హత్య కేసులో యావజ్జీవ శిక్ష | life time prison of murder case | Sakshi
Sakshi News home page

హత్య కేసులో యావజ్జీవ శిక్ష

Published Mon, Jun 8 2015 8:45 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

life time prison of murder case

తెనాలి (గుంటూరు): హత్య కేసులో ముగ్గురు ముద్దాయిలకు యావజ్జీవ శిక్ష, జరిమానా విధిస్తూ సోమవారం న్యాయమూర్తి తీర్పు చెప్పారు. దీనికి సంబంధించి ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం వివరాలు.. పాత కక్షల నేపథ్యంలో గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం లింగినేనివారిపాలెంకు చెందిన లింగినేని మురళీబాబు 2011 డిసెంబరు 12న హత్యకు గురయ్యాడు. కేసును అప్పటి రేపల్లె సీఐ కె. శ్రీనివాసరావు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

నిందితులను అదే గ్రామానికి చెందిన సోమరౌతు రాజా, లింగినేని దుర్గాప్రసాద్, సోమరౌతు భుజంగరావుగా గుర్తించి, పొలం నుంచి ఇంటికి వస్తున్న మురళీబాబును వెంటాడి హతమార్చారని చార్జిషేట్ దాఖలు చేశారు. కేసు సోమవారం విచారణకు రావడంతో సాక్షాధారాలను పరిశీలించిన 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం. వెంగయ్య నిందితులకు శిక్ష విధిస్తూ తీర్పుచెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement