హైదరాబాద్: తనకు పుట్టలేదనే అనుమానంతో నాలుగేళ్ల కుమారున్ని పాశవికంగా హత్య చేసిన కేసులో నిందితుడు మిరియాల సత్యనారాయణ అలియాస్ చంటికి నాంపల్లి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అలాగే రూ. 2 వేలు జరిమానా చెల్లించాలని మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి రజని బుధవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ తరఫున పీపీ ఉప్పు బాలబుచ్చయ్య వాదనలు వినిపించారు. వివరాలు.. కృష్ణా జిల్లా నందిగామ ప్రాంతానికి చెందిన సత్యనారాయణ, శ్రీలక్ష్మి దంపతులు నగరంలోని చంపాపేట రెడ్డికాలనీలో నివసించేవారు.
శ్రీలక్ష్మికి వివాహేతర సంబంధాలు ఉన్నాయంటూ అనుమానిస్తూ సత్యనారాయణ తరచుగా ఘర్షణ పడుతుండేవాడు. శ్రీలక్ష్మి ఇంట్లో లేని సమయంలో.. 2013 సెప్టెంబరు 5న కుమారుడు వెంకటసాయి (4)ని గొంతు నులిమి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. తర్వాత సత్యనారాయణ కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని అన్ని ఆధారాలతో కోర్టుకు చార్జిషీట్ సమర్పించారు.
ఆ తండ్రికి జీవిత ఖైదు
Published Wed, Jun 24 2015 7:18 PM | Last Updated on Sun, Sep 3 2017 4:18 AM
Advertisement