life time prison
-
పైత్యం నశాలానికి.. పసిబిడ్డకు తిండి కరువు.. 18 నెలల వయసులోనే..
వాషింగ్టన్: కన్నబిడ్డను కంటికిరెప్పలా కాపాడుకుంటుంది తల్లి. పిల్లాడు ఎప్పుడైనా ఆకలితో ఏడిస్తే తల్లడిల్లిపోతుంది. కానీ అమెరికాలో ఓ మహిళ చేసిన పని కన్నపేగు బంధానికే కలంకం తెచ్చింది. పసివాడికి సరిగ్గా తిండిపెట్టకుండా ఆకలితో అలమటించేలా చేసింది. ఫలితంగా అతని మరణానికి కారణమైంది. ఈ ఘటనపై పోలీసులు షీలా ఓ లీరి(38)పై హత్య కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం న్యాయస్థానం ఆమెను దోషిగా తేల్చింది. శిక్ష ఖరారు మాత్రం నాలుగుసార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు వర్జీనియా కోర్టు ఆమెకు సోమవారం జీవిత ఖైదు విధించింది. ఈ ఆరోపణలతోనే ఈమె భర్త కూడా ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం షీలా కుటుంబసభ్యులంతా శాకాహారులు. కూరగాయలు, పండ్లు మాత్రమే తింటారు. పిల్లలకు తిండి సరిగ్గా పెట్టకపోవడం వల్ల పోషకాహారలోపం బాధితులయ్యారు. ఈ క్రమంలోనే 18 నెలల వీరి కుమారుడు చనిపోయాడు. అతడి బరువు 8 కేజీలు మాత్రమే. అతడికి తల్లిపాలే ఆహారంగా ఇచ్చేదట షీల. చనిపోయిన బాబు 18నెలల వయసులో కూడా 7 నెలల చిన్నారి పరిమాణంలో ఉన్నాడని అధికారులు పేర్కొన్నారు. వీరికి ముడేళ్లు, ఐదేళ్ల వయసున్న మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు కూడా పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. చదవండి: సోవియట్ యూనియన్ చివరి అధ్యక్షుడు కన్నుమూత -
బిడ్డను బావిలో తోసి హత్య.. తల్లికి యావజ్జీవం
తిరువొత్తియూరు: సేలం సమీపంలో వివాహేతర సంబంధం కోసం కుమారుడిని హత్య చేసి అదృశ్యం అయ్యాడని నాటకమాడిన మహిళకు గురువారం సేలం మహిళా కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. సేలం సమీపంలోని అటయాపట్టి ఎస్.పాపరాంపట్టికి చెందిన మణికంఠన్ భార్య మైనావతి (26). వీరి కుమారులు శశికుమార్ (07), అఖిల్ (03). రెండవ కుమారుడు అఖిల్‌ను మైనావతి తన తల్లి ఇంటిలో విడిచిపెట్టింది. ఈ క్రమంలో గత 2018వ సంవత్సరం మార్చి 5వ తేదీ ఆడుకోవడానికి వెళ్లిన శశికుమార్ కనపడలేదని మైనావతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆటయాంపట్టి సమీపంలో వున్న వ్యవసాయ బావిలో శశికుమార్ మృతి చెంది నీటిలో తేలుతూ వున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టి బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దీనిపై విచారణ చేయగా మైనావతి వివాహేతర సంబంధం కోసం తన తనయుడిని బావిలోకి తోసి హత్య చేసి నాటకమాడినట్లు తెలిసింది. మైనావతికి తన భర్త స్నేహితుడు అయిన దేవరాజ్ (25)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీనికి అడ్డుగా ఉన్న కుమారుడిని హత్య చేసి అతనితో వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకున్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి మైనావతిని, దేవరాజ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసు విచారణ గురువారం సేలం మహిళా కోర్టులో విచారణకు వచ్చింది. విచారణ అనంతరం కుమారుడిని హత్య చేసిన మైనావతికి సేలం మహిళా కోర్టు యావజ్జీవ శిక్ష విధించి అలాగే దేవరాజుకు ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో అతనిని నిర్ధోషిగా విడుదల చేసింది. చదవండి: వివాహితతో మరో మహిళ శృంగారం.. భర్తకు నష్ట పరిహారం -
9 హత్యల కేసు; కోర్టుకు నిందితుడు
