
ఆసుపత్రిలో ఆందోళనకు దిగిన మృతుల బంధువులు
తాడిపత్రి : తమ పిల్లలను ఎవరో హత్య చేసి, చెరువులో పడేశారంటూ.. వారెవరో గుర్తించి కఠినంగా శిక్షించాలంటూ పవన్, బాలాజీ బంధువులు తాడిపత్రి ప్రభుత్వాస్పత్రిలో ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. యల్లనూరు మండలం చిలమకూరు సమీపంలోని చిత్రావతి నదిలో విద్యార్థులు పవన్ (8), బాలజీలు ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సోమవారం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉంది. కానీ విద్యార్థుల తల్లిదండ్రులు, సమీప బంధువులు తమ పిల్లలు ప్రమాదవశాత్తు చనిపోలేదని, ఎవరో హత్య చేసి నదిలోని నీటిగుంటలో పడేశారని ఆరోపించారు.
ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేంత వరకు పోస్టుమార్టం నిర్వహించేందుకు వీలులేదని ఆందోళనకు దిగారు. పోలీసులు కొందరిని కాపాండేందుకు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. అర్బన్, రూరల్ సీఐలు సురేందర్‌రెడ్డి, సురేంద్రనాథ్‌రెడ్డిలు ఆస్పత్రికి చేరుకుని విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేశారు.

విద్యార్థుల మృతదేహాలు
Comments
Please login to add a commentAdd a comment