినట్టు చోడవరం సీఐ ఎం. శ్రీనివాసరరావు విలేకరులకు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. చోడవరం మండలం కన్నంపాలెం గ్రామానికి చెందిన బైన సుజాత(35) ఈనెల 15వతేదీ అర్ధరాత్రి హత్యకు గురైంది. సుజాతపై రెండేళ్లుగా అనుమానంతో ఉన్న భర్త వెంకటఅప్పన్నదొర మూడునెలలుగా పనికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉంటూ భార్యను వేధిస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 15వతేదీ అర్ధరాత్రి భార్య,భర్తల మధ్య వివాదం జరిగింది. ఆగ్రహంతో అక్కడే ఉన్న మంచం కోడుతో భార్య తలపై గట్టిగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు అప్పన్నదొర ఆ గ్రామ వీఆర్వో సుమలత ఎదుట సోమవారం లొంగిపోయాడు. ఆమె తమకు అప్పగించినట్టు సీఐ తెలిపారు. కోర్టుకు తరలించామని చెప్పారు. ఈ సమావేశంలో చోడవరం ఎస్ఐ మల్లేశ్వరరావు పాల్గొన్నారు. ఇదిలావుండగా సుజాత, అప్పన్నదొరకు 11యేళ్ల కిందట వివాహం జరిగింది. ఐదో తరగతి, ఒకటో తరగతి చదువుతున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇటు తల్లిని కోల్పోయి, అటు తండ్రి జైలుకి వెళ్లడంతో వారిద్దరూ అనాథలుగా మిగిలారు. -
భార్యను చంపిన భర్త అరెస్ట్
కోల్‌సిటీ(రామగుండం): ఈ నెల 24న గోదావరిఖనిలో సంచలనం సృష్టించిన వివాహిత హత్యకేసులో నిందితుడిని ఏసీపీ అపూర్వరావు సోమవారం అరెస్టు చూపారు. బిడ్డ తనకు పుట్టలేదనే అనుమానంతోనే గౌతమి(29)ని భర్త చైతన్యదీప్ గొడ్డలితో నరికి హతమార్చాడని వివరించారు. పెళ్లయినప్పటి నుంచి వేధింపులే.. గోదావరిఖని జవహార్‌నగర్‌కు చెందిన అటికేటి రాజేశ్వరి చిన్న కూతురు గౌతమి(29)కి జమ్మికుంట మండలం కోరపల్లికి చెందిన టుంగుటూరి చైతన్యదీప్తో 2015 మే 10న వివాహం జరిపించారు. రూ.6 లక్షల నగదు, తులం బంగారం కట్నంగాఇచ్చారు. చైతన్యదీప్ హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా చేస్తున్నాడు. కొంత కాలంగా గౌతమిని మరో రూ. 10 లక్షలు తీసుకురావాలని చైతన్యదీప్, అత్తమామ రాజకుమారి, రాయమల్లు, మరిది హర్షదీప్ వేధించేవారు. గర్భవతి అని చూడకుండా హింసించేవారు. బాధలు భరించలేక గౌతమి పుట్టింటికొచ్చింది. డీఎన్ఏ టెస్ట్ చేయించాలని.. కొడుకు పుట్టిన ఐదు నెలలకు గౌతమిని కాపురానికి తీసుకెళ్లాడు. బాబుకు నివాస్దీప్ అని పేరు పెట్టారు. బాబు తనకు పుట్టలేదంటూ డీఎన్ఏ పరీక్షలు చేయించాలని వేధించాడు. భయంతో మళ్లీ పుట్టింటికి చేరింది. భార్యపై గొడ్డలితో దాడి.. ఎలాగైనా గౌతమిని చంపాలని చైతన్యదీప్ గోదావరిఖని వచ్చాడు. శనివారం రాత్రి ఇంట్లో తన కొడుకుకు పాలిస్తున్న తరుణంలో ఇంట్లోకి గొడ్డలి తో చొరబడ్డాడు. పడుకున్న గౌతమి తలపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. దీంతో అక్కడిక్కడే మృతి చెందింది. గొడ్డలిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. మృతురాలి తల్లి ఫిర్యాదుతో వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం చైతన్యదీప్ను స్థానిక బస్టాండ్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. గొడ్డలిని, రక్తం అంటిన దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. చైతన్యదీప్ తల్లి రాజకుమారి, తండ్రి రాయమల్లు, సోదరుడు హర్షదీప్ పరారీలో ఉన్నారు. ఈ సమావేశంలో సీఐ మహేందర్, సిబ్బంది ఉన్నారు. -
వివాహిత హత్య కేసులో భర్త అరెస్ట్
ముదిగుబ్బ: కదిరి యర్రదొడ్డి గంగమ్మ సమీపంలో మోరి వద్ద జరిగిన వివాహిత హత్య కేసులో ఆమె భర్త పి.గంగిరెడ్డిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. మంగళవారం పట్నం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కదిరి మండలం వై. కొత్తపల్లికి చెందిన గంగిరెడ్డి తన భార్య పి.సరస్వతి మరొక వ్యక్తితో సంబంధం వుందని అనుమానించాడు. ఎలాగైనా భార్యను చంపాలని అనుకున్నాడు. ఈ క్రమంలో భార్యకు మాయ మాటలు చెప్పి యర్రదొడ్డి గంగమ్మ సమీపంలో వున్న మోరి వద్దకు తీసుకొచ్చాడు. అక్కడ రాళ్లతో తలపై గుద్ది చీర కొంగుతో గొంతు బిగించి హత్య చేశాడు. అతడిని పట్టుకోవడంలో కదిరిలో ఏర్పాటు చేసిన సీసీ కెమేరాల ఫుటేజిలు సహకరించాయన్నారు. కేసును చేదించడంలో కీలకంగా వ్యవహరించిన ఎస్ఐ రాఘవయ్య, సిబ్బంది నారాయణస్వామి, నాగరాజును ఈ సందర్భంగా డీఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాసులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
హత్య కేసు నిందితుడితో వేదికపై యోగి
గోరఖ్‌పూర్: భార్య సారాసింగ్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఓ ఎమ్మెల్యేతో వేదిక పంచుకోవడంతోపాటు అతడిని ఆశీర్వదించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇబ్బందుల్లో పడ్డారు. మహరాజ్‌గంజ్ జిల్లాలోని నౌతన్వా నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన అమన్మణి త్రిపాఠి(35) శనివారం జరిగిన ఓ సమావేశంలో యోగికి కొన్ని సీట్ల దూరంలోనే కూర్చున్నారు. కార్యక్రమం మధ్యలో యోగికి నమస్కరించడంతోపాటు పాదాభివందనం చేసిన త్రిపాఠి కొన్ని కాగితాలను సీఎంకు అందించారు. దీంతో సభకు హాజరైన బీజేపీ శ్రేణులు విస్తుపోయాయి. భార్య సారాను కట్నం కోసం వేధించడంతోపాటు చంపేసి కారు ప్రమాదంలో చనిపోయినట్లు నకిలీ సాక్ష్యాలు సృష్టించినందుకు సీబీఐ ఇంతకు ముందు త్రిపాఠిపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఆయన ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఈ ఘటనపై గోరఖ్‌పూర్ యూనిట్ ప్రతినిధి సత్యేంద్ర సిన్హా మాట్లాడుతూ, ప్రజా ప్రతినిధులెవరైనా సీఎంకు పాదాభివందనం చేయవచ్చని, ఇందులో తప్పేమీ లేదని సమర్ధించుకున్నారు. త్రిపాఠి తండ్రి అమర్మణి త్రిపాఠి నౌతన్వాలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, ములాయం హయాంలో మంత్రిగా పనిచేశారు. అమర్మణితోపాటు ఆయన భార్య ప్రస్తుతం మధుమితా శుక్లా హత్య కేసులో జీవితఖైదు అనుభవిస్తున్నారు. -
భార్య హత్య కేసులో భర్త అరెస్టు
బుక్కపట్నం (పుట్టపర్తి) : భార్య హత్య కేసులో నిందితుడైన భర్తను బుక్కపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ వెంకటేష్ తెలిపిన మేరకు.. బుక్కపట్నం ఈడిగ వీధికి చెందిన పెనిమేటి నారాయణస్వామి 20 ఏళ్ల కిందట అనుమానంతో భార్య సుగుణమ్మను హత్య చేశాడు. నిందితుడు అప్పటి నుంచి పరారీలో ఉండటంతో వారెంట్ జారీ అయ్యింది. అందిన సమాచారం మేరకు నారాయణస్వామిని పోలీసులు అరెస్టు చేసి బుధవారం కోర్టులో హాజరు పరిచారు. నిందితుడిని పట్టుకోవటంలో ఏఎస్ఐ గోవిందు చూపిన కృషిని ధర్మవరం డీఎస్పీ వేణుగోపాల్, కొత్తచెరువు సీఐ శ్రీధర్ అభినందించారని ఎస్ఐ తెలిపారు. -
భార్యా హంతకునికి యావజ్జీవం
అనంతపురం లీగల్ : అనుమానంతో భార్యపై కిరోసిన్ పోసి హత్యచేసిన భర్త హాజీవలికి అనంతపురం మూడవ అదనపు జిల్లా సెషన్స్ (ఫాస్ట్‌ట్రాక్) కోర్టు బుధవారం యావజ్జీవ శిక్ష విధించింది. ప్రాసిక్యూషన్ కథనం మేరకు... నగరంలోని స్టాలిన్‌నగర్‌కు చెందిన లారీడ్రైవర్ హజీవలి, అతని భార్య సయ్యద్ మసూద్ బీలకు విభేదాలున్నాయి. బేల్దారి పనికి వెళ్లే భార్యను ప్రతి విషయంలోనూ అనుమానిస్తూ హాజీవలి గొడవ పడేవాడు. 2015 జూలై 7న సాయంత్రం భర్త పిలుస్తున్నాడని చెప్పటంతో ఇంటికి హడావుడిగా వెళ్లింది. ఆమె వచ్చీరాగానే దాడిచేసి, ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించి పారిపోయాడు. చుట్టుపక్కలవారు గమనించి ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. అయినా పరిస్థితి విషమించి మసూద్బీ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేశారు. మూడవ అదనపు జిల్లా సెషన్స్ (ఫాస్ట్‌ట్రాక్) కోర్టు పదిమంది సాక్ష్యులను విచారించింది. ప్రాసిక్యూషన్ తరఫున బి.నాగలింగం హాజరయ్యారు. సాక్ష్యాధారాలు, వాదోపవాదనల అనంతరం హాజీవలిపై నేరాపోపణలు రుజువు కావడంతో న్యాయమూర్తి బి.సునీత యావజ్జీవ కఠిన కారాగారశిక్ష , పదివేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పుచెప్పారు. -
భార్య హత్యకేసులో అరెస్టు
తాడిపత్రి : పట్టణంలోని శాస్త్రినగర్‌లో నివాసం ఉంటున్న చాందిని అనే వివాహిత హత్య కేసులో ఆమె భర్త షాషావలిని మంగళవారం అరెస్ట్ చేసినట్లు పట్టణ సీఐ రామకృష్ణారెడ్డి తెలిపారు. 2015 మార్చి 18వ తేదీన భార్యకు నిప్పటించిన కేసులో షాషావలి పరారీలో ఉన్నాడు. అప్పట్లో› కేసునమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఎట్టకేలకు మంగళవారం అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. -
టీచర్ జనార్దన్‌పై ఉదాసీనత..!
అనంతపురం న్యూసిటీ : నగరపాలక సంస్థ పరిధిలోని ఎన్టీఆర్ స్కూల్లో ఎస్జీటీగా ఉన్న జనార్ధన్‌పై నగరపాలక సంస్థ అధికారులు ఉదాసీనత ప్రదర్శించడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. కొన్ని రోజుల క్రితం భార్యను మతి కేసులో జనార్ధన్‌ను రిమాండ్‌కు పంపిన విషయం విధితమే. అతనిపై క్రైమ్ నెంబర్ 156/16 నమోదైంది. కానీ ఇంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఉపాధ్యాయ సంఘాలు సైతం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. క్రైం నంబర్ వచ్చాక కూడా అతన్ని సస్పెండ్ చేయకుండా అధికారులు జాప్యం చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన కొందరి నేతల జోక్యంతోనే సస్పెన్షన్ చేయకుండా కాలయాపన చేస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.ఈ విషయమై డిప్యూటీ కమిషనర్ జ్యోతిలక్ష్మిని వివరణ కోరగా కేసు వివరాలు, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని త్రీ టౌన్ పోలీసులను కోరామన్నారు. అవి అందగానే చర్యలు తీసుకుంటామన్నారు. -
భార్య హంతకుడికి అసెంబ్లీ టికెటా: సీఎం