వరంగల్ లీగల్ : వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో తొమ్మిది మందిని సజీవంగా బావిలో వేసి హత్య చేసిన కేసులో నిందితుడు సంజయ్‌కుమార్‌యాదవ్‌ను ఆరు రోజుల పోలీసు కస్టడీ ముగిసింది. ఈ మేరకు గీసుకొండ పోలీసులు గురువారం ఆయనను వరంగల్‌లోని కోర్టులో హాజరుపర్చగా కోర్టు అదేశాలతో వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. తొమ్మిది హత్యల కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వరంగల్ కమిషనరేట్ పోలీసులు అతి తక్కువ సమయంలో నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. (9 హత్యల కేసు: వాటిని అమ్మిందెవరు?) 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్‌కు కోర్టు ఆదేశించిన నేపథ్యంలో కేసు పూర్వాపరాలు, నిందితుని నుండి అదనపు సమాచారం కోసం ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కస్టడీలో భాగంగా ఆరు రోజుల పాటు సీన్ రీకన్‌స్ట్రక్టషన్ తరహాలో ఘటనా స్థలం, నిందితుడు అద్దెకు ఉన్న ఇళ్లు తదితర ప్రాంతాల్లో పరిశోధన జరిపిన పోలీసులు సంజయ్‌ను గురువారం కోర్టులో హాజరుపరిచారు. కాగా, నిందితుడిపై నమోదైన కేసులో పొందుపర్చిన వివిధ సెక్షన్ల క్రింద నేరం రుజువైతే రెండేళ్ల కఠిన కారాగారశిక్ష మొదలు యావజ్జీవ కారాగార శిక్ష.. చివరకు ఉరిశిక్ష సైతం పడే అవకాశం ఉందని సీనియర్ న్యాయవాదులు వ్యాఖ్యానిస్తున్నారు. నిందితుడి వయస్సు తక్కువే అయినందున శిక్షా కాలంలో ప్రవర్తన మార్పు తదితర అంశాలు పరిగణలోకి తీసుకున్నప్పటికీ యావజ్జీవ కారాగార శిక్ష తప్పకుండా పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. (సంజయ్‌కుమార్‌పై సీన్ రీ కన్స్ట్రక్షన్) -
భార్యను హత్య చేసిన భర్తకు జీవితఖైదు
గుత్తి : భార్యను హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదు వి«ధిస్తూ గుత్తి ఏడీజే వెంకటరమణారెడ్డి బుధవారం సంచలన తీర్పు చెప్పారు. కేసు పూర్వపరాలు ఇలా ఉన్నాయి. గుంతకల్లు పట్టణంలోని భాగ్యనగర్‌కు చెందిన సంతోష్‌కుమార్, బాను ప్రేమించుకొని 2008, డిసెంబర్ 31న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో బాను తల్లిదండ్రులు కొంత డబ్బు, బంగారు కట్నంగా ఇచ్చారు. వీరికి ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల సంతానం. కొంతకాలంగా అదనపు కట్నం కోసం భార్యను వేధించసాగాడు. 2015, మే, 11న ఇంట్లో భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. కోపోద్రేకంతో సంతోష్‌కుమార్ భార్య గొంతుకోసి హత్య చేశాడు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వరకట్న వేధింపులు, హత్యానేరం కింద నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు బుధవారం తుది విచారణ జరిగింది. హత్యానేరం రుజువు కావడంతో ముద్దాయికి జీవితఖైదుతోపాటు, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ జడ్జి వెంకటరమణారెడ్డి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరుపున ఎంవీ మహేష్‌కుమార్ వాదించారు. -
హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు
ఇచ్ఛాపురం రూరల్: ఎనిమిదేళ్ల క్రితం తల్లీకొడుకులను హత్య చేసిన ఘటనలో ఇచ్ఛాపురానికి చెందిన ఇద్దరు నిందితులకు మంగళవారం సోంపేట ఆరవ అదనపు జిల్లా సెషన్స్ కోర్ట్ జీవితకాల కారాగార శిక్ష విధించినట్లు రూరల్ ఎస్ఐ ఎం.చిన్నంనాయుడు తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గొల్లవీధికి చెందిన డి.బలరాంరెడ్డి, సి.హెచ్.గోపి 2008 ఆగస్టు 8 రాత్రి కేశవ జ్యూయలర్ యజమాని వెచ్ఛా కేశవరావు ఇంట్లో లేని సమయంలో భార్య లక్ష్మి, కుమారుడు కిరణ్‌కుమార్‌ను ఇనుప రాడ్‌తో మోది హత్య చేసి బంగారాన్ని దోచుకున్నారు. ఈ నేపథ్యంలో నిందితులను పట్టుకొని చార్జ్‌షీట్ దాఖలు చేశారు. నేరం రుజువైనందున జీవితకాల ఖైదు, పది సంవత్సరాలు జైలు శిక్ష, రూ.2 వేలు జరిమాన విధించారు. జరిమాన కట్టకపోతే మరో ఆరు నెలలు జైలు శిక్ష విధించారు. 450 ఐపీసీ సెక్షన్ కింద పది సంవత్సరాలు జైలు శిక్ష, రెండు వేలు జరిమానా కట్టకపోతే ఆరు నెలలు జైలు శిక్ష విధించగా, 397 సెక్షన్ కింద∙ఏడు సంవత్సరాలు జైలు శిక్షను విధిస్తూ జడ్జి ఎం.భవిత తీర్పు చెప్పినట్టు తెలిపారు. ఈ మూడు సెక్షన్లు ఏకకాలంలో అమలు జరగుతాయని తెలిపారు. -
భార్యను హత్య చేసి జీవితాంతం జైలులో..
