Jabardasth Comedian Kevvu Karthik To Open New Chapter In His Life - Sakshi
Sakshi News home page

Kevvu Karthik: పెళ్లిపీటలెక్కనున్న జబర్దస్త్‌ కమెడియన్‌! అమ్మాయెవరో సస్పెన్స్‌

Published Thu, Jun 1 2023 5:47 PM | Last Updated on Thu, Jun 1 2023 6:52 PM

Jabardasth Comedian Kevvu Karthik to Open New Chapter in Life - Sakshi

తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో కలిసి దిగిన ఫోటోలను షేర్‌ చేశాడు. అయితే ఇందులో ఆ అమ్మాయి

జబర్దస్త్‌ కమెడియన్‌ కెవ్వు కార్తీక్‌ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ శుభవార్తను అతడే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడు. మన జీవితంలోకి కొత్త వ్యక్తి వస్తే లైఫ్‌ మరింత హ్యాపీగా మారుతుందని కొందరు చెప్పారు. బహుశా అది ఇదేనేమో! నా జీవితంలోకి అడుగుపెడుతున్నందుకు థ్యాంక్యూ. నీతో కొత్త జీవితాన్ని ఆరంభించేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నాను అని రాసుకొచ్చాడు.

తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో కలిసి దిగిన ఫోటోలను షేర్‌ చేశాడు. అయితే ఇందులో ఆ అమ్మాయి ముఖాన్ని మాత్రం కనిపించనివ్వలేదు. ఈ పోస్ట్‌కు నటులు ప్రియాంక సింగ్‌, అభినవ్, గెటప్‌ శ్రీను తదితరులు శుభాకాంక్షలు చెప్తూ కామెంట్లు చేశారు. కాగా కెవ్వు కార్తీక్‌ ఎన్నో కష్టాలు దాటుకుని సెలబ్రిటీ స్థాయికి ఎదిగాడు.

ఓపక్క ఇంజనీరింగ్‌ చదువుతూనే మిమిక్రీలో డిప్లొమా పూర్తి చేసిన అతడు ఎంటెక్‌ చేసి ఉద్యోగం సంపాదించాడు. కానీ మిమిక్రీ, కామెడీపై ఉన్న ప్యాషన్‌తో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. తర్వాత హైదరాబాద్‌ వచ్చి మిమిక్రీ ఆర్టిస్టుగా స్టేజీ షోలు చేశాడు. అనంతరం కామెడీ క్లబ్‌, జబర్దస్త్‌ షోలలో మెరిశాడు. జబర్దస్త్‌లో ఒక టీమ్‌లో సభ్యుడిగా మాత్రమే ఉన్న కార్తీక్‌ తర్వాత టీమ్‌ లీడర్‌గా మారాడు.

చదవండి: డబ్బు కోసమే సల్మాన్‌ ఖాన్‌ చెల్లితో పెళ్లి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement