నిబంధనలకు లోబడి ఆస్పత్రిని నడుపుతామని చెబుతున్న డాక్టర్ సుప్రజచౌదరి
అనంతపురం న్యూసిటీ:నిబంధనలకు విరుద్ధంగా రక్తమార్పిడి చేయడం..ఇతర కారణాలతో గత నెల 21న సీజ్ చేసిన వర్ష ఆస్పత్రిని తిరిగి నిర్వహించుకునేందుకు అధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. వాస్తవానికి రెండు రోజుల క్రితమే నిర్వాహకులు ఆస్పత్రిని తెరిచినా అధికారులు పట్టించుకోలేదు. విమర్శలు రావడంతో సోమవారం రాత్రి డీఎంహెచ్‌ఓ కేవీఎన్‌ఎస్ అనిల్‌కుమార్, అడ్వైజరీ కమిటీ సభ్యులు డాక్టర్ సిరప్ప , డాక్టర్ కొండయ్య, రవీంద్రనాథ్‌రెడ్డి ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఆస్పత్రిలో ఆరుపడకలకు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలన్నారు.
ధరల పట్టికతో పాటు ఆస్పత్రి రిజిస్ట్రేషన్‌ను కన్పించేలా ఉంచాలన్నారు. రష్యాలో ఎండీ చేసినా ఇక్కడ ఎంబీబీఎస్‌గానే పరిగణిస్తారని, ఆ మేరకు ప్రిస్క్రిప్షన్, ఆస్పత్రి బోర్డులో హోదా మార్పు చేసుకోవాలన్నారు. ఆపరేషన్ థియేటర్ సర్జరీలు చేయరాదన్నారు. నిబంధనలకు లోబడి ఈ నెల 21 నుంచి ఆస్పత్రిని నిర్వహించుకోవచ్చన్నారు. కాగా సీజ్ చేసిన అధికారులే తిరిగి అనుమతులివ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment