గుత్తి : భార్యను హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదు వి«ధిస్తూ గుత్తి ఏడీజే వెంకటరమణారెడ్డి బుధవారం సంచలన తీర్పు చెప్పారు. కేసు పూర్వపరాలు ఇలా ఉన్నాయి. గుంతకల్లు పట్టణంలోని భాగ్యనగర్‌కు చెందిన సంతోష్‌కుమార్, బాను ప్రేమించుకొని 2008, డిసెంబర్ 31న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో బాను తల్లిదండ్రులు కొంత డబ్బు, బంగారు కట్నంగా ఇచ్చారు. వీరికి ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల సంతానం. కొంతకాలంగా అదనపు కట్నం కోసం భార్యను వేధించసాగాడు.
2015, మే, 11న ఇంట్లో భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. కోపోద్రేకంతో సంతోష్‌కుమార్ భార్య గొంతుకోసి హత్య చేశాడు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వరకట్న వేధింపులు, హత్యానేరం కింద నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు బుధవారం తుది విచారణ జరిగింది. హత్యానేరం రుజువు కావడంతో ముద్దాయికి జీవితఖైదుతోపాటు, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ జడ్జి వెంకటరమణారెడ్డి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరుపున ఎంవీ మహేష్‌కుమార్ వాదించారు.
భార్యను హత్య చేసిన భర్తకు జీవితఖైదు
Published Thu, Sep 29 2016 12:03 AM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM
Advertisement
Advertisement