ఈరోడ్: భార్యను హత్య చేసిన కేసులో ఓ స్థానిక కోర్టు 51 ఏళ్ల వ్యక్తికి జీవిత కారాగార శిక్షను విధించింది. పోలీసుల వివరాల ప్రకారం సమియన్నన్ అనే కార్మికుడు తొలుత తన భార్య పాలనియమ్మాల్ పై అనుమానం పెంచుకున్నాడు. దాంతో తరుచూ భార్యతో గొడవకు దిగేవాడు. దీంతో ప్రతి రోజు అతడి హింసను భరించలేని ఆమె భర్త నుంచి విడిపోయి వేరుగా ఉంటోంది. అయితే, 2014 ఏప్రిల్ 20న భార్య వద్దకు వెళ్లిన సమియన్నన్ తనతో రావాల్సిందిగా కోరాడు. అందుకు నిరాకరించకపోవడంతో వెంటనే కత్తితో పలుమార్లు ఆమెను పొడిచి హత్య చేశాడు. దీంతో ఈ కేసును విచారించిన స్థానిక కోర్టు అతడికి జైలు శిక్షను విధించింది. -
ఆ తండ్రికి జీవిత ఖైదు
హైదరాబాద్: తనకు పుట్టలేదనే అనుమానంతో నాలుగేళ్ల కుమారున్ని పాశవికంగా హత్య చేసిన కేసులో నిందితుడు మిరియాల సత్యనారాయణ అలియాస్ చంటికి నాంపల్లి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అలాగే రూ. 2 వేలు జరిమానా చెల్లించాలని మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి రజని బుధవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ తరఫున పీపీ ఉప్పు బాలబుచ్చయ్య వాదనలు వినిపించారు. వివరాలు.. కృష్ణా జిల్లా నందిగామ ప్రాంతానికి చెందిన సత్యనారాయణ, శ్రీలక్ష్మి దంపతులు నగరంలోని చంపాపేట రెడ్డికాలనీలో నివసించేవారు. శ్రీలక్ష్మికి వివాహేతర సంబంధాలు ఉన్నాయంటూ అనుమానిస్తూ సత్యనారాయణ తరచుగా ఘర్షణ పడుతుండేవాడు. శ్రీలక్ష్మి ఇంట్లో లేని సమయంలో.. 2013 సెప్టెంబరు 5న కుమారుడు వెంకటసాయి (4)ని గొంతు నులిమి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. తర్వాత సత్యనారాయణ కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని అన్ని ఆధారాలతో కోర్టుకు చార్జిషీట్ సమర్పించారు. -
హత్య కేసులో యావజ్జీవ శిక్ష
తెనాలి (గుంటూరు): హత్య కేసులో ముగ్గురు ముద్దాయిలకు యావజ్జీవ శిక్ష, జరిమానా విధిస్తూ సోమవారం న్యాయమూర్తి తీర్పు చెప్పారు. దీనికి సంబంధించి ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం వివరాలు.. పాత కక్షల నేపథ్యంలో గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం లింగినేనివారిపాలెంకు చెందిన లింగినేని మురళీబాబు 2011 డిసెంబరు 12న హత్యకు గురయ్యాడు. కేసును అప్పటి రేపల్లె సీఐ కె. శ్రీనివాసరావు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితులను అదే గ్రామానికి చెందిన సోమరౌతు రాజా, లింగినేని దుర్గాప్రసాద్, సోమరౌతు భుజంగరావుగా గుర్తించి, పొలం నుంచి ఇంటికి వస్తున్న మురళీబాబును వెంటాడి హతమార్చారని చార్జిషేట్ దాఖలు చేశారు. కేసు సోమవారం విచారణకు రావడంతో సాక్షాధారాలను పరిశీలించిన 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం. వెంగయ్య నిందితులకు శిక్ష విధిస్తూ తీర్పుచెప్పారు.