హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు
Published Tue, Aug 30 2016 11:28 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
ఇచ్ఛాపురం రూరల్: ఎనిమిదేళ్ల క్రితం తల్లీకొడుకులను హత్య చేసిన ఘటనలో ఇచ్ఛాపురానికి చెందిన ఇద్దరు నిందితులకు మంగళవారం సోంపేట ఆరవ అదనపు జిల్లా సెషన్స్ కోర్ట్ జీవితకాల కారాగార శిక్ష విధించినట్లు రూరల్ ఎస్‌ఐ ఎం.చిన్నంనాయుడు తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గొల్లవీధికి చెందిన డి.బలరాంరెడ్డి, సి.హెచ్.గోపి 2008 ఆగస్టు 8 రాత్రి కేశవ జ్యూయలర్ యజమాని వెచ్ఛా కేశవరావు ఇంట్లో లేని సమయంలో భార్య లక్ష్మి, కుమారుడు కిరణ్‌కుమార్‌ను ఇనుప రాడ్‌తో మోది హత్య చేసి బంగారాన్ని దోచుకున్నారు. ఈ నేపథ్యంలో నిందితులను పట్టుకొని చార్జ్‌షీట్ దాఖలు చేశారు.
నేరం రుజువైనందున జీవితకాల ఖైదు, పది సంవత్సరాలు జైలు శిక్ష, రూ.2 వేలు జరిమాన విధించారు. జరిమాన కట్టకపోతే మరో ఆరు నెలలు జైలు శిక్ష విధించారు. 450 ఐపీసీ సెక్షన్ కింద పది సంవత్సరాలు జైలు శిక్ష, రెండు వేలు జరిమానా కట్టకపోతే ఆరు నెలలు జైలు శిక్ష విధించగా, 397 సెక్షన్ కింద∙ఏడు సంవత్సరాలు జైలు శిక్షను విధిస్తూ జడ్జి ఎం.భవిత తీర్పు చెప్పినట్టు తెలిపారు. ఈ మూడు సెక్షన్‌లు ఏకకాలంలో అమలు జరగుతాయని తెలిపారు.
Advertisement