సమాజ్‌వాదీ పార్టీలో మళ్లీ ముసలం మొదలైనట్లే కనిపిస్తోంది. బాబాయ్ - అబ్బాయి మధ్య పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ రాజీ చేసినా.. గొడవలు మాత్రం ఏమాత్రం తగ్గినట్లు లేవు. భార్యను చంపిన కేసులో హత్యారోపణలు ఎదుర్కొంటున్న అమన్మణి త్రిపాఠీ అనే వ్యక్తికి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శివపాల్ యాదవ్ ప్రకటించిన కొద్దిసేపటికే.. అసలు అతడికి టికెట్ ఇచ్చినట్లే తనకుతెలియదని సీఎం అఖిలేష్ యాదవ్ స్పందించారు. త్రిపాఠీ తల్లిదండ్రులు మాజీ మంత్రి అమర్మణి, ఆయన భార్య మధుమణి త్రిపాఠీ కూడా హత్యకేసులలో దోషులే. అలాంటి వ్యక్తికి మహరాజ్‌గంజ్ జిల్లా నౌతన్వా నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు టికెట్ ఇచ్చారు. త్రిపాఠీ భార్య రోడ్డు ప్రమాదంలో మరణించారు. అయితే, ఆయనే ఆమెను చంపేసి ఉంటాడని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఆరోపించడంతో దీనిపై సీబీఐ విచారణకు ఇంతకుముందు సీఎం అఖిలేష్ యాదవ్ ఆదేశించారు. ఇలాంటి కేసులో ఉన్న త్రిపాఠీకి పార్టీ టికెట్ ఇవ్వడంపై నిజాయితీగా సమాధానం ఇవ్వాలని మీడియా గట్టిగా అడిగింది. దానికి సీఎం స్పందిస్తూ.. ''ఇది పార్టీ అంతర్గత వ్యవహారం. నా అభిప్రాయం ఏంటో మీకు ఇంతకుముందే తెలుసు. నేను కొన్ని అలవాట్లు మార్చలేను. నాకు ఈ విషయం గురించి తెలియదు. నేను ఏదో కార్యక్రమ ప్రారంభంలో ఉన్నాను'' అని ఆయన సమాధానం చెప్పారు. సమాజ్‌వాదీ పార్టీ నుంచి నేర చరితులను పూర్తిగా తరిమేసి.. పార్టీకి 'క్లీన్' ఇమేజి తేవాలన్నదే తన ఉద్దేశమని అఖిలేష్ పలు సందర్భాల్లో చెప్పారు. మాఫియా నాయకుడిగా ఉండి, రాజకీయాల్లో్కి వచ్చిన ముఖ్తార్ అన్సారీ స్థాపించిన ఖ్వామీ ఏక్తా దళ్‌ను సమాజ్‌వాదీలో విలీనం చేయాలని శివపాల్ యాదవ్ సహా పలువురు ప్రతిపాదించినప్పుడు అఖిలేష్ తీవ్రస్థాయిలో దాన్ని వ్యతిరేకించారు. దాంతో ఆ నిర్ణయం వెనక్కి వెళ్లింది. -
భార్యను హత్య చేసిన భర్తకు జీవితఖైదు
గుత్తి : భార్యను హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదు వి«ధిస్తూ గుత్తి ఏడీజే వెంకటరమణారెడ్డి బుధవారం సంచలన తీర్పు చెప్పారు. కేసు పూర్వపరాలు ఇలా ఉన్నాయి. గుంతకల్లు పట్టణంలోని భాగ్యనగర్‌కు చెందిన సంతోష్‌కుమార్, బాను ప్రేమించుకొని 2008, డిసెంబర్ 31న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో బాను తల్లిదండ్రులు కొంత డబ్బు, బంగారు కట్నంగా ఇచ్చారు. వీరికి ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల సంతానం. కొంతకాలంగా అదనపు కట్నం కోసం భార్యను వేధించసాగాడు. 2015, మే, 11న ఇంట్లో భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. కోపోద్రేకంతో సంతోష్‌కుమార్ భార్య గొంతుకోసి హత్య చేశాడు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వరకట్న వేధింపులు, హత్యానేరం కింద నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు బుధవారం తుది విచారణ జరిగింది. హత్యానేరం రుజువు కావడంతో ముద్దాయికి జీవితఖైదుతోపాటు, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ జడ్జి వెంకటరమణారెడ్డి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరుపున ఎంవీ మహేష్‌కుమార్ వాదించారు. -
బెజవాడలో లాకప్ డెత్?
