
జబర్దస్త్ కామెడీ షోతో ఫేమస్ అయింది వర్ష. ఆన్ స్క్రీన్‌పై కమెడియన్ ఇమ్మాన్యుయేల్‌తో జోడీ కట్టి పాపులారిటీ సంపాదించుకుంది. తాజాగా ఈ బుల్లితెర బ్యూటీ 'ఎంగేజ్‌మెంట్ అయిపోయింది, పెళ్లి కొడుకు ఎవరో తెలుసా?' అంటూ యూట్యూబ్‌లో వీడియో షేర్ చేసింది. ఏంటి? ఇంత సడన్‌గా పెళ్లి కబురు చెప్పిందేంటా? అని అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు.
'సడన్‌గా రాత్రికి రాత్రే ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ చేశారు. నేను చాలా షాకయ్యాను. కొన్ని పరిస్థితుల వల్ల ఎవరికీ చెప్పకుండానే సడన్‌గా ఎంగేజ్‌మెంట్ జరగబోతోంది. నాకైతే చాలా సిగ్గేస్తోంది. పెళ్లికొడుకు ఎలా ఉంటాడు? అనేది వీడియో చివర్లో చూపిస్తాను' అంటూ తన దగ్గరున్న చీరలు, నగలు అన్నింటనీ చూపించింది. అందులో ఒక చీరను, దానికి సూటయ్యే నగలను పెట్టుకుని ఎలాగోలా ముస్తాబైంది. చివర్లో మాత్రం ఎంగేజ్‌మెంట్ తనది కాదని షాకిచ్చింది. రాకింగ్ రాకేశ్ రాత్రికి రాత్రే ఎంగేజ్‌మెంట్ అన్నాడు. త్వరగా రెడీ అయి వచ్చేశాను. నా ఎంగేజ్‌మెంట్ గురించి కూడా త్వరలో చెప్తానులే అంటూ ట్విస్ట్ ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్లు మరీ అంత సిగ్గుపడినప్పుడే ఇదంతా ప్రాంక్ అని అర్థం చేసుకోవాల్సిందంటూ కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment