stalk
-
టీవీ యాంకర్‌ను వేధించిన యువకులు
లక్నో: ఓ టీవీ యాంకర్‌ను మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు వేధించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని సదరు యాంకర్ ఫేస్బుక్లో పోస్ట్ చేయగా వైరల్ అయింది. ఓ టీవీ చానెల్లో యాంకర్‌గా పనిచేసే దామిని విధులు పూర్తి చేసుకుని అర్థరాత్రి సమయంలో బైక్ పై ఇంటికి వెళ్తున్నారు. ఈ తరుణంలో ఆమెను ఇద్దరు ఆకతాయిలు బైక్‌పై వెంబడించారు. రూట్ మార్చి వారి నుంచి తప్పించుకున్న దామిని వారి ఫొటోలను ఫేస్బుక్లో అప్లోడ్ చేశారు. ‘ఉత్తరప్రదేశ్ ఆగ్రాలోని ఎంజీ రోడ్ భగవాన్ టాకీస్ నుంచి తనను ఇద్దరు వెంబడించారు. తొలుత వెక్కరించడం మెదలు పెట్టిన వారు ఏదో మాట్లాడాలని ప్రయత్నించారు. వారి బైక్ నెంబర్ ప్లేట్‌ను ఫొటో తీయాలని ప్రయత్నించా కానీ అది నకిలీది. నేను వెంటనే రూట్ మార్చి తప్పించుకున్నాను. పోలీస్ హెల్ప్‌లైన్ నెంబర్ 1090కి ఫోన్ చేసిన స్పందించలేదు. ఈ రోజు వీరిని వదిలేస్తే రేపు రేప్ చేయడానికి వెనకాడరు. ఇది యూపీ పోలీస్ వ్యవస్థకు షేమ్’ అని ఆవేదన వ్యక్తం చేశారు. గత గురువారం ఆమె ఈ పొస్ట్ను యూపీ డీజీపీ, సీఎం, మహిళల హెల్ప్‌లైన్‌కు ట్యాగ్ చేశారు. దీనికి స్పందించిన పోలీస్ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించిన 1090 సిబ్బందిపై చర్యలు తీసుకుంది. కేసు నమోదు చేసి మూడురోజుల్లో నిందితులిద్దరిని అరెస్ట్ చేసింది. -
'వెంటాడి అర్థరాత్రి నా తలుపు కొట్టాడు'
ముంబయి: హరియాణాకు చెందిన యువతి వర్ణికా కుందును ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ కుమారుడు వేధించిన సంఘటన సంచనలం సృష్టిస్తుండగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తనను కారులో వెంబడించడమే కాకుండా ఇంటి వరకు వచ్చి అర్థరాత్రి 2గంటలకు తలుపు కొట్టాడని అదితి నాగ్పౌల్ అనే ఫ్యాషన్ డిజైనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇద్దరు పిల్లలతో కలిసి వస్తుండగా అతడు వెంబడించాడని, అతడి కళ్లల్లో ఏ మాత్రం భయం కనిపించలేదని ఆమె ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అనంతరం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీటీవీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులు దాని ఆధారంగా ప్రత్యేక టీంలు ఏర్పాటుచేసి సదరు వ్యక్తిని అరెస్టు చేశారు. ఆ వ్యక్తి ఓ ఐటీ ప్రొఫెషనల్ అని, నితేశ్ కుమార్ శర్మ(36) అనే వ్యక్తిగా తాము గుర్తించామని తెలిపారు. సీసీటీవీలో రికార్డయిన వీడియోల ప్రకారం మలాద్ ప్రాంతానికి శర్మ అర్ధరాత్రి 2గంటల ప్రాంతంలో అదితి డోర్ బెల్ కొట్టాడని, ఆ తర్వాత సీసీటీవీ కెమెరాను గుర్తించి కొంచెం దూరంగా వెళ్లి నిల్చొని వెళ్లిపోయాడని, అతడు మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ప్రస్తుతానికి అతడిని అరెస్టు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. ఈ సందర్భంగా ముంబయి పోలీసులకు హ్యాట్సాప్ అంటూ ఆమె అతడి అరెస్టుకు సంబంధించిన ఓ వీడియోను తాజాగా ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.