- భార్య హత్యకేసులో భర్తను విచారణకు తీసుకొచ్చిన పోలీసులు - అపస్మారకస్థితిలో రైల్వేస్టేషన్ వద్ద కనిపించిన వైనం - హడావుడిగా పోస్టుమార్టం, అంత్యక్రియలు - అటువంటిదేమీ లేదంటున్న పోలీసులు విజయవాడ సిటీ: భార్య హత్య కేసులో నిందితుడి నుంచి నిజాలు రాబట్టడానికి పోలీసులు ఇచ్చిన ట్రీట్మెంట్ వికటించింది. నిందితుడు ప్రాణాపాయ స్థితికి చేరటంతో పోలీసులు ఈ వ్యవహారం తమ మెడకు చుట్టుకుంటుందని భావించారో ఏమో.. అతడిని రైల్వేస్టేషన్ సమీపంలో పడేశారు. అతడిని గుర్తించిన స్థానికులు 108 అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేసినా అతడి ప్రాణాలు నిలవలేదు. సంచలనం కలిగించిన ఈ సంఘటన విజయవాడలో శనివారం అర్ధరాత్రి తరువాత జరిగింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మధురానగర్ పసుపుతోట ప్రాంతానికి చెందిన కోలవెన్ను విజయకుమార్ ఐదేళ్ల కిందట భార్యాపిల్లలతో కలిసి హైదరాబాద్‌కు మకాం మార్చాడు. తరువాత రాజమండ్రి వెళ్లి కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడే బ్యూటీ పార్లర్ నిర్వహించే రమణకుమారితో ఏర్పడిన పరిచయం సహజీవనానికి దారితీసింది. ఆమె కుటుంబ సభ్యుల ఒత్తిడితో రమణకుమారిని పెళ్లి చేసుకోగా, ఈ విషయం తెలిసి మొదటి భార్య పద్మావతి పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో ఈనెల 3న రమణకుమారిని తీసుకుని విజయవాడ వచ్చిన విజయకుమార్ తరువాత ఆమెను హైదరాబాద్ తీసుకెళ్లి హత్యచేశాడు. రమణకుమారి కనిపించడం లేదని ఇటీవల ఆమె కుటుంబసభ్యులు విజయవాడ సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఆమె హత్య వెలుగు చూడటంతో హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో విచారణ కోసం పోలీసులు విజయకుమార్‌ను తీసుకొచ్చారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత రైల్వేస్టేషన్ పార్శిల్ కార్యాలయం సమీపంలో అపస్మారక స్థితిలో ఉన్న విజయకుమార్‌ను గమనించిన స్థానికులు సమాచారం ఇవ్వడంతో 108 సిబ్బంది అతడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. విషయం తెలిసిన సత్యనారాయణపురం ఎస్ఐ నరేష్ ఆదివారం ఉదయం ఏడుగంటల సమయంలో ప్రభుత్వాస్పత్రికి వెళ్లి హడావుడిగా పోస్టుమార్టం చేయించారు. సాధారణ రోజుల్లో ఉదయం 10 గంటలలోపు రాని వైద్యులు పోలీసుల కోరిక మేరకు ఏడుగంటలకే వచ్చి పోస్టుమార్టం చేశారు. తరువాత మృతదేహాన్ని పటమటలోని మృతుడి సోదరుడు భద్రాచలానికి అప్పగించగా 10 గంటల కల్లా దహన సంస్కారాలు పూర్తిచేశారు. ఈ విషయం మీడియాకు తెలియడంతో పోలీసులు కప్పిపెట్టే ప్రయత్నాలు ప్రారంభించారు. శాంతిభద్రతల విభాగం డీసీపీ ఎల్.కాళిదాస్‌ను దీనిపై వివరణ కోరగా.. తొలుత అలాంటి విషయం తన దృష్టికి రాలేదని చెప్పారు. ఆ తర్వాత ఓ వ్యక్తిది అనుమానాస్పద మృతి అని పేర్కొన్నారు. కుటుంబసభ్యులు విషయం మాట్లాడేందుకు నిరాకరించగా, భద్రాచలం ఫోన్‌కు అందుబాటులోకి రాలేదు. పోలీసులు అసలేం జరగలేదని చెబుతున్నారు.