
నటి, యాంకర్ వర్ష కరోనాను జయించింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దీంతో ఆమె అభిమానులు, శ్రేయోభిలాషులు ఊపిరి పీల్చుకుంటున్నారు. వర్ష ఈజ్ బ్యాక్ అంటూ సంతోషంగా కామెంట్లు చేస్తున్నారు. అలా కోవిడ్ నుంచి బయటపడిందో లేదో అప్పుడే సందడి మొదలు పెట్టేసింది వర్ష.
తన సోదరి కుసుమ పుట్టినరోజు పురస్కరించుకుని ఓ స్పెషల్ గిఫ్ట్‌ను తీసుకెళ్లి ఆమెను సర్‌ప్రైజ్ చేసింది. ఈ మేరకు పలు ఫొటోలను, చిన్నపాటి వీడియోలను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసింది. కానీ బర్త్‌డే ఫంక్షన్‌లో తన సోదరితో దిగిన ఫొటోలను మాత్రం చూపించలేదు. ఏం గిఫ్ట్ ఇచ్చిందనేది కూడా సస్పెన్స్‌గా ఉంచింది. ఏదేమైనా పది రోజుల్లోనే ఆ మహమ్మారి బారి నుంచి వర్ష బయటపడటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తిరిగి తను షూటింగ్స్‌లో పాల్గొనుండటంతో బుల్లితెర మీద ఆమె సందడి చూసేందుకు ఎదురు చూస్తున్నామంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment