
టీవీ యాంకర్‌ను వేధిస్తున్న యువకులు
లక్నో: ఓ టీవీ యాంకర్‌ను మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు వేధించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని సదరు యాంకర్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయగా వైరల్ అయింది. ఓ టీవీ చానెల్‌లో యాంకర్‌గా పనిచేసే దామిని విధులు పూర్తి చేసుకుని అర్థరాత్రి సమయంలో బైక్ పై ఇంటికి వెళ్తున్నారు. ఈ తరుణంలో ఆమెను ఇద్దరు ఆకతాయిలు బైక్‌పై వెంబడించారు. రూట్ మార్చి వారి నుంచి తప్పించుకున్న దామిని వారి ఫొటోలను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశారు.
‘ఉత్తరప్రదేశ్ ఆగ్రాలోని ఎంజీ రోడ్ భగవాన్ టాకీస్ నుంచి తనను ఇద్దరు వెంబడించారు. తొలుత వెక్కరించడం మెదలు పెట్టిన వారు ఏదో మాట్లాడాలని ప్రయత్నించారు. వారి బైక్ నెంబర్ ప్లేట్‌ను ఫొటో తీయాలని ప్రయత్నించా కానీ అది నకిలీది. నేను వెంటనే రూట్ మార్చి తప్పించుకున్నాను. పోలీస్ హెల్ప్‌లైన్ నెంబర్ 1090కి ఫోన్ చేసిన స్పందించలేదు. ఈ రోజు వీరిని వదిలేస్తే రేపు రేప్ చేయడానికి వెనకాడరు. ఇది యూపీ పోలీస్ వ్యవస్థకు షేమ్’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
గత గురువారం ఆమె ఈ పొస్ట్‌ను యూపీ డీజీపీ, సీఎం, మహిళల హెల్ప్‌లైన్‌కు ట్యాగ్ చేశారు. దీనికి స్పందించిన పోలీస్ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించిన 1090 సిబ్బందిపై చర్యలు తీసుకుంది. కేసు నమోదు చేసి మూడురోజుల్లో నిందితులిద్దరిని అరెస్ట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment